Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌కృతి మాటున దాగివున్న గండికోట ర‌హ‌స్యాలు...

ప్ర‌కృతి మాటున దాగివున్న గండికోట ర‌హ‌స్యాలు...

ప్ర‌కృతి మాటున దాగివున్న గండికోట ర‌హ‌స్యాలు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ప్రసిద్ధి చెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో ఒక‌టే గండికోట‌.. చుట్టూ లోతైన లోయలు, ఎర్ర‌టి గ్రానైట్ శిల‌ల‌తో ఏర్ప‌డిన కొండ‌లే ఈ గండికోట‌. ఇది క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌ముడుగు తాలుకాలో ఉంది. ఎటూ చూసినా ప‌చ్చ‌ని కొండ‌లు, ఆ కొండ‌ల మాటున దాగిన పెన్నాన‌ది అందాలు ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తాయి. ఎర్ర‌మ‌ల ప‌ర్వ‌త‌శ్రేణికి, పెన్నాన‌దికి ఏర్ప‌డిన గండి మూలంగానే ఈకోట‌కు గండికోట అనే పేరు వ‌చ్చింద‌ని చెబుతున్నారు పూర్వీకులు..రండి ప్ర‌కృతి మాటున దాగి వున్న ఈ కోట ర‌హ‌స్యాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం...

kadapa

వృత్తాకారంలో కోట‌..

గండికోట‌ను గండి కొండ అని కూడా పిలుస్తారు. ఈ గండికోట‌కు క్రీ.శ 1123 జ‌న‌వ‌రి 9న చిద్ద‌న చోళ మ‌హారాజు పునాది వేసిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. ఎంత‌టి శ‌త్రువునైనా ఎదుర్కొనేందుకు అనువుగా ఈ కోట నిర్మాణం ఉంటుంది. గండికోట‌లో అనేక కోట‌లున్నాయి. వాటిని గిరిదుర్గాలు అని పిలుస్తారు. ఈ కోట‌ల నిర్మాణ శైలి ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. మూడువంద‌ల అడుగుల దిగువ‌లో పెన్నాన‌ది ప్ర‌వ‌హిస్తోంది. ఈ పెన్నానది కోట‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాలుగా ఉంటుంది. ఈ కోట చుట్టుకోల‌త సుమారు ఐదు మైళ్లు ఉంటుంది. ఈ కోట వృత్తాకారంలో ఉంటుంది.

సుమారు 40 బురుజులు..

ఈ కోట‌లో సుమారు 40 బురుజుల వ‌ర‌కూ ఉంటాయి. అవి కూడా చ‌తుర‌స్రాకారంలో కొన్ని, మ‌రికొన్ని దీర్ఘ చ‌తురస్రాకారంలో ఉంటాయి. ఈ కోట‌లో ఉన్న మినార్లు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి. ఇంకా ఇక్క‌డ చాలా ఉన్నాయి. కోట‌లోని పెద్ద ధాన్యాగారము అప్ప‌టి రాజుల కాలం నాటిదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్క‌డ పావురాల గోపురం కూడా ఉంది. చెరువులు, బావులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

kurnool fort

ఎన్నో ఆల‌యాలు..

ఇక్క‌డ ప్ర‌సిద్ధి చెందిన ఆల‌యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్క‌డి రంగనాథ ఆలయం ప‌ర్యాట‌కుల‌ను, భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక్కడ ప్ర‌సిద్ధి చెందిన మ‌రో ఆల‌యం. మాధవరాయ ఆలయం. ఇది క్రీ.శ.16 శతాబ్దానికి చెందిన‌ది. ఈ ఆల‌య నిర్మాణ శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆల‌యాల్నీ కోట అంతర్భాగంలోనే ఉన్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి శిథిలావ‌స్థ‌కు చేరుకున్న శిల్పాలు ఇప్ప‌టికీ మ‌న‌కు తార‌స‌ప‌డ‌తాయి. ఇరుకు లోయల్లో ఉన్న ఈ గండికోట లోయ వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ దృశ్యాలు మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనివి.

ఎలా చేరుకోవాలి

గండికోట చేరుకోవాలంటే కడప నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఇక్క‌డికి చేరుకోవాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. జమ్మలమడుగు నుంచి గండికోట సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గండికోట నుంచి జ‌మ్మ‌ల‌మ‌డుగు రైల్వేస్టేష‌న్ చేరుకోవాలంటే సుమారు ప‌దిహేను కిలోమీట‌ర్ల ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. జమ్మలమడుగు నుంచి గండికోటలకు సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు కర్నూలు, బనగానపల్లె, కోవెలకుంట్ల మీదుగా జమ్మలమడుగు చేరుకుని అక్కడి నుంచి గండికోటకు వెళ్లవచ్చు.

More News

    Read more about: kadapa andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+