కేరళలోని నలంబలం తీర్థయాత్ర ఇటీవల కాలంలో చాలా ప్రాచూర్యం పొందింది. ఏడాదిలో ఎప్పుడైనా ఈ తీర్థయాత్రను చేయవచ్చు. అయితే కేరళ నెల కార్కాడికామ్ నెలలో కేరళవాసులతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఎక్కువగా ఈ తీర్థయాత్రను చేస్తూ ఉంటారు. నలంబలం తీర్థ యాత్ర ఒక రోజులో ముగిసి పోనుంది. వరుసగా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల దేవాలయ సందర్శనమే ఈ తీర్థయాత్ర. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం.....

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
నలంబలం తీర్థయాత్రలో మొదట రామదేవాలయాన్ని సందర్శిస్తారు. దీనిని స్థానికంగా త్రిప్రయార్ శ్రీ రామ మందిరం అని అంటారు. అటు పై లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల దేవాలయాలను వరుసగా సందర్శిస్తారు.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
ఈ దేవాలయాలను స్థానికంగా మూఝికులం లక్ష్మణ దేవాలయం, ఇరింజలకుడ కూడల్మణిక్యం దేవాలయం, పాయమ్మల్ శత్రుఘ్న దేవాలయం అని అంటారు.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
ఈ నాలుగు విగ్రహాలను శ్రీ క`ష్ణ పరమాత్ముడు కూడా పూజించాడని చెబుతారు. ద్వారకలో ఈ విగ్రహాలకు ఆయన స్వయంగా పూజ చేశాడని చెబుతారు. ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయే సమయంలో ఈ నాలుగు విగ్రహాలు నీటిలో తేలుతూ కేరళలోని చీతువా ప్రదేశాన్ని చేరాయి.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
త్రిప్రయార్ లో రామ, ఇరింజలకుడలో భరత, మూజికులంలో లక్ష్మణ, పాయమ్మల్ లో శత్రుఘ్నుల విగ్రహాలను ప్రతిష్టించినట్లు చెబుతారు. నాలంబల అన్న పదం విన్నవెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఎర్నాకులం జిల్లాలోని నాలంబలగల్.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
నాలంబల అంటే నాలుగు దేవస్థానాలు అని అర్థం. శ్రీరామ దేవాలయం నుంచి తీర్థయాత్ర ప్రారంభమవుతుంది. అటు పై ఇంధిజాళక్కుదం లోని కుడల్మనికయం దేవాస్థానానికి చేరుకొంటుంది.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
అటు పై తిరుముళికులంలోని లక్ష్మణ దేవాలయం, పయమ్మలో ఉన్న శత్రుఘ్న దేవాలయాన్ని చేరుకోవడంతో తీర్థయాత్ర ముగుస్తుంది. ఎర్నాకుటం డీటీపీసీ నిర్వహణలో ఈ తీర్థయాత్ర చేపడితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
అందులోనే ఏసీ బస్సులో ప్రయాణం, భోజనం, దేవస్థానాల ప్రసాదం కిట్ ఉంటాయి. నాలుగేళ్ల క్రితం డీటీపీసీ ఈ తీర్థయత్ర ప్యాకేజీనీ ప్రారంభించింది. ఈ యాత్రలో పాల్గొనదలిచిన వారు 04872320800 కు ఫోన్ చేయవచ్చు.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
నలంబలం తీర్థయాత్రలో మొదట సందర్శించేది శ్రీరామ దేవాలయం అని ముందే చెప్పుకొన్నాం. ఈ దేవాలయంలోని విగ్రహం దక్షిణ ముఖంగా ఉంటుంది. సాధారణంగా దక్షిణాభిముఖంగా ఉండే ఈ విగ్రహం మనకు శైవ దేవాలయాల్లో కనిపిస్తుంది.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
ఇక క్రీస్తుశకం 15వ శతాబ్దానికి ముందే కూడల్మాణిక్యం భరత దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం వాస్తుశైలి చాలా బాగుంటుంది. భారతీయ వాస్తుశైలికి అద్దం పడుతుంది.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
ఇక నాలంబల దేవాలయాల్లో లక్ష్మణుడిని పూజించే దేవాలయం తిరుముఝిక్కుల్ దేవాలయం. చళకుడి తీరంలో ఉన్న ఈ దేవాలయానికి కేరళ తిరుపతి అని పేరు. ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారన్న విషయానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు.

నలంబలం తీర్థయాత్ర
P.C: You Tube
నాలంబల దేవాలయాల్లో శత్రుఘ్నుడిని పూజించే దేవాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం సందర్శనతో ఈ నలంబలం తీర్థయాత్ర ముగిసిపోతుంది. మొత్తం నాలుగు దేవాలయాలను కేవలం రూ.600 ఖర్చుతో చూసిరావడం అభినందించదగ్గ విషయమే.



Click it and Unblock the Notifications













