Search
  • Follow NativePlanet
Share
» »ఈ సీజ‌న్‌లో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తోన్న స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం..

ఈ సీజ‌న్‌లో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తోన్న స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం..

ఈ సీజ‌న్‌లో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తోన్న స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం..

విశాఖ జిల్లాలో ప‌ర్యాట‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకునే ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ వ‌ర్షాకాలంలో ప‌ర్యాట‌కులను విశేషంగా ఆక‌ట్టుకుంటున్న జ‌ల‌పాతాలు కూడా ఇక్క‌డ ఉన్నాయి. ఈ మ‌ధ్య‌కాలంలో కురిసిన వ‌ర్షాల‌కు విశాఖలోని స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. ఈ ప్రాంతమంతా ప‌చ్చ‌ద‌నంతో నిండి ఉంటుంది. ప‌చ్చ‌ని చెట్ల‌మ‌ధ్య‌లో క‌నిపించే జ‌ల‌పాతాలు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. మ‌రెందుకాల‌స్యం ఈ వ‌ర్షాకాలంలో స‌మ్మ‌గిరి జ‌ల‌పాతాల అందాల‌ను చూసేద్దామా..

ఈ జ‌ల‌పాతం ఎక్క‌డ ఉంది..

ఈ జ‌లపాతం విశాఖపట్నానికి సుమారు వంద కిలోమీటర్లు దూరంలో వుంది. లంబసింగి నుండి సుమారు ఇర‌వై కిలోమీట‌ర్ల‌ దూరంలో, నర్సీపట్నం నుండి 25 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఈ స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం ఆంధ్ర ప్రదేశ్‌లోని నర్సీపట్నం తాలూకాలోని యర్రవరం గ్రామంలో ఉన్నఒక సుందరమైన జలపాతం. నర్సీపట్నం నుంచి చింతపల్లి రోడ్డులో ఈ జ‌ల‌పాతం వుంది. ఈ జలపాతం ప‌ది అడుగుల ఎత్తు, ప‌దిహేను అడుగుల వెడల్పుతో విస్తరించి ఉంది.

1

ప్ర‌కృతి న‌డుమ‌.. ప్ర‌యాణం..

విశాఖ‌ప‌ట్నం నుంచి లంబ‌సింగి వెళ్లే మార్గంలో య‌ర్ర‌వ‌రం నుంచి సుమారు ఎనిమిది కిలోమీట‌ర్ల దూరంలో స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం అనే బోర్డు క‌నిపిస్తుంది. అక్క‌డి నుంచి మీరు మీ ప్ర‌యాణాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ ఎత్త‌యిన జ‌ల‌పాతాల‌లో స్నానాలు చేయాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి. ఈ ప్రాంతంలో ఆ సౌక‌ర్యం కూడా ఉంటుంది. లంబ‌సింగి వెళ్లే ప్ర‌తి ప‌ర్యాట‌కుడు ఈ జ‌ల‌పాతాన్ని త‌ప్ప‌క సంద‌ర్శిస్తాడు. ఎత్త‌యిన కొండ‌ల మ‌ధ్య నుంచి జాలువారే నీటి స‌వ్వ‌డులు ఇక్క‌డికి వ‌చ్చే చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంటాయి. వేర్వేరు క్యాస్కేడ్ల‌లో నీరు పడిపోతూ ఉంటుంది. దీనికి కొంద ఒక కొల‌ను కూడా ఉంటుంది. ఇది ట్రెక్కింగ్ ప్రియుల‌కు కూడా ఎంతో అనువైన ప్ర‌దేశ‌మ‌నే చెప్పుకోవాలి. సాహ‌స ప్రియులు కూడా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు. ఈ జ‌ల‌పాతాపు అందాల‌ను కెమెరాల్లో కూడా బందించొచ్చు.

2

365 రోజులు నీరు ప్రవహిస్తుంది..

సమ్మగిరి గ్రామం నర్సీపట్నం నుండి వాయువ్యంగా 24 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. సమ్మగిరి జలపాతాలు నర్సీపట్నం డివిజన్‌లో ఉన్న ఉత్తమ జలపాతాలలో ఒకటి. ఈ జలపాతంలో దాదాపు 365 రోజులు నీరు ప్రవహిస్తుంది. హిల్ క్లైంబింగ్ పట్ల ఆసక్తి ఉన్న వారికి ఇది ఉత్తమమైన ప్రదేశం. ఈ ప్రదేశం వేసవి, చలికాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అక్కడికి వెళ్లడానికి నర్సీపట్నం సిటీ నుండి క్యాబ్‌లు మరియు ఆటో రిక్షాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ స‌మ్మ‌గిరి జ‌ల‌పాతానికి స‌మీపంలోనే దారమట్టం జలపాతం కూడా ఉంది. ఇది కూడా నర్సీపట్నం నుండి పశ్చిమాన 17 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి ద‌గ్గ‌ర్లోనే శివుని ఆలయం ఉన్నాయి. శివ‌రాత్రి రోజున‌, కార్తీక మాసం పండుగ స‌మ‌యంలో భ‌క్తుల‌తో ఈ ప్రాంతం కిక్కిరిసిపోతుంది.

సమీపంలోని జ‌ల‌పాతాలు ఇవే..

స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం స‌మీపంలోనే చింటువానిపాలెం జలపాతం ఉంది. ఇది నర్సీపట్నం నుండి పశ్చిమాన 58 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఈ జలపాతం నర్సీపట్నంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. పర్యాటకులకు ఇది ఉత్తమమైన‌ పిక్నిక్ స్పాట్. ఇక్క‌డికి స‌మీపంలోనే కొయ్యూరు అడవిలో దేవత ఆలయం ఉంది. చుట్టుపక్కల అటవీ ప్రాంతాలతో కూడిన సుందరమైన ప్రదేశం ఇది. సెలవుల్లో ఆనందంగా గడిపేందుకు ఈ ప్ర‌దేశానికి రావొచ్చు. ఈ జలపాతానికి సమీపంలో చాపరై జలపాతం అని పిలువబడే మరొక జలపాతం ఉంది. ప్రజలు తమ సొంత వాహనాల ద్వారా ఈ ప్రాంతానికి రావొచ్చు. నర్సీపట్నం నుండి టాక్సీ లేదా ఆటో అద్దెకు తీసుకొని ఈ ప్రదేశాన్ని చుట్టేయొచ్చు.

More News

    Read more about: visakhapatnam andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+