Search
  • Follow NativePlanet
Share
» »స‌హ‌జ ప్ర‌కృతి అందాలు... యారాడ బీచ్ సొంతం...

స‌హ‌జ ప్ర‌కృతి అందాలు... యారాడ బీచ్ సొంతం...

విశాఖ‌ప‌ట్నం బీచ్‌ల‌కు పెట్టింది పేరు... ఇక్క‌డ సంద‌ర్శించేందుకు ఎన్నో అనువైన ప్ర‌దేశాలు ఉన్నాయి. అంద‌మైన జ‌ల‌పాతాలు, అంత‌కంటే మించిన అద్భుత‌మైన పుణ్యక్షేత్రాలు విశాఖ సొంతం. విశాఖ‌లో స‌ముద్ర తీర అందాల‌ను చూడాల‌నుకునేవారు ముందుగా రామ‌కృష్ణ బీచ్‌కే వెళ్తుంటారు. ఎందుకంటే ఈ బీచ్ ప‌ట్ట‌ణానికి అనుకొని ఉంది. అందుకే ఇక్క‌డ సంద‌ర్శ‌కులు తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. అయితే, స‌ముద్ర‌తీర అందాలు వీక్షించేందుకు మ‌రికొన్ని బీచ్‌లు కూడా ఉన్నాయి. అవే.. రుషికొండ‌, భీమిలి బీచ్‌లతో పాటు యారాడ బీచ్‌..

కుటుంబంతో పాటు స‌రాదాగా గ‌డ‌పాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా యారాడ బీచ్‌కు వెళ్లాల్సిందే. ఇక్క‌డికి చేరుకోవాలంటే కొండ‌ల్లో ప్ర‌యాణం చేయాల్సిందే. ఈ ప్ర‌దేశం షూటింగ్ స్పాట్‌గా కూడా ప్ర‌సిద్ధిచెందింది. ఒక‌వైపు స‌ముద్ర‌తీర అందాలు, మ‌రోపైపు ఎత్త‌ని కొండ‌లు, ఎటుచూసిన ప‌చ్చ‌ని చెట్లు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంతో ఈ ప్రాంతం ప‌ర్యాట‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. అందుకే ఈ ప్ర‌దేశంలో సినిమా షూటింగ్‌లు, షార్ట్‌ఫిల్మ్ వంటివెన్నో జ‌రిగాయి. ఇక‌, ఈ మ‌ధ్య‌కాలంలో అయితే, ఈ ప్ర‌దేశం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కి, బేబీ షూట్‌ల‌కు, పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు కూడా ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందింది.

yaradabeach , activities to play

ఫోటో షూటింగ్‌ల‌కు అనువైన ప్ర‌దేశం...

విశాఖ‌ప‌ట్నంలో స‌హ‌జ‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో యారాడ బీచ్ ఒక‌టి. డాల్ఫిన్‌నోస్ కొండ‌ల‌కు అనుకొని ఈ ప్ర‌దేశం ఉంటుంది. ఇక్క‌డి కొండ‌లపై స‌హ‌జంగా ఏర్ప‌డిన నాచు అందాలు, తీర స‌మీపంలో ఉన్న కొబ్బ‌రిచెట్లు ప‌ర్యాట‌కులకు సాద‌ర ఆహ్వ‌నం పలుకుతుంటాయి. ఈ బీచ్‌కు అనుకొని కొన్నిప్ర‌యివేట్ రిసార్టులు క‌ల‌వు. ఈ రిస్టార్ట్‌ల‌లో ఫోటోషూట్‌ల‌కు అనుగుణంగా చిన్న‌పాటి సెట్టింగులను కూడా ఏర్పాటు చేశారు.

ఈ ప్ర‌దేశంలో ప‌ల్లె వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే సెట్టింగ్‌, ఓ పూరిల్లు, టెంపుల్‌, బావి వంటి సెట్టింగ్‌ల‌ను ఏర్పాటుచేశారు. ఇంకా ఇక్క‌డ కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు కొన్ని ప్ర‌త్యేక‌మైన గ‌దులు కూడా ఉన్నాయి. ఆంధ్రా గోవాగా ప్ర‌సిద్ధిచెందిన యారాడ బీచ్‌ను సంద‌ర్శించేందుకు కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచే కాకుండా తెలంగాణ, ఒడిస్సా, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌గా ఇక్క‌డికి ఫోటోషూట్ల‌కోసం వ‌చ్చేవారి సంఖ్య మ‌రింతగా పెరిగింద‌నే చెప్పుకోవాలి.

yaradabeach , light hoouse

అత్యంత అంద‌మైన‌ బీచ్‌గా యారాడ‌..

విశాఖ‌ప‌ట్నంలోని అత్యంత అంద‌మైన బీచ్‌ల‌లో యారాడ బీచ్ ఒక‌టి. ఈ ప్ర‌దేశంలో ప‌ర్యాట‌కుల‌కు తినేందుకు ఆహార ప‌దార్థాలు చాలా త‌క్కువ‌గా ల‌భిస్తాయి. కాబ‌ట్టి ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించాల‌నుకునేవారు వారితోపాటే స్నాక్స్ తినుబండారాల‌ను తీసుకెళ్ల‌డం ఉత్త‌మం. మంచినీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ల‌కు, ప్రేమికుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైద‌నే చెప్పుకోవాలి. ప్రియ‌మైన వారితో ఏకాతంగా గ‌డిపేందుకు యారాడ బీచ్ ఎన్నో సుంద‌ర‌మైన అనుభూతుల‌ను అందిస్తుంది.

ఈ బీచ్ ఆర్.కె.బీచ్ నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యారాడ బీచ్‌కు గాజువాక నుంచి బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. అక్క‌డినుంచి ఆటోలూ, క్యాబ్‌లు, కార్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ బీచ్ లోతు కార‌ణంగా ఇక్క‌డికి వెళ్లిన‌వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలని స్థానికుల హెచ్చరిక‌. ఇంకా ఇక్క‌డ సంద‌ర్శించేందుకు చాలా ప్ర‌దేశాలే ఉన్నాయి. రుషికొండ‌, తొట్ల‌కొండ‌, భీమిలీ బీచ్‌, మంగ‌మారిపేట వ‌ద్ద స‌హ‌జ శిలాతోరణం, కైలాస‌గిరి ప‌రిస‌ర ప్రాంతాల‌తో పాటు శివాజీ పార్క్‌, తేన్నేటీ పార్క్ వంటి ప్రాంతాలెన్నో ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+