Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ కొలువైన గోవిందుడు మత్స్యావతారుడు!

ఇక్కడ కొలువైన గోవిందుడు మత్స్యావతారుడు!

ఇక్కడ కొలువైన గోవిందుడు మత్స్యావతారుడు!

ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణా శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిల్లో మొదటిదీ వేదాలకు పునర్జన్మను ప్రసాదించిందీ మత్స్యావతారం. అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం. ఇక్కడ స్వామి వారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు.

స్థలపురాణము

స్థలపురాణము

మనిషి పుట్టుక నుంచీ మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి, ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.

సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి

సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి

మరోవైపు... వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి ఎన్ని రోజులకీ ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమ్మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెబుతారు. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది.

సూర్యపూజోత్సవం

సూర్యపూజోత్సవం

శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేడమే సూర్యపూజోత్సవం. ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.

చారిత్రకాంశాలు

చారిత్రకాంశాలు

శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ 15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదనారాయణస్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు.

చోళరాజుల అనంతరం

చోళరాజుల అనంతరం

చోళరాజుల అనంతరం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆలయ ఉత్తర గోపురం మీది శాసనం తెలియజేస్తోంది. రాయలనాటి శిలానైపుణ్యం ప్రదర్శితమయ్యేలా ఆలయ గోడలను తీర్చిదిద్దారు. పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్మించి అనేక దానములు చేసి తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది.

పూజలు

పూజలు

ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చింది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.

ఆలయ విశేషాలు

ఆలయ విశేషాలు

ఈ ఆలయ ప్రధాన గోపురమందున్న ద్వారము అతి విశాలముగా..ఎత్తుగా.. నున్నది. దానిపైనుండిన గోపురము కూలిపోగా.... తి.తి.దేవస్థానం వారు కొత్తగా గోపురాన్ని నిర్మించారు. కనుక ఇది చిన్నదిగానున్నది. ఈ గోపురం నుండి సాగిన ప్రహరీలో కుడి ఎడమలకు మరో రెండు గోపురములు ఉన్నాయి. అవి ఆనాటివైనందున శిథిలావస్థలో నున్నందున ఇనుప స్తంభాలతో భద్రపరిచారు. ఈ ప్రాకారంలో కొబ్బరి తోట, పూల తోటలు ఉన్నాయి. మరెటువంటి కట్టడాలు లేవు. ఈ ఆవరణంలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రాన్ని చూడవచ్చు.

 ఆలయ విశేషాలు

ఆలయ విశేషాలు

ఆ తరువాత రెండో గోపురముతో చుట్టబడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయమున్నది. అందులోనే కళ్యాణ మండపము, ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాకారంలో నుండి గర్భాలయం లోనికి వెళ్ళవచ్చు. చాల దూరంలో స్వామి వారి మూల విరాట్టు ఉంది. మూల విరాట్టు పాదభాగము మత్స్య రూపంలో ఉండగా, శంఖు, చక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించవచ్చు. ఈ గర్భాలయం చుట్టూ మరో ప్రాంగణము ఉంది. అందులో వరండాలలో అనేక ఉప ఆలయాలు, దేవతా మూర్తులతో అలారారు తున్నవి. గర్భాలయ ప్రదక్షిణకు ఇదే మార్గము.

ఆలయ విశిష్టత

ఆలయ విశిష్టత

ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ఆలయ ద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
ప్రతియేడు మార్చి నెల 23, 24, 25/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. గరుడసేవా, రథోత్సవాలను కన్నుల పండగగా జరుపుతారు. వీటితోపాటు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఆండాళ్‌నీరాట్టు ఉత్సవాలు, నవరాత్రులు...ఇలా ప్రతి పర్వదినాన్నీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

తిరుపతికి 68 కి.మీ., మద్రాసుకు 73 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువైన వేదనారాయణుడిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

రోడ్డుమార్గం ద్వారా వచ్చే వారికి దేశంలోని అన్ని ప్రధాన బస్‌స్టాండ్‌ల నుంచీ బస్సు సౌకర్యం ఉంది. తిరుమల బస్‌స్టాండ్‌ నుంచి ఊత్తుకోట మీదుగా చెన్నై వెళ్లే మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

రైలు, వాయు మార్గాల్లో వచ్చేవారు తిరుపతి లేదా చెన్నై చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి
నాగలాపురం వెళ్లొచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+