Search
  • Follow NativePlanet
Share
» »ఫిబ్ర‌వ‌రి 19 నుంచే సిక్కోలు శాలిహుండం జాత‌ర మొద‌లు

ఫిబ్ర‌వ‌రి 19 నుంచే సిక్కోలు శాలిహుండం జాత‌ర మొద‌లు

శ్రీకాకుళంలోని శాలిహుండం శ్వేతగిరిపై వెలసిన కాళీయ మర్ధన వేణుగోపాలస్వామి తిరుకల్యాణం, శాలిహుండం జాతర ఈ నెల 19 నుంచి 24 వరకు నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు నిర్ణ‌యించారు. దీంతో ఉత్త‌రాంధ్ర‌లోని ప్ర‌ధాన జాత‌ర‌ల్లో ఒక‌టిగా పేరుగాంచిన శాలిహుండం జాత‌ర‌కు భ‌క్తులు సిద్ధ‌మ‌వుతున్నారు. వంశ‌ధార నది ఒడ్డున వెల‌సిన ఇక్క‌డి ఆల‌య ప్రాముఖ్య‌త‌తోపాటు జాత‌ర ప్ర‌త్యేక‌త‌లు తెలుసుకుందాం.

శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం శ్వేతగిరిపై వెలసిన కాళీయ మర్ధన వేణుగోపాలస్వామి తిరుకల్యాణం, శాలిహుండం జాతర ఈ నెల 19 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి, అర్చకుడు మహేంద్రాడ సాయిశర్మ ఒక ప్రకటనలో వెల్ల‌డించారు. 19న సాయంత్రం తిరువీధితో ఉత్సవం ప్రారంభమవుతుందని, అదే రోజు అర్ధరాత్రి పంచామృత అభిషేకం చేసిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. 20న ఉదయం స్వామి చక్రస్నానం జ‌రుగుతుంద‌ని అన్నారు.

venugopalaswamytemple1

శాలిహుండం చారిత్ర‌క నేప‌థ్యం..

శాలిహుండం ప‌ర‌వ‌ల్లుతొక్కే వంశధార నది దక్షిణ ఒడ్డున బోరవానిపేట గ్రామానికి ఆనుకొని కళింగపట్నానికి ఐదు కిలోమీటర్లు, శ్రీకాకుళం టౌన్‌ కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజానికి ఈ కొండ‌ను శాలివాటిక (Rice emporium) అని పిలుస్తారు. ఈ కొండపైన ఉన్న‌ పురాతన వేణుగోపాలస్వామి ఆలయం శాలివాహన కాలంలో నిర్మించ‌బ‌డింద‌ని చరిత్ర చెబుతోంది. ఇక్క‌డ ఏటా భీష్మ ఏకాదశి రోజున వేణుగోపాలస్వామి పుట్టినరోజు వేడుకలు ఘ‌నంగా జ‌రుపుతారు.

దీనినే కాళీయ మర్దన వేణుగోపాలుని యాత్ర, శాలిహుండం జాత‌ర లేదా కొండమీద జాత‌ర‌ అని ప‌లు పేర్ల‌తో పిలుస్తారు. శాలిహుండాం జాతరకు వివిధ జిల్లాల నుంచేకాకుండా పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భ‌క్తులు అత్యధిక సంఖ్యలో వ‌స్తుంటారు. ఈ శ్రీక్రిష్ణ దేవుని దర్శించడం వారి పూర్వ జ‌న్మ సుక్రుతంగా భావిస్తారు. భీష్మ ఏకాదశి జాతరను శాలిహుండం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవంగా భావించి కుటుంబ స‌భ్యుల‌తోపాటు బంధుమిత్రుల‌తో ఆనందంగా జరుపుకుంటారు.

kalingapatnam1

ఈ ఏడాది జాత‌ర‌ ప్ర‌ణాళిక‌లు..

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన శాలిహుండం వేణుగోపాలుని యాత్రను ఫిబ్ర‌వ‌రి 19న‌ నిర్వహించనున్నారు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి(భీష్మఏకాదశి)రోజున నిర్వహించే ఈ యాత్రలో వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా 12వ శతాబ్దానికిచెందినదిగా భావిస్తున్న ఈ వేణుగోపాలునికి సంతాన వేణుగోపాలస్వామి అని పిలుస్తారు. ప్ర‌ధానంగా సంతానం లేనివారు ఈ స్వామిని దర్శించి, పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చాలా ఏళ్లుగా ఇక్క‌డికి వ‌చ్చే భక్తుల విశ్వాసం.

కాలి న‌డ‌క‌న కొండ‌పైకి..

జాత‌ర‌కు వ‌చ్చే భక్తులు కొండ ప్రక్కన ప్రవహించే వంశధార నదిలో పుణ్యస్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకుంటారు. అక్క‌డే స్వామిని దర్శించి త‌మ‌ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ కొండపైకి వెళ్లేందుకు వీలుగా మెట్లదారి కూడా అందుబాటులో ఉంది. అలా దర్శనం పూర్తయిన త‌ర్వాత‌ కొండ దిగేందుకు మరో మెట్లదారి ఉంది. కొండపైన వేణుగోపాలుని దర్శించిన భక్తులు అక్కడకు దగ్గర్లోని వీరవసంతేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీగా వ‌స్తోంది. వేణుగోపాలుని ఉత్సవమూర్తులను పల్లకిలో భీష్మ ఏకాదశి రోజున అంటే ఫిబ్ర‌వ‌రి 20న ఉదయం మేళ, తాళాలతో ఊరేగింపుగా వంశధార నది మధ్యలో అర్చక స్వాములు చక్రస్నానం చేయించి, అక్కడ నుంచి తిరువీధి నిర్వహిస్తారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+