Search
  • Follow NativePlanet
Share
» »ఈ ప్రాంతంలోని ద్వీపాల స‌మూహాన్ని చూశారా?

ఈ ప్రాంతంలోని ద్వీపాల స‌మూహాన్ని చూశారా?

ఈ ప్రాంతంలోని ద్వీపాల స‌మూహాన్ని చూశారా?

దీవులు అన‌గానే చాలామందికి మ‌దిలో మెద‌లాడే దృశ్యం సముద్రపు అలల మధ్య పచ్చదనంతో నిండిన ప్రదేశం. అలాంటి దృశ్యాలెన్నో ప్ర‌త్య‌క్షంగా మ‌నకు క‌నిపిస్తే ఎలా ఉంటుంది. అలాంటి దృశ్యాలు చూసేందుకు మ‌నం ఎక్క‌డికో విదేశాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న‌దేశంలోనే చూడొచ్చు. రాజ‌స్థాన్‌లోని మ‌హిన‌దిలో 100 కంటే ఎక్కువ ద్వీపాలు నిర్మించబడ్డాయి. వీటిని 'చాచా కోట' అని పిలుస్తారు. రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఇవి ఉన్నాయి. దీనిని 'రాజస్థాన్ చిరపుంజీ' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, రాష్ట్రంలో అత్యంత వర్షపాతం గల ప్రదేశం ఇది. రండి ఇక్కడి అందాల గురించి తెలుసుకుందాం.

1

బన్స్వారా సమీపంలోని ప్రదేశాలు

చాచా కోట

బన్స్వారా నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాచా కోట, మహి నదిపై నిర్మించిన ఆనకట్ట నీటిలో సహజసిద్ధమైన అందమైన ప్రదేశం. ఇక్కడ పచ్చని కొండలు, బీచ్ లాంటి దృశ్యాలు, కంటికి కనిపించేంత వరకు 'ప్రతిచోటా నీరుస మ‌న‌కు కనిపిస్తూనే ఉంటుంది. చుట్టుపక్కల ఎత్తైన కొండలు, దారి పొడవునా పచ్చటి వాతావరణం, స్పైరల్ జిగ్‌జాగ్ రోడ్లు, జలపాతాలు కలిసి ఈ ప్రదేశాన్ని సహజ సౌందర్యంగా మార్చేశాయి.

మహి ఆనకట్ట

మహి బజాజ్ సాగర్ ఆనకట్ట బన్స్వారా జిల్లా జీవనాధారంగా పరిగణించబడుతుంది. ఇది ఈ ప్రాంతపు వ్యవసాయ, ఆర్థిక అభివృద్ధికి ప్రధాన వనరుగా మారింది. 16 గేట్లతో కూడిన మహి డ్యామ్ రాజస్థాన్‌లో రెండవ అతిపెద్ద ఆనకట్ట. బన్స్వారా నగరం నుండి 18 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న ఈ ఆనకట్ట నీటిలో చాలా కొండలు పాక్షికంగా మునిగిపోయి చిన్న ద్వీపాల వంటి సుందరమైన దృశ్యాల‌ను ప‌ర్యాట‌కుల‌కు అందిస్తున్నాయి. అందుకే ఈ ప్రదేశాన్ని "సిటీ ఆఫ్ హండ్రెడ్ ఐలాండ్స్" అని కూడా పిలుస్తారు. నిజానికి బన్స్వారాలో మహి డ్యామ్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.

2

శ్రీ త్రిపుర సుందరి ఆలయం

శ్రీ త్రిపుర సుందరి ఆలయం బన్స్వారా జిల్లా హెడ్ క్వార్టర్ నుండి 19 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఈ ఆల‌యం త్రిపుర సుందరి దేవికి అంకితం చేయబడింది. ఆమెను మాతా తీర్థయ అని కూడా అంటారు. ఇక్క‌డ కొలువైన మాత విగ్రహం 18 చేతులను కలిగి ఉంది. దీనిలో ఆమె వివిధ ఆయుధాలను కలిగి ఉన్న సింహంపై అమర్చబడి ఉంటుంది. ప్రధాన విగ్రహం చుట్టూ 52 భైరవుల మరియు 64 యోగినుల చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇది వాగడ్ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. భక్తులు ఇక్కడికి పూజలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు.

3

సయ్యది ఫకృద్దీన్ అమరవీరుల స్మారకం (గలియాకోట్ నగరం)

గలియాకోట్ రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం.ఇది బన్స్వారా నుండి 80 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. 10వ శతాబ్దంలో ఇక్కడ నివసించిన బాబ్జీ మౌలా సయ్యదీ ఫకృద్దీన్ సమాధికి ఈ నగరం ప్రసిద్ధి చెందింది. దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రజలు ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి నివాళులర్పిస్తారు.

ఎలా చేరుకోవాలి

ఈ ప్రాంతాన్నివిమాన మార్గం ద్వారా చేరుకోవాలంటే మాత్రం సమీప విమానాశ్రయం ఉదయపూర్‌లో ఉంది. ఇది 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలుమార్గం ద్వారా అయితే స‌మీపంలో ర‌త్లాం రైల్వేస్టేష‌న్ ఉంది. ఇక్క‌డి నుండి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుది. రోడ్డు మార్గం ద్వారా అయితే ఢిల్లీ, జైపూర్, భరత్‌పూర్‌, ముంబై నుండి బన్స్వారాకు బస్సులు సులభంగా అందుబాటులో ఉన్నాయి.

More News

    Read more about: chacha fort mahi dam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+