Search
  • Follow NativePlanet
Share
» »జాత్ర సమయంలో మహిళలు నగ్నంగా దేవిని పూజిస్తారు.

జాత్ర సమయంలో మహిళలు నగ్నంగా దేవిని పూజిస్తారు.

రేణుకాదేవి దేవాలయానికి సంబంధించిన కథనం.

రేణుకాంబ జాత్ర గురించి మీకు తెలుసా. రేణుకాదేవి ఉత్సవ సమయంలో మహిళలు నగ్నంగా మారుతారు. ఈ సమయంలోనే దేవాలయంలో ఉత్సవాన్ని ఆచరిస్తారు. ఇటువంటి వినూత్న ఆచారంతో కూడిన ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని చిత్రపుర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అనేక చిన్నచిన్న గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో చంద్రగుట్టి అనే ప్రదేశంలోనే ఈ రేణుకాంబ దేవాలయం ఉంది.

ఈ కార్తీకమాసంలో ఈ దేవాలయాల్లో ఒక్కదాన్ని సందర్శించినా మోక్షమేఈ కార్తీకమాసంలో ఈ దేవాలయాల్లో ఒక్కదాన్ని సందర్శించినా మోక్షమే

 రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

కర్నాటకలోని చంద్రగుట్టిలోని రేణుకాంబ దేవాలయంలో ప్రధాన దైవం రేణుకాదేవి. ఈ దేవాలయం కర్నాటకలోని ప్రముఖ పట్టణమైన సొరబు నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక గుహాలయం.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ గుహ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకొనేది రేణుకాంబ దేవత. ఈ రేణుకాదేవిని గుడియమ్మ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ఉన్న గుట్టను చంద్రగుట్టి అని పిలుస్తారు.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

రేణుకాంబ జమదగ్ని భార్య, అదేవిధంగా పరశురాముడి తల్లి. ఈ దేవాలయం చుట్టూ ఎక్కడ చూసిన పచ్చని చెట్లే కనిపిస్తాయి. అందువల్లే ఈ దేవాలయం చుట్టు పక్కల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం ప్రధానద్వారం ముందు ఒక చిన్న బావి ఉంది. దీనిని తొట్టెలు బావి అని అంటారు. ఈ తొట్టెలు బావికి పక్కన ఉన్న చిన్న రాయి పైనే రేణుకాదేవి పదం గుర్తు మనకు కనిపిస్తుంది.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

జమదగ్ని మునికి తన భార్య రేణుకాదేవి శీలం పై అనుమానం కలిగి పరుశరాముడికి రేణుకాదేవి తలను ఖండించమని ఆదేశిస్తాడు. పరుశరాముడు రేణుకాదేవిని ఒక గుహలోకి తీసుకువెళ్లి అక్కడ ఆమెతలను ఖండిస్తాడు.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

అటు పై ఆ తలను తీసుకొని వచ్చి జమదగ్నికి చూపిస్తాడు. అప్పుడు జమదగ్ని ఒక వరాన్ని కోరుకోమంటాడు. పరుశురాముడు తన తల్లిని మరళా బతికించమని వేడుకొంటాడు. ఈ ఘటన జరిగింది చంద్రగుట్టలోనే అని చెబుతారు.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

ఇది ఒక గుహాలయం. ఇక్కడి రేణుకాదేవి ఉత్సవాన్ని చాలా అశ్చర్యకరమైన రీతిలో జరుపుకొంటారు. ఆ ఉత్సవం పేరే కూచి ఉత్సవం. స్థానికులు తప్ప మిగిలినవారెవరైనా సరే ఈ ఉత్సవంలో పాల్గొంటే వారికి తప్పక భయమేస్తుంది.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

ఇక రాత్రిసమయంలో ఇక్కడ జరిగే అతీంత్ర శక్తి ఉత్సవాల్లో పాల్గొనడానికి విదేశీయులకు అనుమతి ఉండదు. అయితే భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలవారికి మాత్రం ఎటువంటి అడ్డంకులు ఉండవు.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

మన ఊహకు అందని రీతిలో ఉన్న పూజలు జరుగుతాయి. ముఖ్యంగా మహిళలు ఒంటి పై ఎటువంటి దుస్తులు లేకుండా మొదట బావిలో స్నానం చేసి అలా నగ్నంగానే దైవదర్శనానికి వెళ్లేవారు.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

అయితే పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని ఇప్పుడు ఒంటి పై దుస్తులతోనే దేవి దర్శనానికి వెలుతారు. అయితే ఎవరైతే నగ్నంగా వెళ్లి అమ్మవారిని పూజిస్తారో వారి కోర్కెలన్నీ తీరుతాయని చెబుతారు.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

ఎవరైతే ఇలా నగ్నంగా వెళ్లరో వారి కోర్కెలు నెరవేరవని చెబుతారు. అందువల్ల చాలా ఏళ్ల క్రితం వరకూ పురుషులు, స్త్రీలు ఇక్కడకు నగ్నంగానే వెళ్లేవారు. అయితే 1984 నుంచి ఇలా నగ్నంగా పూజలు చేయడాన్ని నిషేదించారు.

రేణుకాంబ దేవాలయం

రేణుకాంబ దేవాలయం

P.C: You Tube

ఇప్పటికీ ఉత్సవ సమయంలో పోలీసులు ఉంటారు. ఇది ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ నగ్నపూజలు లేకపోతే ఆ ఉత్సవం పరిసమాప్తం కాదని చెబుతారు. ఈ దేవాలయాన్ని ప్రతి మంగళ, శుక్రవారాల్లో తెలుస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం కేవలం ఉదయం ఒక గంటమాత్రం తెరుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X