Search
  • Follow NativePlanet
Share
» »భ‌ద్రాద్రి రాముల‌వారి కళ్యాణోత్సవ వీక్షిణ‌కు ఆన్‌లైన్‌ టికెట్లు సిద్ధం!

భ‌ద్రాద్రి రాముల‌వారి కళ్యాణోత్సవ వీక్షిణ‌కు ఆన్‌లైన్‌ టికెట్లు సిద్ధం!

రీరామనవమి అంటే హిందువుల‌కు ముఖ్య‌మైన‌ పండుగ‌. ఈ సంద‌ర్భంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనుకి పూజలు చేసి, సీతారాముల కళ్యాణం జ‌రిపించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ పండుగ ఏప్రిల్ మాసంలో వ‌స్తుంది. ఇక‌, భార‌తదేశంలో శ్రీ‌రాముని ఆల‌యాలు ఎన్నో ఉన్నప్ప‌టికీ ద‌క్షిణాది అయోద్య భ‌ద్రాచ‌లం శ్రీ సీతారామ‌స్వామి వారి ఆల‌యం ప్ర‌త్యేక‌త వేరు. దక్షిణాది అయోధ్యగా పేరొందిన‌ భద్రాచలంలో వచ్చే నెల 17న శ్రీరామనవమి పుర‌స్క‌రించుకుని కల్యాణోత్సవం నిర్వహించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సెక్టార్‌ టికెట్లను ఈరోజు మార్చి 25 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు ఆల‌య అధికారులు ప్ర‌క‌టించారు.

ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహించ‌డం ఆచారం. అయితే, ఏదేవునికైనా సూర్యోదయం కంటే ముందే పూజ చేస్తుంటారు. కానీ శ్రీరాముల వారి కళ్యాణం మాత్రం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజ చేయాల్సి ఉంటుంది. ఈ పూజకు ముందే శ్రీ సీతారాముల విగ్రహాలతో లక్ష్మణుడు ఆంజనేయస్వామి విగ్రహాలను సిద్ధంగా ఉంచుతారు. ముందుగా పూల హారాలతో విగ్రహాలను అలంకస్తారు. భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి, శ్రీ రామ రక్షా స్తోత్రం ప‌ఠిస్తారు. భ‌ద్రాచలం రాముల‌వారి క‌ళ్యాణోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణోత్సవం కార్య‌క్ర‌మం ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని ప్ర‌త్య‌క్షంగా తిల‌కించేందుకు నేటి నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు, ఈ టికెట్ల‌ను నేరుగా తీసుకోవాల‌నుకునే భ‌క్తులు ఏప్రిల్ ఒక‌టి నుంచి భ‌ద్రాచ‌లం రామాలయంలో ఉన్న‌ ప్రత్యేక కౌంటర్లలో కొనుగోలు చేసుకుని అవ‌కాశం క‌ల్పించారు.

bhadrachalam1

ప్ర‌త్య‌క్షంగా రాలేక‌పోతే పరోక్ష పద్ధతిలో..

శ్రీరామనవమి రోజు ఉభయ దాతల టికెట్‌ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరిని అనుమ‌తిస్తారు. ఇక ఒక్కోక్క‌రూ రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై లోప‌ల‌కు ప్ర‌వేశం ఉంటుంది. అలాగే, 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్‌ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించిన‌ట్లు ఆల‌య‌ ఈవో రమాదేవి వెల్ల‌డించారు. ఈ టికెట్ల‌ను బుకింక్ చేసేందుకు భక్తులు భ‌ద్రాచ‌లం ఆల‌యం అధికారిక వెబ్‌సైట్‌ https:-//bhadradritemple.telangana.gov.in నుంచి టికెట్లను పొందవచ్చని తెలిపారు. అంతేకాదు, శ్రీ‌రామ‌న‌వ‌మి క‌ళ్యాణోత్స‌వానికి ప్ర‌త్య‌క్షంగా రాలేని వారికోసం పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే అవ‌కాశం కూడా కల్పించారు. ఇందుకోసం రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ కోనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. పైన తెలిపిన అదే వెబ్‌సైట్‌ నుంచి ఈ టిక్కెట్ల‌ను కూడా బుక్‌ చేసుకోవచ్చు.

bhadrachalam temple

ఒరిజినల్‌ ఐడీ ప్రూఫ్స్ చూపించి టికెట్లు..

పైన తెలిపిన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైల్‌లో సెక్టార్‌ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఏప్రిల్‌ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు తానీషా కల్యాణ మండపంలో తమ యొక్క‌ ఒరిజినల్‌ ఐడీ ప్రూఫ్స్ చూపించి టికెట్లు నేరుగా తీసుకోవాలి. ఏప్రిల్‌ 1 నుంచి భద్రాచలం రామాలయం, గోదావరి బ్రిడ్జి సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, తానీషా కల్యాణ మండపం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లలో నేరుగా టికెట్లను కొనుగోలు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఈ అవ‌కాశాన్నిభ‌క్తులు వినియోగించుకుని ఆ రాముల‌వారి ద‌ర్శ‌న భాగ్యాన్ని పొంద‌గ‌ల‌ర‌ని ఆల‌య అధికారులు కోరుతున్నారు.

More News

Read more about: bhadrachalam telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+