Search
  • Follow NativePlanet
Share
» »వైజాగ్ సిటీలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ లొకేష‌న్స్ ఇవే!

వైజాగ్ సిటీలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ లొకేష‌న్స్ ఇవే!

విశాఖపట్నం అంటేనే ఒక అందమైన నగరమ‌ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎగ‌సిప‌డే తీర‌పు అల‌లు మొద‌లుకుని.. ఆకాశాన్ని తాకే ప‌చ్చ‌ని కొండ‌లను చూసేందుకు ఏడాది పొడ‌వునా ఇక్క‌డికి ప‌ర్యాట‌కులు వ‌స్తూనే ఉంటారు. మ‌రీ ముఖ్యంగా.. సినిమా దర్శకులకు ఇది ఓ గొప్ప వ్యూపాయింట్‌. ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను కెమెరాలో బంధించేందుకు.. ఆ దృశ్యాల‌ను వెండితెర‌పై ప్ర‌ద‌ర్శించేందుకు ఎంతో అనువైన ప్రాంతం వైజాగ్‌. టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లోని ఎన్నో చిత్రాలు అరకు-పాడేరు ప్రాంతంలోని పొగమంచు కొండలు, స‌మీపంలోని ప‌చ్చ‌ని అట‌వీ అందాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాయి. మీరు కూడా విశాఖ‌ను ఇష్ట‌ప‌డితే.. ఇక్క‌డి ప్ర‌ధాన‌మైన సినిమా షూటింగ్ స్పాట్‌ల‌పై ఓ లుక్కేయండి!

విశాఖ‌ప‌ట్నం పోర్టు..

వైజాగ్ పోర్ట్ యాక్ష‌న్ సీన్‌ల‌ను ఎన్నో చూసింది. సాలార్, భోళా శంకర్, చత్రపతి ఇలా లెక్కలేనన్ని బ్లాక్‌బస్టర్ సినిమాల‌లోని స్టంట్ సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCTPL) వద్ద రంగురంగుల కంటైనర్లు షూటింగ్‌ల‌లో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ముఖ్యంగా సినిమాల‌లోని హీరో-విలన్ క్లైమాక్స్ సన్నివేశాలు, ఆ స‌మ‌యంలో జ‌రిగే ఫైట్స్ నేపథ్యం ఉన్న చిత్రీక‌ర‌ణ ఇక్క‌డ ఎక్కువ‌గా జ‌రుగుతాయి. ఈ కార‌ణంగానే విశాఖ పోర్టు మంచి షూటింగ్ స్పాట్‌గా నిలిచింది.

vizagbeaches

విశాఖ ఫిషింగ్ హార్బర్..

విశాఖ న‌గ‌రానికే త‌ల‌మానికంగా నిలిచిన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ప్రాంతం సినిమాల చిత్రీక‌ర‌ణ‌లోనూ అగ్ర‌గామిగా నిలుస్తోంది. ఇక్క‌డ‌ సింగం 3, వాల్తేరు వీరయ్య, HIT - ది సెకండ్ కేస్, మజిలీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు చిత్రీక‌రించ‌బ‌డ్డాయి. తీర‌పు అందాల‌ను కెమెరాలో బంధించేందుకు అనువైన లొకేష‌న్స్‌కు ఇక్క‌డ కొద‌వ‌లేదు. ఇటీవలే భారతీయుడు 2కి సంబంధించిన సన్నివేశాలను కూడా ఇక్కడ చిత్రీకరించారు.

భీమిలి ప్రాంతం..

భీమిలి తీర‌ప్రాంతం రొమాన్స్, డ్రామా స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు కేరాఫ్ అడ్ర‌స్ లాంటిది. మరో చరిత్ర, శ్రీవారికి ప్రేమ లేఖ వంటి పాత సినిమాల్లోని గుర్తుండిపోయే స‌న్నివేశాల‌ను భీమిలి గాలి మేడలో చిత్రీకరించారు. ఐకానిక్ ఎర్ర ఇసుక తిన్నెలు (ఎర్ర మట్టి దిబ్బలు) స్వర్ణకమలంలో కీల‌క‌పాత్ర పోషించాయి. ఇక్కడ బీచ్ వెంబడి షికారు చేస్తూ.. సినిమాల్లో ఏదైనా ప్రధాన పాత్రలో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ప్ర‌తి క్ష‌ణాన్నీ ఆస్వాదించేందుకు భీమిలి ప్రాంతం ఎంతో అనువైన‌ది.

shipping1

అందాల సిరి.. కైలాసగిరి

సినిమా లొకేషన్ల విషయంలో నగరానికి అభిముఖంగా కొండ పైభాగంలో ఉన్న కైలాస‌గిరిని మించిన షూటింగ్ స్పాట్ బ‌హుశా ఉండ‌దేమో అనిపిస్తుంది. వైజాగ్ న‌గ‌ర అందాల‌తోపాటు ఇక్క‌డి పొడవైన తీరప్రాంతం యొక్క అద్భుతమైన వీక్షణలను అందించే గొప్ప ప్ర‌దేశం కైలాసగిరి. అందుకే, ప్రాంతం చిత్రనిర్మాతల మ‌న‌సుమెచ్చే బెస్ట్ షూటింగ్ స్పాట్‌గా పేరుపొందింది. సోలో బ్రతుకే సో బెటర్, సరిలేరు నీకెవ్వరు, ప్రభాస్ బిల్లా లాంటి ఎన్నో పెద్ద సినిమా సన్నివేశాలను కూడా ఇక్కడ చిత్రీకరించారు!

vizagtemples

ఆర్‌కే బీచ్ ప్రాంతం..

వైజాగ్‌లోని బెస్ట్ షూటింగ్ స్పాట్స్‌లో ఐకానిక్ RK బీచ్‌ను చేర్చ‌కుండా ఆ జాబితాను పూర్తి చేయ‌లేము. ఇక్క‌డి తీర‌ప్రాంత‌పు వాతావ‌ర‌ణం కెమెరాను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. విశాఖపట్నంలోని ఐకానిక్ ఫిల్మ్ షూటింగ్ లొకేషన్‌లలో ఒకటైన RK బీచ్ నేను శైలజ, పాగల్, ఓయ్!, ఉన్నది ఒకటే జిందగీ వంటి యూత్‌ఫుల్ సినిమాల‌లోని పాటలు, సన్నివేశాలకు నేపథ్యంగా ఉంది. ఇటీవల, రామ్ చరణ్ నటిస్తున్న భారీ అంచనాల చిత్రం గేమ్ ఛేంజర్ చిత్రీకరణ కూడా ఇక్కడ జరిగింది!

More News

Read more about: vizag andhra pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+