Search
  • Follow NativePlanet
Share
» »ఈ మ్యూజియంలను చూశారా?

ఈ మ్యూజియంలను చూశారా?

భారత దేశంలో ఉత్తమ మ్యూజియంలకు సంబంధించిన జాబితా

వస్తుసంగ్రహణాలయం....ఒక ప్రాంత, ఒక జాతి, ఒక దేశ సంస్కతి సంప్రదాయాలకు, చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనం. ఇందులో ఉన్నటువంటి ఎన్నో వస్తువులు మన పూర్వికుల నడవడికతో పాటు వారి జయాలు, అపజయాలు కూడా తెలియజేస్తాయి. గత చరిత్ర నుంచి వర్తమానంలో మనం ఎలా ఉండాలన్నదానితో పాటు ఉత్తమ భవిష్యత్ కోసం ఏమి చేయాలన్న విషయాన్ని కూడా తెలియజేస్తాయి. ఈ నేపథ్యంలో భారత దేశంలో ముఖ్యమైన, విభిన్న మ్యూజియంలకు సంబంధించిన విషయాలు మీ కోసం...

డాన్ బాస్కో సెంటర్ ఫర్ ఇండీజీనస్ కల్చర్

డాన్ బాస్కో సెంటర్ ఫర్ ఇండీజీనస్ కల్చర్

P.C: You Tube

ఉత్తర భారతదేశ గిరిజన తెగల సంస్క`తి సంప్రదాయాలకు ఈ మ్యూజియం అద్దం పడుతుంది. ఈ డాన్ బాస్కో సెంటర్ ఫర్ ఇండీజీనస్ కల్చర్ మ్యూజియం షిల్లాంగ్‌లో ఉంది. మొత్తం పదిహేను గ్యాలరీలు, మూడు అంతస్తులతో ఉన్న ఈ మ్యూజియం చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ వందల ఏళ్లకు పూర్వం ఉన్న ఆహార, ఆయుధ సంబంధ వస్తువులను కూడా చూడొచ్చు.

ట్రైబల్ మ్యూజియం

ట్రైబల్ మ్యూజియం

P.C: You Tube

మధ్యప్రదేశ్‌ సంస్క`తి, సంప్రదాయాలకు ప్రతి బింబం ఈ ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉంది. ముఖ్యంగా గిరిజన తెగలు వినియోగించే వస్తువులను ఇక్కడ మనం చూడవచ్చు. వందల ఏళ్ల క్రితం గిరిజన తెగలు వినియోగించిన వస్తువుల నుంచి నేటి తరం వినియోగిస్తున్న అన్ని రకాల వస్తువులకు ఈ మ్యూజియంలో చోటు కల్పించారు. భోపాల్ వెళ్లినవారు ఖచ్చితంగా ఈ మ్యూజియంకు వెలుతారు.

జై సల్మీర్ వార్ మ్యూజియం

జై సల్మీర్ వార్ మ్యూజియం

P.C: You Tube

భారత త్రివిధ దళాలకు సంబంధించిన ఆయుధాలు, రికార్డులను ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ యుద్ధంలో వినియోగించిన భారత ఆయుధాలతో పాటు పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకొన్న ఆయుధాలను కూడా మనం చూడొచ్చు. అదే విధంగా యుద్ధంలో అమరులైన వారి వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి.

టెక్స్‌టైల్ మ్యూజియం, అహ్మదాబాద్

టెక్స్‌టైల్ మ్యూజియం, అహ్మదాబాద్

P.C: You Tube

అహ్మదాబాద్‌లోని ఈ మ్యూజియం భారతదేశంతో పాటు ప్రపంచ వస్త్ర రంగంలో వచ్చిన అనేక మార్పులకు సంబంధించిన విషయాలను, వస్తువులతో పాటు గ్రంధాలు, పుస్తకాల రూపంలో ఇక్కడ భద్రపరిచారు. ఇప్పుడిప్పుడే వీటిని డిజిటలైజేషన్ కూడా చేస్తున్నారు. ఈ మ్యూజియం కాలికో మిల్స్ అనే ప్రాంతంలో ఉంది.

హెరిటేజ్ ట్రాన్స్ పోర్ట్ మ్యూజియం

హెరిటేజ్ ట్రాన్స్ పోర్ట్ మ్యూజియం

P.C: You Tube

గుర్‌గ్రామ్‌లో ఉన్నటువంటి ఈ మ్యూజియంకు చాలా ప్రత్యేకత ఉంది. భారత, ప్రపంచ రవాణా వ్యవస్థలో వచ్చిన మార్పులకు సంబంధించి సంవత్సరాల వారిగా ఇక్కడ మనకు సమాచారం దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ వింటేజ్ కార్లు కూడా మనం సందర్శించవచ్చు. ఇది ఒక ప్రైవేట్ మ్యూజియం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+