Search
  • Follow NativePlanet
Share
» »మంచుకురిసే వేళ‌లోనూ షింకూ లా పాస్ జ‌ర్నీ షురూ!

మంచుకురిసే వేళ‌లోనూ షింకూ లా పాస్ జ‌ర్నీ షురూ!

మంచుకురిసే వేళ‌లోనూ షింకూ లా పాస్ జ‌ర్నీ షురూ!

హిమాచల్‌తో లడఖ్‌ను కలిపే ఎత్త‌యిన‌ పర్వత మార్గం షింకూ లా పాస్‌. హిమాచల్ మరియు లడఖ్‌ల మ‌ద్య దాదాపు ఆరువంద‌ల కిమీమీట‌ర్ల దూరంతో సముద్ర మట్టానికి 16500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. బైక్ ట్రెక్క‌ర్ల‌కు ఇదోక స్వ‌ర్గ‌ధామంగా పేరుగాంచింది. ఎటుచూసినా ఆక‌ర్షించే ప‌ర్వ‌త శ్రేణులు ట్రెక్క‌ర్ల‌ను ఆహ్వానించేవి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా దర్చా నుండి శింకుల పాస్ వరకు రహదారిని 2015లో నిర్మించారు. అయితే, ఈ రహదారి వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అందుకు కార‌ణం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉండ‌ట‌మే. యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి, షింకుల పాస్ వద్ద ఆల్ వెదర్ టన్నెల్‌ను నిర్మించాలని ప్రతిపాద‌న రావ‌డంతో అది కార్య‌రూపం దాల్చింది. ఈ మార్గం పొడవైనది మాత్ర‌మే కాకుండా ఎత్తయిన సొరంగం కూడా. ఇది 4.25 కిమీట‌మీర్ల‌ పొడవు మరియు 16580 అడుగుల ఎత్తులో, షింకూ లా పాస్ క్రింద ఉంటుంది.

ప్ర‌స్తుతం చ‌రిత్ర‌లో తొలిసారి షింకూ లా పాస్ శీతాకాలంలోనూ ప్రయాణికులకు సేవలందిస్తోంది. 5091 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పాస్ హిమాచల్ లోని లాహౌల్-స్పితి ప్రాంతాలను జాంస్కర్ లోయలోని కార్గిల్‌తో కలుపుతుంది. సాధారణంగా అయితే ఈ సమయంలో మంచుకురిసి ప్రమాదకరంగా ఉంటుందన్న కారణంతో దీనిని మూసేసేవారు. అందుకే దేశీయ ప‌ర్యాట‌కులు త‌క్కువగా సంద‌ర్శించే అద్బుత‌మైన సాహ‌స ప‌ర్యాట‌క కేంద్రంగా ఇది ప్ర‌సిద్ధి పొందింది.

Shinku La Pass

ఈ సీజ‌న్‌లో కాలిన‌డ‌క‌న మంచుపై కాలిన‌డ‌క‌ను ప్ర‌యాణం చేసేందుకు ఎక్కువ‌మంది ఆస‌క్తి చూపుతారు. అయితే, ట్రాన్స్‌పోర్ట్ ప‌రంగా ఈ ర‌హ‌దారి మూసివేయ‌డంతో ఇబ్బందులు ఎదుర‌య్యేవి. అయితే, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అత్యాధునిక పద్ధతులతో ఇక్కడ రహదారి నిర్మించడంతో సంవత్సరమంతా ఈ మార్గం అందుబాటులో ఉండాలన్న అక్కడి ప్రజల కల సాకారమైంది.

ఓ స్వాప్నికుడి కృషి ఫలితం

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టు చేపట్టడానికి ముందే ఓ వ్యక్తి 17.5 కిలోమీట‌ర్ల‌ ఈ పాస్‌లో తన సొంత డబ్బుతో రోడ్డు నిర్మించాడు. ఆ వ్యక్తి పేరు చుల్తిమ్ చేంజో. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన చోంజో తన జీవిత కాలంలో చాలా రోజులు రోడ్డు సౌకర్యంలేక ఈ మార్గంలో కాలినడకనే ప్రయాణించేవారు. అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా రోడ్డు మాత్రం నిర్మించలేదు.

Shinku La Pass

ఆఖరికి తాను పదవీవిరమణ చేశాక దాచుకున్న డబ్బు, స్థానికుల తోడ్పాటుతో షింకూ లా పాస్ రోడ్డు నిర్మించారు. ఈ ర‌హ‌దారిని అత‌ను 2014 నుంచి 2017 మ‌ధ్య పూర్తి చేశాడు. అనంత‌రం ఈ రోడ్డును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ స్వాధినం చేసుకుని మ‌రింత మెరుగుప‌రిచేందుకు ముందుకొచ్చింది. అంతేకాదు, చుల్తిమ్ చెంజో చేసిన సామానిక సేవ‌ను గుర్తించి ఆయ‌న‌ను 2021లో ప‌ద్మశ్రీ పుర‌ష్కారం వ‌రించింది.

స‌ముద్ర‌మ‌ట్టానికి 16600 అడుగుల ఎత్తులో ఉన్న షింకూ లా పాస్‌, రోహ్‌తంగ్ మ‌రియు జోజిలా పాస్‌ల మాదిరిగానే ఇక‌నుంచి శీతాకాల‌పు మంచును అధిగ‌మించి ప్ర‌యాణీకుల‌కు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధ‌మ‌యింద‌న్న మాట‌. మ‌రెందుకు ఆల‌స్యం మంచును చీల్చుకుంటూ సాగే ఈ సాహ‌స యాత్ర‌కు మీరూ సిద్ద‌మ‌వ్వండి.

More News

    Read more about: himachal ladakh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+