Search
  • Follow NativePlanet
Share
» »ప్రతి రోజూ దుప్పటి నలిగి...పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే

ప్రతి రోజూ దుప్పటి నలిగి...పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే

భారత దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో నిఘూడ రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అటువంటిదే నిధివన్ ఆలయం. అక్కడి నిఘూడ రహస్యాలతో కూడిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

By Beldaru Sajjendrakishore

మనదేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. వీటిలో కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని భావించి చాలా మంది తమ జీవిత కాలం వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయారు. ఈ కోవకు చెందినదే మధురలోని నిధివన్. ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. వాటి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. ద్వాపర యుగం నుంచి రహస్యం

1. ద్వాపర యుగం నుంచి రహస్యం

Image source

ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని మధుర జిల్లాలోని బృందావనలోని ఉన్న నిధివన్ రహస్యం ద్వాపరయుగంలోని రాధ, రాధకృష్ణలతో ముడి పడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికుల నమ్మకం.

2. అదృశ్య రూపంలో కాపాలా

2. అదృశ్య రూపంలో కాపాలా

Image source

అంతేకాకుండా రాధకృష్ణలు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు రాత్రి పూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపాలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం.

3. పక్షులు కూడా ఉండవు

3. పక్షులు కూడా ఉండవు

Image source

అందువల్లే నిధివన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్ కు ప్రవేశించే ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్లవు.

4. ఇదే నిదర్శనం

4. ఇదే నిదర్శనం

Image source

ఇందుకు నిదర్శనంగా ఉదయం వందల సంఖ్యలో కోతులు ఉండే నిధివన్ లో రాత్రి అయిన వెంటనే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో కనిపించదు. అదే విధంగా అనేక చెట్ల పైన ఉదయం పూట కనిపించే పక్షి కూడా రాత్రి సమయంలో అక్కడ ఉండదు.

5. చనిపోవడం లేదా మతిస్థిమితిని కోల్పోతారు

5. చనిపోవడం లేదా మతిస్థిమితిని కోల్పోతారు

Image source

ఒక వేళ కట్టుబాటులను ధిక్కరించి ఈ నాట్యాన్ని చూసిన వారు చనిపోతారని లేదా మతిస్థిమితం కోల్పోతారని చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. అంతేకాకాండా ఆ వనానికి ఎదురుగా వాకిళ్లు వచ్చేలా ఇంటి నిర్మాణం కూడా చేపట్టరు. ఇక రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గరగా ఉన్న ఇళ్లలోని వారు వనం వైపు ఉన్న కిటికీలను కూడా మూసివేస్తారు.

6. పట్టీల శబ్ధం

6. పట్టీల శబ్ధం

Image source

ఇక రాత్రి సమయంలో వేణు నాదం అంటే పిల్లనిగోవి వాయుస్తున్న శబ్ధంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతారు. కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు న`త్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల నమ్మకం.

7.మొక్కలా, గోపికలా

7.మొక్కలా, గోపికలా

Image source

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే నిధివన్ లో ఉన్న మొక్కల కాండాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక భూమి పై ఒక్క చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ చెట్లే రాత్రి పూట గోపికలుగా మారి నాట్యం చేస్తుంటారని చెబుతారు.

8. అక్కడే ఏకాంతంగా గడుపుతారు

8. అక్కడే ఏకాంతంగా గడుపుతారు

Image source

వనం మధ్యలో ఉన్న రంగమహల్ లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్లు తోముకోవడానికి రెండు వేపపుళ్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తులు అక్కడ ఉంచుతారు.

9. ఉదయానికి ఇలా

9. ఉదయానికి ఇలా

Image source

ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూళం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచం పై ఉన్నదుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు.

10. ఛానల్ వారు విఫలయత్నం

10. ఛానల్ వారు విఫలయత్నం

Image source

ఇటీవల ఓ ఛానల్ వారు ఈ రహస్యం కనుగొనాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆలయ తాళాలు వేసి ఉన్నవి వేసినట్లే ఉన్నా ఉదయానికి రంగమహల్ లో మంచం పై దుప్పట్లు చెదిరి పోయి ఉండగా వెండి గ్లాసులు పాలు సంగం ఖాళీ అయ్యి కనిపించాయి.

11. గోపిక దప్పిక తీర్చడానికి

11. గోపిక దప్పిక తీర్చడానికి

Image source

ఇక్కడ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. విశఆఖ అనే కోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. నిధివన్ కు వెళ్లినవారు ప్రధాన ఆలయమైన రంగమహల్ లోని రాధకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ ను దర్శించుకుని వస్తారు.

12. ఎన్నో ఆలయాలు

12. ఎన్నో ఆలయాలు

Image source

ఈ నిధివన్ చూసిన భక్తులు తప్పక కృష్ణుడి బాల్యంతో ముడి పడి ఉన్న మధురను అక్కడి ఉన్న అనేక దేవాలయాలను తప్పక దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం రాధ కృష్ణులవి కావడం గమనార్హం.

13. ఎక్కడ ఉంది.

13. ఎక్కడ ఉంది.

Image source

ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలో బృందావన్ ఉంది. ఇక్కడే మన నిధివన్ ఉంటుంది. మధుర నుంచి బ`ందావన్ కు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 26 నిమిషాలు ప్రయాణం. ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తీసి ఉంటారు.

14. ఎలా వెళ్లాలి..

14. ఎలా వెళ్లాలి..

Image source

మధుర నుంచి బృందావన్ కు రైలు సదుపాయం బాగా ఉంది. ఇక్కడకు నేరుగా విమాన యానసదుపాయం లేదు. దగ్గరల్లో కేరియా ఎయిర్ పోర్ట్ ఉంది అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం ద్వార బృందావన్ చేరుకోవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+