Search
  • Follow NativePlanet
Share
» »వైజాగ్‌లోని రొమాంటిక్ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ స్పాట్స్ మీకోసం..

వైజాగ్‌లోని రొమాంటిక్ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ స్పాట్స్ మీకోసం..

ప్రీ-వెడ్డింగ్ షూట్.. ఇప్పుడిదో ట్రెండ్‌. ఇద్ద‌రి మ‌ధ్య‌ ప్రేమ జ్ఞాపకాలను ప‌దిల‌ప‌రుస్తూ.. ప్రతి జంట జీవ‌న‌ ప్రయాణంలోని స్వీట్ మెమురీస్‌ను గుర్తు చేస్తుంది. సీనిమాల‌ను త‌ల‌పించేలా చేసే ఫొటో షూట్‌లో ప్ర‌తి జంటా హీరో, హీరోయిన్‌ల‌నే చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు వైజాగ్ కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిపోయింది. సుదూర ప్రాంతాల‌నుంచి ఇక్క‌డ‌కు ఫోటోషూట్ కోసం చేరుకుంటున్నారు. అందుకే, వైజాగ్‌లోని రొమాంటిక్ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ స్పాట్స్ మీకోసం అందిస్తున్నాం. ఈ లొకేష‌న్స్ మిమ్మ‌ల‌ను ఓ స‌రికొత్త ప్ర‌పంచంలో విహరించే అనుభూతుల‌ను చేరువ చేస్తాయి.

thotlakondabeach1

తొట్లకొండ బీచ్

ఇక్కడ మీకు పొడవాటి ఎర్రటి మ‌ట్టితో కూడిన దిబ్బ‌లు ద‌ర్శ‌న‌మిస్తాయి. కంటితో చూసేందుకు సాధార‌ణంగానే క‌నిపించినా కెమెరా లెన్స్‌కు మాత్రం ఓ సుంద‌రమైన లోకేష‌న్‌ను ప‌రిచ‌యం చేస్తుంది. అందుకే, ఈ బీచ్ ఫోటో షూట్‌లు మరియు సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సహజసిద్ధమైన ఒంపు ప్ర‌దేశం ఉండటంతో, వెడ్డింగ్ ఫోటో షూట్ చేయడానికి ఈ ప్రాంతం సరైన ఎంపిక. సుందరమైన వాతావ‌ర‌ణం మీ సంబంధానికి మ‌రింత‌ అందాన్ని జోడిస్తాయి.

woodapark1

వుడా పార్క్

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ల కోసం పేరు పొందిన‌ పార్కులు వైజాగ్‌లో చాలానే ఉన్నాయి. వాటిలో వుడా పార్క్ ఈ కార్యకలాపాలకు హాట్‌స్పాట్‌గా చెప్పొచ్చు. చుట్టుపక్కల పచ్చదనంతో నిండి ఉండ‌డంతో ఫోటోగ్రాఫ‌ర్‌ క్లిక్ చేయడానికి ఇది చాలా సుందరమైన ప్రదేశం. అయితే, ఈ ప్రదేశం నిత్యం రద్దీగా ఉండడం వ‌ల్ల ఏకాంత‌మైన ఫోటోషూట్‌కు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

రాస్ హిల్

రాస్ హిల్ వైజాగ్‌లోని ఒక అందమైన సంద‌ర్శ‌నీయ‌ ప్ర‌దేశం. ఈ కొండపై నుండి ఆలయం, చర్చి మరియు మసీదు కనిపిస్తాయి. ఇది మీ ఫోటోగ్రాఫ్‌ల నైపుణాన్ని బ‌య‌ట‌పెట్టే గొప్ప అరుదైన ప్రాంతం. ఈ స్పాట్‌ నావల్ డాక్‌యార్డ్‌లో ఉంది. ఇక్క‌డి బ్యాక్ వాటర్స్ కూడా చర్చి కొండపై నుండి అంద‌మైన‌ వీక్షణలో ఒక భాగంగా చెప్పొచ్చు.

mvmaship1

MV మా షిప్

ఒడ్డున నిలిపివేయ‌బ‌డిన ఈ పాడుబడిన ఓడ ప్రీ-వెడ్డింగ్ షూట్‌కి ప్రత్యేకమైన సౌందర్యాన్ని అందిస్తుంది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. తీర‌పు కెరటాలు, పక్కనే ఉన్న కొండ, దానిని ఆనుకుని ఉన్న శిథిలమైన ఓడ.. సూర్యోదయం ఇక్కడ ఫోటోషూట్‌కి ఉత్తమ సమయం.

appikonda1

అప్పికొండ

అప్పికొండ ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ ప్రదేశం. తీర‌పు అందాల‌ను క‌నుచూపు మేర‌లో చూపిస్తూ.. సూపర్ రొమాంటిక్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి ఇది సరైన లొకేషన్. ఈ ప్ర‌దేశంలో అడుగుపెడితే మీరు ఓ స‌రికొత్త ప్ర‌కృతి ఒడిలో అడుగుపెట్టిన అనుభూతిని పొందుతారు.

కైలాసగిరి

కైలాసగిరి కొండపైన ఉన్న ఓ అంద‌మైన‌ ఉద్యానవనం. ఇక్క‌డి నుంచి నగరంతో పాటు బీచ్‌ను కూడా చూడవచ్చు. ఈ గార్డెన్‌ పచ్చటి అరుదైన పూలతోపాటు చెట్లతో నిండి ఉంది. కేబుల్ కార్ ఇక్క‌డి మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ. అందుకే, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌లకు ఇది మరొక ప్రసిద్ధ గమ్యస్థానంగా పేరుపొందింది.

డాల్ఫిన్ నోస్‌

డాల్ఫిన్స్ నోస్ వైజాగ్ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌లో ఓ మైలురాయి. ఇది వైజాగ్ నగరం యొక్క లైట్ హౌస్‌లో ఉంది. ఈ లొకేషన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం వల్ల జ్ఞాపకాలు ప్రత్యేకంగా ప‌దిల‌ప‌రిచిన అనుభూతిని పొందుతారు. సుందరమైన ఫోటో షూట్ కోసం ఇది ఉత్తమమైన ప్రదేశం.

డివిస్ వంతెన

మీరు తీర ప్రాంత‌పు ప్రేమికులు అయితే మాత్రం ఈ ప్రదేశంలో ఫోటోషూట్‌లు ఉత్తమ ఎంపిక అవుతుంది. ఎగ‌సిప‌డే అల‌ల కేర‌టాల కేరింత‌లు మిమ్మ‌ల్ని మ‌రో ప్ర‌పంచ‌పు తీరానికి చేరుస్తాయ‌న‌డంలో సందేహ‌మే లేదు. మీ బెట‌ర్ ఆఫ్‌కు జీవితంలో మ‌ర్చిపోలేని అనుభ‌వాన్ని అందించాల‌నుకుంటే మీ జంట డివిస్ వంతెన‌పై అడుగుపెట్టాల్సిందే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+