ఈ వేడి వేడి ఎండల్లో చల్లని ప్రదేశాలను చుట్టేయాలి ఎవరైనా అనుకుంటారు. అలాంటి వారికోసం ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అది కూడా కూల్‌కూల్‌గా ఉండే ఊటీ ప్రదేశం. IRCTC టూరిజం ఊటీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీని తిరుపతి నుంచి ఆపరేట్ చేస్తోంది. ఆరు రోజులపాటు సాగే ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీలో ఊటీలోని కూలెస్ట్ ప్లేసెస్‌ను సందర్శించొచ్చు. అతి తక్కువ ధరతోనే ఊటీలోని ప్రదేశాలను చుట్టేయొచ్చు.
ULTIMATE OOTY EX TIRUPATI (SHR095) పేరుతో ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ఈ నెల 23 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ట్రైన్ టికెట్ బుక్ చేసుకవచ్చు. ఏప్రిల్ 23న వీలుకాకపోయిన, వచ్చేవారంలో ఊటీ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.

తిరుపతి టు ఊటీ ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలు:
ఈ సమ్మర్‌లో కూలెస్ట్ ప్రదేశమయిన ఊటీని చూసేందుకు IRCTC టూరిజం ప్రయాణికుల కోసం ఓ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇక, ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీ తిరుపతి నగరం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 23 న ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఐదు రోజులు , ఆరు రాత్రులు అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది.
ఆరు రోజుల టూర్ వివరాలివే..!
మొదటిరోజు తిరుపతి నుంచి రాత్రి 11.55 గంటలకు రైలు(Train No.17230, Sabari Express) బయల్దేరుతుంది.
మరుసటి రోజు ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. అదే రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నఊటీ లేక్‌ను సందర్శిస్తారు. మూడో రోజు ఉదయం అల్పాహారం ముగిసిన తర్వాత Dodabetta, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ ను సందర్శించాల్సి ఉంటుంది.

రాత్రి కూడా ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది నాలుగోరోజు టిఫిన్ ముగిసాక ఊటీ నుంచి కున్నూరుకు ప్రయాణం ఉంటుంది. ఇక్కడ పలు ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరిగి ఊటీకి బయలుదేరుతారు. ఐదోరోజు కోయంబత్తూరుకు చేరుకుంటారు. 17229 అనే నెంబర్‌గల ట్రైన్ సాయంత్రం 04:35 నిమిషాలకు తిరుగుముఖం పడుతుంది. ఆరోరోజు రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడితో ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరల వివరాలిలా ఉన్నాయి...
కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 31,230 చెల్లించాలి.డబుల్ షేరింగ్ కు రూ. 16690 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.13080గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 29890 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ షేరింగ్ కు రూ. 15350గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11740గా చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు కూడా టిక్కెట్ దరలు చెల్లంచా.
5 నుంచి 11 ఏళ్ల చిన్నారులు టిక్కెట్ తీసుకోవాలి. ఈ ప్యాకేజీలో భాగంగా టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఖర్చులు వారే భరిస్తారు. ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీకోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే https://www.irctctourism.com/ వెబ్ సైట్‌ను సంప్రదించగలరు. ఈ వెబ్‌సైట్‌లోనే టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications













