Search
  • Follow NativePlanet
Share
» »అహ్మ‌దాబాద్‌లోని రివ‌ర్ ఫ్రంట్ ఫ్ల‌వ‌ర్ షో ప్ర‌త్యేక‌త‌లు మీకోసం...

అహ్మ‌దాబాద్‌లోని రివ‌ర్ ఫ్రంట్ ఫ్ల‌వ‌ర్ షో ప్ర‌త్యేక‌త‌లు మీకోసం...

కొత్త సంవత్సరం నాడు కొత్త ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌ని కోరుకుంటారు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ సేదతీరాల‌ని చూసేవారు కొంద‌రైతే, జ‌లపాతాలలో జ‌ల‌కాడాల‌ని అనుకునేవారు మ‌రికొంద‌రు. రంగు రంగుల పూల మ‌ధ్య విహ‌రించాల‌ని కూడా చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం అహ్మ‌దాబాద్ ఆహ్వనం ప‌లుకుతోంది. ఎందుకంటే ఇక్క‌డ ఫ్ల‌వ‌ర్ షో ప్రారంభ‌మైంది. ప్ర‌తి ఏడాది కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఇక్క‌డ రివ‌ర్ ఫ్రంట్ ఫ్ల‌వ‌ర్ షో ప్రారంభ‌మ‌వుతుంది.

ఈ ఫ్ల‌వ‌ర్ షోను గుజరాత్ ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్ ప్రారంభించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో మొద‌టిసారిగా 15 ల‌క్ష‌ల ర‌కాల పూలు, మొక్క‌లు ప‌ర్యాట‌కులు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇంకా ఇక్క‌డ 7ల‌క్ష‌లకు పైగా మొక్క‌ల‌తో 400 మీట‌ర్ల పొడ‌వైన ఫ్ల‌వ‌ర్ స్ట్ర‌క్చ‌ర్‌ను నిర్మించారు. ఈ ఫ్ల‌వ‌ర్‌షోకు వ‌చ్చే అతిథుల‌ను ఇవి ఎంతో బాగా ఆక‌ట్టుకుంటాయి.

Riverfront Flower Show in Ahmedabad

ఇక్క‌డ 21 నర్సరీ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు..

ఈ ఫ్లవర్ షో డిసెంబరు 30 నుండి జనవరి 15, 2024 వరకు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. ఈ ఫ్ల‌వ‌ర్ షో ఉదయం 9 గంటల నుంచి ప‌ర్యాట‌కుల కోసం తెరవబడుతుంది. ఈ ఫ్లవర్ షోను రాత్రి 10 గంటల వరకు చూడవచ్చు. ఫ్లవర్ షోలో, పెటునియా, బిగోనియా, క్రిసాన్తిమం, విమ్కా, గజెనియా వంటి ప్రకాశవంతమైన రంగులతో కూడిన 30 రకాల అన్యదేశ పుష్పాలను చూసే అవ‌కాశం క‌లుగుతుంది.

ఈ ఫ్ల‌వ‌ర్‌షోను 2013 నుంచి నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. ఈ ఫ్ల‌వ‌ర్‌షో ద్వారా ప‌ర్యాట‌కుల‌కు తోటలు, పువ్వుల ప్ర‌త్యేక‌త‌లు, వాటి విశిష్ట‌త‌ల‌ను తెలియ‌జేయ‌డం వంటివి చేస్తుంటారు. గార్డెనింగ్ అంటే ఇష్ట‌ప‌డే వారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. ఇక్క‌డ 21 నర్సరీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి, ఇక్కడ సందర్శకులు పురుగుమందులు, వివిధ రకాల మొక్కలు మరియు పువ్వుల విత్తనాలు, ఎరువులు, ఉద్యానవనాలు మొదలైన వాటిని కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది.

అహ్మదాబాద్ ఫ్లవర్ షోలో మీరు చాలా ర‌కాల పూలతో చేసిన ప్రతిరూపాలను చూసే అవకాశం లభిస్తుంది. వీటిలో వాద్‌నగర్, వైబ్రెంట్ గుజరాత్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కొత్త పార్లమెంట్ హౌస్, కార్టూన్ పాత్ర, గాంధీజీ గాజులు, మోధేరా సూర్య దేవాలయం, సూర్యుని 7 గుర్రాలు, చంద్రయాన్, మహిళా సాధికారత, ఒలింపిక్ లోగో, వాటర్ పిచ్చర్, గ్లోబ్ యొక్క ప్రతిరూపం ఉన్నాయి. విమానాలతో సహా ఇతర ప్రతిరూపాలు పువ్వులు, మొక్కలను కూడా ఇక్క‌డ చూడొచ్చు.

ప్ర‌వేశ రుసుము...

ఈ ఫ్లవర్ షోలో ప్రవేశించేందుకు టిక్కెట్లను కూడా ఏర్పాటు చేశారు. పెద్దలకయితే రూ.50 మాత్ర‌మే. అదికూడా సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్ర‌మే ఉంటుంది. అదే వారాంతాల్లో అంటే శని, ఆదివారాల్లో ప్రవేశ రుసుము పెద్ద‌ల‌కు 75 రూపాయ‌లు ఉంటుంది.

ఇక‌, 12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్లవర్‌ షో ప్రవేశ రుసుం పెంచ‌డం జ‌రిగింది. ప్రవేశ రుసుము సాధారణ రోజుల్లో ₹30 మరియు వారాంతాల్లో ₹50గా ఉండేది. కానీ, ఇప్ప‌డు అది పెరిగింది. 2013లో తొలిసారిగా అహ్మదాబాద్ ఫ్లవర్ షోను ప్రారంభించింది. ఇది క్రమంగా ఎంతో మెరుగుప‌డుతూ ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+