Search
  • Follow NativePlanet
Share
» »ఇల్లరికం ఇక్కడి ఆచారం...ఆడపిల్లే ఇంటికి అదృష్టం

ఇల్లరికం ఇక్కడి ఆచారం...ఆడపిల్లే ఇంటికి అదృష్టం

తవాంగ్ పర్యాటకానికి సంబంధించిన కథనం

భారత్ లో చిన్నపాటి టిబెట్ లా కనిపిస్తుంది తవాంగ లోయ ప్రాంతం. బౌద్ధమత సారాన్ని ఒంటపట్టించుకున్న ఆ తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని అందాలకు పెట్టిందిపేరు. ఇక్కడ నివసించే వారిని మోంపా తెగకు చెందినవారిగా పిలుస్తారు. వీరంతా బౌద్ధమతాన్ని ఆచరించేవారు. భారతదేశంలో ఎక్కడా కనిపించని ఆచారం తవాంగ్ లోయలో కనిపిస్తుంది. అదే ఇల్లరికం. అమ్మయి పుడితే ఇక్కడ అదష్టంగా భావిస్తారు. అంతేకాదు అమ్మయే తవాంగ్ లో ఇంటికి వారసురాలు. అలాంటి తవాంగ్ పర్యాటక విశేషాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

తవాంగ్ లోయలో సంవత్సరంలోని పదకొండు నెలలూ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండాకాలమైన మే నెలలో మాత్రమే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

అందుకే పర్యాటకులు ఎక్కువగా మే నెలలోనే ఇక్కడికి వస్తుంటారు. తవాంగ్ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ సముద్రమట్టానికి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటాయి.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

మనదేశంలో తొలిసూర్యకిరణాలు పడేది, ముందుగా చీకటి పడేది అరుణాచల్ ప్రదేశ్ లోనే. ఇక్కడ వసతి అందించే హోటళ్లలో హీటర్లు తప్పనిసరి. ఇక తవాంగ్ లోని చలిని తట్టుకోవడానికి గదుల్లో దుప్పట్లకు బదులు పరుపులాంటి బొంతలను పర్యాటకులకు అందిస్తారు.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

తవాంగ్ లోయ పరిసర ప్రాంతాల్లో చూడదగిన మరో మనోహరమైన పర్యాటక ప్రాంతం షగేస్తేర్ సరస్సు.. ఈ సరస్సు సముద్రమట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో మాధురీదీక్షిత్ పై ఓ పాటను చిత్రీకరించారు.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

అందువల్లే స్థానికులు దీనిని మాధురీ లేక్ అని పిలుచుకొంటూ ఉంటారు. ఈ లేక్ ప్రస్తుతం భారత సైన్యం పర్యవేక్షణలో ఉంది. సరస్సు చూడటానికి ఎంత మంది పర్యాటకులు వచ్చినా పరిసర ప్రాంతాలు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా స్థానికులు జాగ్రత్తలు తీసుకొంటూ ఉంటారు.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

ఈ ప్రాంతంలో మోంపా తెగకు చెందిన ప్రజలు శాంతిప్రియులు, వారికి చైనా కంటే భారత్ లో ఉండటమే ఇష్టం. మోంపాలది మాత`స్వామ్య వ్యవస్థ. వీరి ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే సంబరాలు చేసుకొంటారు. తమ తదనంతరం ఆస్తిని ఆడపిల్లలకే అప్పగిస్తారు.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

పెళ్లయ్యాక అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సిందే అనేది ఇక్కడ ఆచారం. ఇక్కడ అడపిల్లలను ఏడిపించడాన్ని అతి పెద్ద నేరంగా భావిస్తారు. అందుకే ఇక్కడ అమ్మయిలకు స్వచ్ఛ ఎక్కువ.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

తవాంగ్ లో ముఖ్యంగా చూడదగిన ప్రాంతం 1651 లో స్థాపించిన బౌద్ధ ఆశ్రమం. ఈ ఆశ్రమంలోపల 18 అడుగుల ఎత్తులో బంగారు వర్ణంలో ఒక బుద్ధ విగ్రహం కనిపిస్తుంది. బౌద్ధుని పాదాల వద్ద ప్రస్తుత గురువు 14వ దలైలామ చిత్రపటం ఉంటుంది.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

ఈ ఆశ్రమంలో బుద్దుని విగ్రహం ముందు ప్రశాంతంగా కూర్చోవడానికి మెత్తటి పరుపులు ఉన్నాయి. మొదటి అంతస్తులోకి చేరుకొంటే బుద్ధుని విగ్రహం అక్కడ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరో అంతస్తు ఎక్కితే బుద్ధ భగవానుడి కళ్లల్లోకి మనం నేరుగా చూసే భావన కలుగుతుంది.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

తవాంగ్ లోయ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ప్రక`తి అందాలకు నిలయమైన జంగ్ జలపాతం కనువిందు చేస్తుంది. గలగల పారుతూ కొండచరియల మీది నుంచి జాలువారే ఈ జలపాతం వీక్షకులకు కనువిందు చేస్తుంది.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

ఇక మనదేశమే అయినప్పటికీ అరుణాచాల్ ప్రదేశ్ కు వెళ్లాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి. అక్కడ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులకు మాత్రమే ఈ పర్మీషన్ ఇస్తారు. ఆన్ లైన్ లో ఈ పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube

ఈ పర్మీట్ ను చెక్ పోస్ట్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. దేశంలోని చాలా నగరాల నుంచి గౌహతికి వీమాన, రైలు సర్వీసులు ఉన్నాయి. ఇక గౌహతి నుంచి తవాంగ్ కు రెండు మార్గాల ద్వారా చేరుకోవచ్చు..

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube
మొదటిది గౌహతి హెలికాప్టర్ సర్వీసెస్. బుధవారం, ఆదివారం తప్ప ఈ సర్వీసులు మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

తవాంగ్, అరుణా చల్ ప్రదేశ్

P.C: You Tube


హెలిక్యాప్టర్ లో వెళ్లాలనుకొంటే ఉదయం 9 గంటలకు గౌహతి చేరుకోవాలి. ఈ సర్వీసుకు రిజర్వేషన్ ఉండదు. హెలిక్యాప్టర్ ప్రయాణం ధర ఒక్కక్కరికి రూ.3,500. ఇక తవాంగ్ ను చేరుకోవడానికి ఉన్న రెండో మార్గం రోడ్డు మార్గం. గౌహతి-తేజ్ పూర్-తవాంగ్ రహదారిలో 440 కిలోమీటర్ల దూరం దాదాపు 13 గంటలు ప్రయాణం చేస్తే తవాంగ్ చేరుకోవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+