Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటకలోని నెర్సా గ్రామంలో సందర్శించవలసిన ప్రదేశాలు !!

కర్నాటకలోని నెర్సా గ్రామంలో సందర్శించవలసిన ప్రదేశాలు !!

By Mohammad

పక్షులు ... మనల్ని ఉదయాన్నే నిద్ర లేపే కోడి నుండి రాత్రి చెట్ల మీద కనిపించే గుడ్లగూబ వరకు ఎన్నో రకాల పక్షి జాతులను మనం గమనిస్తాం. ఒక్కోదానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం మారుతున్న పట్టనీకరణ లో భాగంగా పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. ఎప్పుడో పండగ లకి, పబ్బాలకి సొంత ఊర్లకి (పల్లెటూర్లకి) వెళితే ఉదయాన్నే నిద్ర లేపే కోడి అరుపులు, అలాగే పక్షుల కిలకిల రాగాలు వినొచ్చు. రాత్రి పూట పొలాల్లో చెట్ల మీద వాలే గుడ్లగూబ పక్షిని గమనించవచ్చు. కేవలం ఇవే కావు ఇలా ఎన్నో పక్షి జాతులను పల్లెటూర్లలో మాత్రమే గమనిస్తాం కానీ, సిటీ లో గమనించం.

ఇక్కడ మీకు చెప్పబోయే గ్రామం పేరు నెర్సా. పచ్చదనానికి మారుపేరుగా నిలిచింది ఈ నెర్సా గ్రామం. కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఈ గ్రామం తన సహజ ప్రకృతి దృశ్యాలతో మిమ్మల్ని రిలాక్ష్ చేసి, ఆనందింపజేస్తుంది. చుట్టూ పశ్చిమ కనుమలు, కొండలు మరియు దట్టమైన అడవి కలిగి ఉన్న ఈ గ్రామం లో జంతువులను పసిగట్టడం, పక్షులను గమనించడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : కర్నాటక రాష్ట్రంలో గల పక్షి అభయారణ్యాలు !

ఈ గ్రామంతో పాటుగా బోనస్ గా మీకు మరో ప్రదేశం కూడా చెప్పాలనుకుంటున్నా. ఇది కూడా కర్నాటక రాష్ట్రంలో ఉంది. కొక్కెరే బెల్లూర్ అని దాని పేరు. ఇది పక్షుల అభయారణ్యం. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఎంత ఆనందంతోనైతే వస్తారో, అంతే ఆనందంతో బయటకి వెళతారు. ఈ రెండు ప్రదేశాలలో మీరు చూసేవి పక్షులే అయినప్పటికీ వీటిని కాలినడకన నడుస్తూ గమనించేవారికి ఒక స్వర్గం వలె అనిపిస్తుంది. ముందుగా కర్నాటకలోని నెర్సా గ్రామంలో సందర్శించవలసిన ప్రదేశాలు విషయానికి వస్తే ..

నెర్సా గ్రామం

నెర్సా గ్రామం

ముందుగా మనం నెర్సా గ్రామం గురించి తెలుసుకుందాం. నెర్సా లో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. ఇక్కడి కొండలు ట్రెక్కింగ్ కు అనువుగా ఉంటాయి. జంతువులను పసిగట్టటం, పక్షులను గమనించటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

చిత్ర కృప : sandeep

నెర్సా గ్రామం

నెర్సా గ్రామం

నెర్సా లో చూడటానికి ఎన్నో ప్రదేశాలున్నప్పటికీ, కొన్ని ప్రదేశాలను చూడటానికి కాలినడకన వెళ్ళాలి. అలా వెళ్లే దారిలో వందలాది పక్షులు, సీతాకోక చిలుకలు, స్ధానిక మొక్కల సముదాయం వంటివి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

చిత్ర కృప : plancas67

క్రిష్ణపూర్ , నెర్సా

క్రిష్ణపూర్ , నెర్సా

నెర్సా సందర్శకులు సమీపంలోని క్రిష్ణపూర్ గ్రామాన్ని చూడాలి. ఇక్కడ షుమారు ఇరవై వేల గబ్బిలాలు నివాసం ఉంటాయి. ధియోబాల్డ్ టాంబ్ గబ్బిలాలను కూడా సమీప గుహలలో చూడవచ్చు.

చిత్ర కృప : Airwolfhound

తలేవాడి, నెర్సా

తలేవాడి, నెర్సా

నెర్సా గ్రామంలో మరిచిపోలేని అనుభవం అంటే తలేవాడి లోని గబ్బిలాలు. సమీప అటవీ ప్రాంతంలో రకరకాల గబ్బిలాలు ఉంటాయి. 40 రకాల జాతులు లోండా అటవీ ప్రాంత పరిధిలోని తలేవాడి గ్రామంలో సంచరిస్తుంటాయి.

చిత్ర కృప : Ferran Pestaña

బారాపేడి గుహ, నెర్సా

బారాపేడి గుహ, నెర్సా

తలేవాడి సమీప లోండా అడవుల్లో చూడవలసిన ప్రధాన ఆకర్షణ బారాపేడి గుహలు. ఈ గుహలో 200 గబ్బిలాలు ఉంటాయి.

చిత్ర కృప : 70023venus2009

భీమ్ ఘడ్, నెర్సా

భీమ్ ఘడ్, నెర్సా

నెర్సా గ్రామ సందర్శనకు వచ్చే యాత్రికులు భీమ్ ఘడ్ కూడా చూడాలి. ఇది దట్టమైన అడవుల మధ్య ఉన్న కోట. దీనిని సహజ రాళ్ళతో నిర్మించినారు.

చిత్ర కృప : wikicommons

భీమ్ ఘడ్, నెర్సా

భీమ్ ఘడ్, నెర్సా

భీమ్ ఘడ్ కోటను మరాఠా రాజు శివాజి వాడారని తెలుస్తుంది. పురాణాల కథనం మేరకు పాండవులు, భీముడు ఈ ప్రదేశంలో సంచరించారని, భీముడి పేరుతో భీమ్ ఘడ్ అని దీనికి పేరు పెట్టారని చెపుతారు. సహజ అందాలను సందర్శించి, ఆనందం కోరుకునే వారికి ఈ ప్రదేశం ఎంతో నచ్చుతుంది.

చిత్ర కృప : wikicoommns

మహదాయి వ్యాలీ, నెర్సా

మహదాయి వ్యాలీ, నెర్సా

నెర్సా గ్రామ సమీపాన ఉన్న మహదాయి వ్యాలీ ఒక వినోద పర్యాటక స్ధలం. ఇది ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం కల ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది.

చిత్ర కృప : sandeep

మహదాయి వ్యాలీ, నెర్సా

మహదాయి వ్యాలీ, నెర్సా

మహదాయి వ్యాలీ వచ్చే సందర్శకులు వివిధ రకాల జంతువులను, పక్షులను తనివితీరా చూడవచ్చు. కనుమరుగైపోతున్న అనేక జాతులను మహదై వ్యాలీలో చూసి ఆనందించవచ్చు.

చిత్ర కృప : sandeep

సింధేరి రాక్, నెర్సా

సింధేరి రాక్, నెర్సా

నెర్సా వచ్చే యాత్రికులు కనేరి నది ఒడ్డున గల సింధేరి రాక్ ను సందర్శిస్తుంటారు. సింధేరి రాక్ అంటే, అది ఒక 300 అడుగుల సహజ ఏకశిల. ఇక్కడే పర్యాటకులు చక్కటి పావురాలను, తేనెటీగలను చూడవచ్చు.

చిత్ర కృప : sandeep

కొక్కెరే బెల్లూర్, కర్నాటక

కొక్కెరే బెల్లూర్, కర్నాటక

కర్నాటక రాష్ట్రంలో బెంగళూరు మహానగారానికి 80 కిలోమీటర్ల దూరంలో కొక్కెరే బెల్లూర్ పక్షి అభయారణ్యం ఉంది. ఇక్కడికి రావటానికి పర్యాటకులు, పక్షి ప్రేమికులు ఆసక్తి చూపుతారు. ఈ అభయారణ్యంలో నడుస్తూ పక్షుల కిలకిలరావాలను వినటం ఒక మాధురానుభూతి కలిగించే అంశం.

చిత్ర కృప : Christopher Perez

కొక్కెరే బెల్లూర్, కర్నాటక

కొక్కెరే బెల్లూర్, కర్నాటక

కొక్కెరే బెల్లూర్ లో ప్రధాన ఆకర్షణ పెలికాన్లు. ఈ పెలికాన్ల ని కన్నడ భాషలో కొక్కేరాలు అంటారు. కనుక, వాటి పేరుపై ఈ గ్రామానికి ఆ పేరొచ్చింది. సరైన సమయంలో మీరు గనక అక్కడ ఉంటే వాటి గుంపుల సమూహాన్ని చూసి మిక్కిలి ఆనందపడతారు.

చిత్ర కృప : Christopher Perez

నెర్సాకు, కొక్కెరే బెల్లూర్ కు చేరుకోవడం ఎలా ??

నెర్సాకు, కొక్కెరే బెల్లూర్ కు చేరుకోవడం ఎలా ??

విమాన మార్గం

నెర్సాకు, కొక్కెరే బెల్లూర్ కు రెండింటికి సమీపంలో బెంగళూరు లోని అంతర్జాతీయ విమానాశ్రయం చేరువలో కలదు. నెర్సా కు ఈ విమానాశ్రయం 505 కి. మీ. దూరంలో, కొక్కెరేబెల్లూర్ కి 83 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి ఈ రెండు ప్రదేశాలకు క్యాబ్ లేదా ఏదేని ఇతర రవాణా సాధనాల ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం

నెర్సాకు 18 కి. మీ. దూరంలో ఖానాపూర్ రైలు స్టేషన్ ఉంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాలకు చేరాలంటే 38 కి. మీ. దూరంలో ఉన్న బెల్గాం రైలు స్టేషన్ కు రావాలి. అట్లే కొక్కెరేబెల్లూర్ కు సమీపాన మైసూర్ - బెంగళూరు రైలు మార్గంలో ఉన్న మద్దూరు రైలు స్టేషన్ కలదు. మండ్య రైలు స్టేషన్ కూడా సమీపమే. రైల్వే స్టేషన్ లకు చేరిన వెంటనే టూరిస్టులు టాక్సీలు, క్యాబ్ లలో ఈ రెండు ప్రదేశాలకు చేరవచ్చు.

రోడ్డు మార్గం

బెంగుళూరు నుండి నెర్సాకు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది. బెంగుళూరు నుండి ప్రవేట్ లగ్జరీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కొక్కెరేబెల్లూర్ కి సమీపాన ఉన్న బెంగళూరు మరియు మైసూరు పట్టణాల నుండి, మండ్వ నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : sandeep

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+