Search
  • Follow NativePlanet
Share
» »గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్ లో గల పర్యాటక ప్రదేశాలు

గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్ లో గల పర్యాటక ప్రదేశాలు

By Mohammad

వల్సాడ్, గుజరాత్ రాష్ట్రంలోని ఒక సముద్ర తీర ప్రాంతపు జిల్లా. వల్సాడ్ అరేబియా సముద్రం, నవసారి మరియు డాంగ్ జిల్లాలు మరియు మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులుగా ఉంది. దీనికి ఆ పేరు వడ్ - సాల్ (అంటే మర్రి చెట్ల చేత చిక్కులబడ్డ ప్రదేశం అని అర్థం) నుండి వచ్చింది. ఈ ప్రాంతం అంతా మర్రిచెట్ల చేత నిండబడి ఉంటుంది.

ఇది కూడా చదవండి : అభివృద్ధికి ఆదర్శం - గుజరాత్ !

గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్ లో గల పర్యాటక ప్రదేశాలు ప్రముఖంగా గమనిస్తే .. చూసే ప్రదేశాల్లో మొట్టమొదటిది దండి. ఇక్కడే మహాత్మాగాంధీ వేలమంది ఉద్యమకారులతో కాలినడకన తరలివచ్చి ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అలాగే సూర్య కాంతి నిరంతరం శివలింగాలకు తాకూతూ ఉండే తడకేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇంకా ఛత్రపతి శివాజీ ఆక్రమించుకున్న కోటలు, భవనాలు మరియు ఆహ్లాదపరిచే సముద్ర తీర ప్రాంతం తీతాల్ బీచ్ చూడవచ్చు.

దండి, వల్సాడ్

దండి, వల్సాడ్

దండి గుజరాత్ లోని నవసారి నగరం దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామము. ఇది మహాత్మా గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహం లేదా దండి యాత్ర కు ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశం. 1930 వ సంవత్సరం లో, మహాత్మా గాంధీ తన అనుచరులతో కలిసి వచ్చి ఉప్పు పన్ను విధింపుకు వ్యతిరేకంగా అహింసా పద్ధతిలో పోరాడాడు.

చిత్ర కృప : gujarattourism

సంజన్, వల్సాడ్

సంజన్, వల్సాడ్

సంజన్, భారతదేశంలో ఉన్న ప్రధాన పార్సీ స్థావరం. భారత దేశానికి వచ్చిన పార్సీ లు మొట్టమొదట ఈ ప్రదేశంలోనే అడుగుపెట్టారు. వారి రాకకి సంబంధిన జ్ఞాపకాలకు గుర్తుగా క్రీ.శ.1917 వ సంవత్సరంలో నిర్మించబడిన సంజన్ స్మారక స్థంభాన్ని ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : telugu native planet

సముద్ర తీరము, వల్సాడ్

సముద్ర తీరము, వల్సాడ్

సముద్ర తీరం ఉందంటే ఎవ్వరికైనా ఉత్సాహమే. ఈ జిల్లాకు పశ్చిమ సరిహద్దు గా ఉన్న అరేబియా సముద్రం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఉల్లాసపరుస్తుంది. పిల్లలు, పెద్దలు ముఖ్యంగా యువత సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రదేశాల్లో విహరించడానికి, కేరింతలు కొట్టడానికి మరియు కాసింత ప్రశాంతత, విశ్రాంతిని గడపడానికి వస్తారు.

చిత్ర కృప : nevil zaveri

పర్నేరా కోట, వల్సాడ్

పర్నేరా కోట, వల్సాడ్

పర్నేరా కోట, వల్సాడ్ జిల్లాలో ప్రసిద్ధి చెందినది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన 'ఛత్రపతి' శివాజీ మహరాజ్ కొండపై నిర్మించాడని నమ్మే పర్నేరా కోటగా పిలవాడే ఒక కోట ఉంది. ఈ కోట నాటి చారిత్రక ప్రాధాన్యతను కలిగి, పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

చిత్ర కృప : Rushabh Buch

పర్నేరా కొండలు, వల్సాడ్

పర్నేరా కొండలు, వల్సాడ్

పర్నేరా కొండలు వల్సాడ్ పట్టణానికి దగ్గరగా ఉన్నాయి. ఈ కొండల్లో జైన దేవాలయాలతో పాటు ఇతర మతాలకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో కొండపై ఉత్సవం నిర్వహిస్తారు.

చిత్ర కృప : Rushabh Buch

తడకేశ్వర్ మహదేవ్ మందిర్, వల్సాడ్

తడకేశ్వర్ మహదేవ్ మందిర్, వల్సాడ్

వల్సాడ్ లో గల తడకేశ్వర్ మహదేవ్ ఆలయం వివిధ రకాల శివలింగాలకు ఆవాసంగా ప్రసిద్ధి చెందింది. పైకప్పు లేని కారణంగా సూర్యకాంతి నిరంతరం శివలింగం తాకుతూ ఉండటం వల్ల తడకేశ్వర్ ఆలయానికి ఆ పేరు పెట్టారు. ఇక్కడకి భక్తులు స్వామి వారి దర్శనం కొరకు ప్రతి రోజు వందలాది సంఖ్యలో తరలి వస్తుంటారు.

చిత్ర కృప : Pratik_Acharya

తితాల్ బీచ్, వల్సాడ్

తితాల్ బీచ్, వల్సాడ్

తితాల్ బీచ్, వల్సాడ్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో, పడమటి వైపున అరేబియా సముద్రం వద్ద కలదు. ఈ బీచ్ ని బ్లాక్ సాండ్ బీచ్ అంటారు. రోడ్డు, రైలు మార్గం ద్వారా చాకాగా అనుసంధానించబడిన ఈ బీచ్ కి పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Santosh Namby Chandran

సాయిబాబా ఆలయం, తితాల్, వల్సాడ్

సాయిబాబా ఆలయం, తితాల్, వల్సాడ్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయిబాబా భక్తులు తితాల్ బీచ్ కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని ఆహ్లాదకరమైన ప్రదేశంలో బీచ్ కి చేరువలో నిర్మించినారు. ఆలయం వద్ద నుండి అరేబియా సముద్ర అందాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతుంటాయి.

చిత్ర కృప : Krupasindhu Muduli

స్వామి నారాయణ్ ఆలయం, తితాల్, వల్సాడ్

స్వామి నారాయణ్ ఆలయం, తితాల్, వల్సాడ్

స్వామి నారాయణ్ టెంపుల్, తితాల్ బీచ్ కు ఉత్తరం దిశగా 1.6 కి. మీ. ల దూరంలో ఉన్నది. స్వామి నారాయణ్ టెంపుల్ ఒక రాతి దేవాలయం. దీనిపై చేతితో చెక్కబడిన అనేక శిల్పాలు కలవు. ఇక్కడి బీచ్ ను మరియు ఈ దేవాలయాన్ని సందర్శించడానికి భారతీయులు మరియు విదేశీ పర్యాటకులు వస్తుంటారు.

చిత్ర కృప : Pnprince

శాంతి ధాం టెంపుల్, తితాల్, వల్సాడ్

శాంతి ధాం టెంపుల్, తితాల్, వల్సాడ్

శాంతి ధాం టెంపుల్, తితాల్ ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. పర్యాటకులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. సముద్రపు ఒడ్డుకు ఈ ఆలయం సమీపంలో వుంది. అరేబియా సముద్ర అందాలను ఇక్కడి నుండి చక్కగా చూడవచ్చు.

చిత్ర కృప : Krupasindhu Muduli

వల్సాడ్ చేరుకోవడం ఎలా ??

వల్సాడ్ చేరుకోవడం ఎలా ??

వాయు మార్గం

వల్సాడ్ కి సమీపంలో ఉన్న విమానాశ్రయం వడోదర విమానాశ్రయం. ఇది 227 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ఇతర ప్రవేట్, ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి వల్సాడ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

వల్సాడ్ రైల్వేస్టేషన్ ను కలిగి ఉన్నది. ఈ పట్టణం భారతదేశంలోని ప్రధాన పట్టణాల నుండి అనుసంధానించబడింది. ఈ స్టేషన్ ముంబై - వడోదర రైలు మార్గంలో ఉన్నది.

రోడ్డు మార్గం

గుజరాత్ ప్రధాన నగరాల నుండి వల్సాడ్ కు వివిధ రాష్ట్ర రవాణా బస్సులు నడపబడుతున్నాయి. ముంబై, పూనే, వడోదరా, నాసిక్ మరియు షిర్డీ నుండి వడోదరా కు బస్సులు నడపబడుతున్నాయి. అనేక ప్రైవేట్ లగ్జరీ బస్సులు కూడా వివిధ నగరాల నుంచి వల్సాడ్ ప్రయాణిస్తాయి.

చిత్ర కృప : Superfast1111

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+