శివ భగవానుడు అందరకూ ఆరాధ్య దైవమె. సాధారణంగా శివుడిని లింగ రూపంలో పూజిస్తారు. అభిషేకాలు చేస్తారు. ఇంకా వివిధ అర్చనలతో ఆ భగవానుడి అనుగ్రహం పొందుతారు. కొందరు శివుడిని పూజిస్తే, మరి కొందరు విష్ణువుని పూజిస్తారు.
ఇంకనూ కొందరు, గణేశ, కుమారస్వామి, శక్తి దేవతలు మొదలైన వారిని పూజించి తమ కోరికలు తీర్చు కుంటారు. భక్తి భావనలు వెల్లడిస్తారు. సాధారణంగా శివాలయం లేని గ్రామం వుండదు. ప్రతి గ్రామంలోను ఒక శివ లింగం వుండి తీరవలసినదే. దానికి ఒక గుడి కట్టించవలసినదే. దానికి మన ఆచార వ్యవహారం మేరకు పూజలు నిర్వహించి ఆధ్యాత్మికత ను చాటుకుంటారు.
మహిమాన్విత శివ భగవానుడి రూపాలు అనేకం కలవు. ఆ భగవంతుడి కి ప్రాతినిధ్యం వహించే లింగాలు సైతం మనకు వివిధ రూపాలలో, వివిధ నామాలతో దర్శనం ఇస్తాయి. మరి ఈ వ్యాసంలో అటువంటి కొన్ని ఆకర్షణీయ శివ లింగాలను వివిధ ప్రదేశాలలో కల వాటిని పరిశీలిద్దాం.
శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
కోటిలింగేశ్వర: కర్నాటక రాష్ట్రంలో బంగారు గని గా చెప్పబడే కోలార్ జిల్లా లోని కమ్మ సాంద్ర అనే గ్రామంలో ఈ అతి పెద్ద శివ లింగం కోటి లింగేస్వరుడి గా పూజలు అందుకుంటోంది. మహా శివ రాత్రి వేడుకలలో ఈ గుడికి సుమారు రెండు లక్షల కంటే అధిక భక్తులు వచ్చి దర్శించుకుంటారు.

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
కోటిలింగేశ్వర
ఇక్కడ కల పెద్ద శివ లింగం ఆసియా ఖండంలోనే అతి ఎత్తైనది. సుమారు 108 అడుగుల ఎత్తు కలది అంటే ఆశ్చర్యమే మరి.
ఫోటో క్రెడిట్: gsnewid

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
కోటిలింగేశ్వర
ఈ శివలింగం ఎదురుగా 35 అడుగుల ఎత్తు కల ఒక నంది విగ్రహం కూడా చూడవచ్చు.
ఫోటో క్రెడిట్: SGKiron

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
కోటిలింగేశ్వర
అంతేకాదు, ఈ శివ లింగం చుట్టుపక్కల సుమారు 15 ఎకరాల విస్తీర్ణం లో చిన్న చిన్న శివలింగాలు లక్షలలో ఉంటాయంటే మరింత ఆశ్చర్యం కూడాను.
ఫోటో క్రెడిట్: Pponnada

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
బడవి లింగ: ఈ శివ లింగం హంపి లో కలదు. హంపి లోని లక్ష్మి నరసింహ విగ్రహం సమీపంలో కలదు. ఈ లింగం సమీపంలో ఎల్లపుడూ నీరు ప్రవహిస్తూ వుంటుంది.
ఫోటో క్రెడిట్: Dey.sandip

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
హొయసలేశ్వర : కర్నాటక లోని ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం బేలూరు హళిబేడు లో ఈ అందమైన శివలింగం చూడవచ్చు. దీనిని హొయసలేశ్వర దేవాలయంలో చూడవచ్చు.
ఫోటో క్రెడిట్: Anks.manuja

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
సహస్రలింగ : ఉత్తర కర్ణాటకలో సహస్ర లింగం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడ కల సాల్మల నదీ తీరంలో అనేక శివ లింగాలు చూడవచ్చు. శివరాత్రి పండుగకు ఇక్కడకు భక్తులు అధికంగా వస్తారు
ఫోటో క్రెడిట్: Unique.creator

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
కద్రి : మంగళూరు లో కల కద్రి లోని దేవ్వ్లయ శివలింగం.
ఫోటో క్రెడిట్: Vaikoovery

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
తీర్థ హళ్లి : షిమోగా జిల్లా లోని తీర్థ హళ్లి లో తుంగా నది ఒడ్డున కల ఒక ప్రాచీన శివ లింగం మరియు నంది. ఇక్కడ జరిగే అమావాస్య పండుగకు భక్తులు అధికంగా వస్తారు.
ఫోటో క్రెడిట్: Manjeshpv

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
1008 శివలింగాలు : కర్నాటక లోని హంపి పట్టణంలో ఒక కొండపై నుండి చూస్తె కనపడే అద్భుతమైన 1008 లింగాల సమూహం.
ఫోటో క్రెడిట్: Pratheepps

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
బొర్రా గుహ శివలింగాలు : ఆంద్ర ప్రదేశ్ లోని అద్భుత హిల్ స్టేషన్ అయిన అరకు లోని అనంతగిరి కొండల లో కల ప్రసిద్ధ బొర్రా గుహలలోని శివ లింగాలు
ఫోటో క్రెడిట్: Joshi detroit

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
భైరవేస్వర శివలింగం : ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లాలో కల పులివెందుల లోని భైరవేస్వర శివలింగం
ఫోటో క్రెడిట్: Mopuru

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
లేపాక్షి : ఆంధ్ర ప్రదేశ్ లోని లేపాక్షి లో కల వీరభద్ర దేవాలయం లో కల ఏడూ పడగల రక్షణలో కల శివలింగం
ఫోటో క్రెడిట్: Pavithrah

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
రాజ్బరి శివ లింగం : అస్సాం రాష్ట్రంలోని నాగావ్ జిల్లా లో జుగిజాన్ ప్రదేశంలో కల ఒక అతి పురాతన శివ లింగం
ఫోటో క్రెడిట్: Diganta Talukdar

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
దానిధర్ : గుజరాత్ రాష్ట్రంలోని జం నగర్ జిల్లాలో కలవాడ్ తాలూకాలో కల ధనిధర్ శివ లింగం
ఫోటో క్రెడిట్: જીતેન્દ્રસિંહ

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
వైద్య నాథ్ శివలింగం : హిమాచల్ ప్రేదేశ్ లోని కాంగ్రా పట్టణంలో కల వైద్య నాథ్ దేవ్వాలయంలో కల శివ లింగం పురాణాల మేరకు ఈ శివ లింగాన్ని రావణుడు శివుడి వద్ద నుండి పొంది ఇక్కడ ప్రతిష్టించాడని చెపుతారు.
ఫోటో క్రెడిట్: Jngupta

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
అమర్ నాథ్ : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అమర్ నాథ్ లోని సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన శివ లింగం. దీని దర్శనానికి అనేక కష్ట నష్టాలకు ఓర్చి భక్తులు తండోప తండాలుగా వస్తారు.
ఫోటో క్రెడిట్: Gktambe

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
మామలేశ్వర : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం జిల్లాలో కల మామేలేస్వర శివ లింగం
ఫోటో క్రెడిట్: Divya Gupta

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
పహాడి మందిర శివ లింగం : జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి పట్టణంలో ప్రసిద్ధి చెందినా పహాడి మందిరం లో కల శివ లింగం. ఈ దేవాలయం కొండ కోన దల్లి కలదు. దర్శనానికి అనేకమంది భక్తులు వస్తారు
ఫోటో క్రెడిట్: Biswarup Ganguly

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
మాహేశ్వర : మధ్య ప్రదేశ రాష్ట్రం లోని మాహేశ్వరి లో నర్మదా నది ఒడ్డున నంది విగ్రహం సహితంగా ప్రతిష్టించబడిన మాహేశ్వర శివలింగం.
ఫోటో క్రెడిట్: nevil zaveri

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
భోజ్ పూర్ : మధ్య ప్రదేశ్ లోని భోజ్ పూర్ లో కల ఒక పురాతన శివాలయం లోని శివ లింగం
ఫోటో క్రెడిట్: Yann

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
బుల్లె సర్కార్ : మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో బుల్లె సర్కార్ గా ఖ్యాతి గాంచిన శివాలయ శివ లింగం
ఫోటో క్రెడిట్: Mohit8soni

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
ఖజురాహో : కామకేలి శిల్పాలకు ప్రసిద్ధి చెందినా మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో లో కల దేవాలయ శివలింగం
ఫోటో క్రెడిట్: Rajenver

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
ఎలెఫెంటా గుహలు : ప్రపంచ వారసత్వం గుర్తింపు పొందిన ఎలెఫెంటా గుహలలో కనపడే శివ లింగం. ఇది ముంబై నగరానికి సుమారు పది కి. మీ. ల దూరంలో కలదు.
ఫోటో క్రెడిట్: Nehha.1990

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
ఎల్లోరా : ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన మహారాష్ట్ర లోని మరొక ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం అజంతా ఎల్లోరా గుహలు. ఎల్లోరా గుహలో కనపడే అతి ప్రాచీన శివ లింగం

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
సతారా : మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల బొమ్మాలియ నారాయణ మహారాజ మటం లోని శివ లింగం
ఫోటో క్రెడిట్: Nilrocks

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
మహా దేవా దేవాలయం : పూనా నగరం లో కల మహాదేవ దేవాలయం లోని వినూత్న శివ లింగం
ఫోటో క్రెడిట్: Bsnehal

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
రత్నగిరి : మహారాష్ట్ర లోని రత్న గిరి లో కల తిబా పాలస్ లో కల సర్పం పాడగా కింద కల శివ లింగం
ఫోటో క్రెడిట్: Viraat Kothare

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
రామేశ్వర దేవాలయం : మహారాష్ట్ర లోని సింధు దుర్గ విజయ దుర్గ లో కల రామేశ్వర దేవాలయ శివ లింగం
ఫోటో క్రెడిట్: कोल्हापुरी

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
బాల సోర్ : ఓడిశా లోని భువనేశ్వర్ నుండి సుమారు 194 కి. మీ. ల దూరంలో కల బాల సోర్ అనే పట్టణంలో కల ఎత్తైన భూ సందేస్వర శివలింగం
ఫోటో క్రెడిట్: Psubhashish

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
మౌంట్ అబూ : రాజస్తాన్ లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ మౌంట్ అబూ పట్టణంలోని ఒక తోటలో కనపడే అతి పెద్ద శివ లింగం
ఫోటో క్రెడిట్: 1694

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
బృహదీశ్వర దేవాలయం : తమిళనాడులోని తంజావూర్ పట్టణంలో కల ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయం లోని పెద్ద ఏక శిలా శివలింగం
ఫోటో క్రెడిట్: Shefali11011

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
ధ్యాన లింగ దేవాలయం : తమిళనాడు లోని కోయం బట్టూర్ లో కల దేవాలయంలో కల సుందరమైన ఈ శివ లింగం భక్తులను అమితంగా ఆకర్షిస్తుంది.
ఫోటో క్రెడిట్: DASHBot

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
జంబుకేశ్వర : తమిళనాడు లోని శ్రీ క్షేత్ర శ్రీరంగం లో కల జంబుకేశ్వర దేవాలయం లో కల పవిత్ర శివలింగం
ఫోటో క్రెడిట్: Ilya Mauter

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
అరసనీస్వర : తమిళనాడు లోని విల్లుపురం లో కల రాయపుతూ పాకం గ్రామంలో కల అందమైన, గంభీరమైన అరశానీస్వర శివలింగం
ఫోటో క్రెడిట్: Arunankapilan

శివుడు ఒక్కడే ...లింగాలు వివిధ రూపాలు !
హరిహర నాద : ఉత్తర ప్రదేశ్ లోని గ్యానపుర లో కల హరి హర నాద మందిరంలో కల అందమైన శివ లింగం
ఫోటో క్రెడిట్: Vikasudayrajsharma



Click it and Unblock the Notifications











