Search
  • Follow NativePlanet
Share
» »మహారాష్ట్రలోని సాంగ్లీలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

మహారాష్ట్రలోని సాంగ్లీలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

బాహుబలి .. నిన్న మొన్నటి వరకు ఎవ్వరికీ (చరిత్రకారులు, పరిశోధకులు తప్ప) తెలియని పేరు . ఎప్పుడైతే బాహుబలి సినిమా మొదలు పెట్టారో అప్పటి నుంచి బాహుబలి పేరు ప్రాచూర్యంలోకి వచ్చింది. ఇక బాహుబలి సినిమా చూసిన తరువాత అందరికీ బాహుబలి గురించి అన్వేషించడం మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి : బాహుబలి సినిమా షూటింగ్ ప్రదేశాలు !

బాహుబలి కి సంబంధించిన ఆనవాళ్ళు దక్షిణ భారతదేశంతో పాటు, ఉత్తర భారతావనిలో కనబడ్డాయి. దక్షిణ భారతదేశంలో శ్రావణ బెళగోళ, కర్కల, ధర్మస్థల, గొమ్మతాగ్రి మరియు తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ పట్టణంలో బాహుబలి కి సంబంధించిన విగ్రహాలు బయటపడ్డాయి.

బాహుబలి అన్నది ఒక రాజు పేరు. ఈయన జైనమతాన్ని స్వీకరించాడు. కర్ణాటకలో ఉన్న బాహుబలుని విగ్రహాలకు తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ పట్టణంలో బయటపడ్డ బహుబలి విగ్రహమే ఆధారం. ఆలాంటి కోవలోకి వచ్చినదే బాహుబలి కొండ ఆలయం. ఇప్పటి వరకు బాహుబలి విగ్రహాలను చూశాం కానీ ఆలయాన్ని చూడలేదు. కానీ ఈ లోటు తీరిపోనుంది.

ఇది కూడా చదవండి : తెలంగాణ లో ప్రాచీన బహుబలి విగ్రహం !

మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లీ జిల్లాలో కొండ మీద బహుబలి ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి భక్తులు, పర్యాటకులు ప్రతి సంవత్సరం తరలివస్తుంటారు. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటూ ఆధ్యాత్మికతను రంగరిస్తుంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు ఇదొక్కటేనా లేక ఇంకేమైనా ఉన్నాయా అనే విషయానికి వస్తే ...

గణపతి ఆలయం , సాంగ్లీ

గణపతి ఆలయం , సాంగ్లీ

సాంగ్లీ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో గణపతి ఆలయం ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి వేలాది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం వినాయకుడు. అద్భుత అందాలతో, ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో శిల్పాలు, నల్లరాతి గోడలు, కూడ్యాలు కలిగి ఉంటుంది. సుమారు రెండెకరాల స్థలంలో ఈ గణపతి ఆలయాన్ని కట్టడానికి 30 సంవత్సరాలు పట్టింది.

చిత్ర కృప : Pratish Khedekar

బాహుబలి హిల్ టెంపుల్, సాంగ్లీ

బాహుబలి హిల్ టెంపుల్, సాంగ్లీ

బాహుబలి హిల్ టెంపుల్ సాంగ్లీ కి సమీపంలో ఉన్నది. ఈ ఆలయాన్ని సుమారు గంట లోపు ప్రయాణంలో చేరుకోవచ్చు. ఈ ఆలయానికి ఆ పేరు అక్కడి కొండల పేరు నుండి వచ్చింది. ఆ ఆలయంలోని బాహుబలి విగ్రహం 28 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇదే ప్రదేశంలో 24 మంది తీర్ధంకరులు ఉంటారు. ఈ దేవాలయాన్ని భక్తులు ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు.

చిత్ర కృప : wikicommons

మీరజ్ దర్గా , సాంగ్లీ

మీరజ్ దర్గా , సాంగ్లీ

మీరజ్ దర్గా లేదా ఖాజా మీర్ సాహెబ్ దర్గా సాంగ్లీ సమీపలో కలదు. ఈ దర్గా సుమారు 500 సంవత్సరాల క్రితం కట్టించినది. ఇక్కడ ఏటా జరిగే వార్షిక సంగీత వేడుకలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ దర్గాను అన్ని మతాల వారు భక్తిశ్రద్ధ ల మధ్య దర్శించుకుంటారు.

చిత్ర కృప : sangli.nic.in

సాంగ్లీ కోట, సాంగ్లీ

సాంగ్లీ కోట, సాంగ్లీ

సాంగ్లీ కోట పట్టణ మధ్యభాగంలో కలదు. ఇక్కడే రాజు వాడే ప్యాలెస్, మ్యూజియం ఉండేది. కానీ ప్రస్తుతం దీనిని కలెక్టర్ కార్యాలయంగా వాడుతున్నారు. కానీ కోట గోడలు, గదులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

చిత్ర కృప : wikicommons

సాగరేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, సాంగ్లీ

సాగరేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, సాంగ్లీ

సాగరేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, భారత దేశంలో కృతిమంగా తయారుచేయబడిన అడవి. ఈ అడవి సాంగ్లీ కి 30 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ చిరుత, జింక, అడవి పక్షులు మరియు నీటి జీవులు వంటి ఎన్నో ప్రాణులని చూడవచ్చు.

చిత్ర కృప : John&Fish

దండోబా హిల్ స్టేషన్, సాంగ్లీ

దండోబా హిల్ స్టేషన్, సాంగ్లీ

వన్య ప్రియులు, ట్రెక్కర్లు అమితంగా ఇష్టపడే మరో ప్రదేశం దండోబా హిల్ స్టేషన్. ఇది సాంగ్లీ నుండి 25 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నది. ఇక్కడ కొండ మీద అటవీ సంరక్షణ ప్రదేశం కలదు. దీనితో పాటు ఆలయాలు, చారిత్రక చిహ్నాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Rasik Maru

మారుతి రోడ్, సాంగ్లీ

మారుతి రోడ్, సాంగ్లీ

మారుతి రోడ్ సాంగ్లీ లో గల వాణిజ్య కేంద్రం. ఇక్కడ అనేక రకాల కొనుగోళ్లు చేసుకోవచ్చు. దుస్తులు, ఆట వస్తువులతో కూడిన అతి పెద్ద మార్కెట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడే నోరూరించే మరాఠీ ఆహార రుచులు కూడా లభిస్తాయి.

చిత్ర కృప : Ekmirajkar

కృష్ణా వ్యాలీ వైన్ పార్క్, సాంగ్లీ

కృష్ణా వ్యాలీ వైన్ పార్క్, సాంగ్లీ

సాంగ్లీ పట్టణ శివార్లలో కృష్ణా వ్యాలీ వైన్ పార్క్ కలదు. ఇది కృష్ణా నది ఒడ్డున ఉన్నది కాబట్టి , దీనికి ఆ పేరోచ్చింది. ఈ పార్క్ లో ద్రాక్ష తోటలు అధికంగా పండిస్తారు. ఇది గ్రేప్ మరియు వైన్ టూరిజం స్పాట్ గా ఉంది.

చిత్ర కృప : Amolmali05

సాంగ్లీ వంటాకాలు

సాంగ్లీ వంటాకాలు

సాంగ్లీ ఆహార రుచులకు పేరుపొందింది. భెల్ పురి, బండంగ్ వంటివి ఇక్కడి వంటల్లో కొన్ని. బండంగ్ అటుకులతో తయారు చేసే వంటకం. సాంగ్లీ వస్తే ఈ రెండు వంటల్లో ఏదో ఒకటి తప్పక రుచి చూడండి.

చిత్ర కృప : wikicommons

సాంగ్లీ ఎలా చేరుకోవాలి ??

సాంగ్లీ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

సాంగ్లీ కి 400 కి. మీ. దూరంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు 40 కి. మీ. దూరంలో కొల్హాపూర్ దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాల నుండి సాంగ్లీ కి క్యాబ్ ల ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం

సాంగ్లీ ముంబై - బెంగళూరు మార్గంలో ఉంది. పూణే- ఎర్నాకులం, ఢిల్లీ - మైసూర్ వెళ్లే రైళ్లన్నీ సాంగ్లీ లో ఆగుతాయి. మహారాష్ట్ర లోని ఆని ప్రాంతాల నుండి సాంగ్లీ కి రైళ్ళ ద్వారా తేలికగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ముంబై - బెంగళూరు జాతీయ రహదారి కి 35 కి. మీ. దూరంలో సాంగ్లీ ఉన్నది. దగ్గరలోని వివిధ పట్టణాల నుండి సాంగ్లీ కి బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సాంగ్లీ కి చేరుకోవటానికి ప్రైవేట్ వాహనాలు, బస్సులు కూడా అంబుబాతులో ఉంటాయి.

చిత్ర కృప : Ram@Sangola

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+