Search
  • Follow NativePlanet
Share
» »చాళుక్యులచే విశేషంగా నిర్మిపంబడిన రాజరాజేశ్వర స్వామి ఆలయం

చాళుక్యులచే విశేషంగా నిర్మిపంబడిన రాజరాజేశ్వర స్వామి ఆలయం

చాళుక్యులచే విశేషంగా నిర్మిపంబడిన రాజరాజేశ్వర స్వామి ఆలయం

కరీం నగర్ జిల్లాలో ఉన్న వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందినది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. ఇక్కడ పరమశివుడు రాజరాజేశ్వర స్వామి పేరుతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు.

ప్రాచీన కాలానికి సంబంధించిన సంస్కృతీ-సంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉట్టిపడేలా ఇప్పటికీ దేశంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అటువంటి కట్టడాల్లో వేముల వాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో విశేషమైనది. చాళుక్యులు ఎంతో వైభవంగా నిర్మించిన ఈ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఈ ఆలయాన్ని సందరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. మరి ఈ పుణ్యక్షేత్రం గురించి స్థల పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం..

స్థల పురాణం:

స్థల పురాణం:

భాస్కర, హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఆ ఆలయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది.

అర్జునుడి మునిమనవడైన

అర్జునుడి మునిమనవడైన

అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట.

Photo Courtesy: anwar.babu

కొలను సమీపంలో

కొలను సమీపంలో

కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణగాథ ఉంది. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.

Photo Courtesy: telangana tourism

ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి

ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి

ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి మూల విరాట్టుకు కుడిప్రక్కన శ్రీ రాజరాజేశ్వరీ దేవి, ఎడమవైపు శ్రీ లక్ష్మీ సహితసిద్ద వినాయక విగ్రహాలున్నాయి. ధర్మ గుండం కోనేరుపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్టించబడింది. ధ్యాన ముద్రులో ఉన్న శివుడి విగ్రం చుట్టూ 5 శివలింగాలున్నాయి.

Photo Courtesy: anwar.babu

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి నరసింహుడుకు రాజదిత్య అనే బిరుదు ఉండేది. అతని పరిపాలనకాలంలోనే నిర్మితమైన ఈ ఆలయానికి అతని బిరుదు పేరిట ఈ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.

ఈ ఆలయంలో శివరాత్రి రోజున వంద మంది

ఈ ఆలయంలో శివరాత్రి రోజున వంద మంది

ఈ ఆలయంలో శివరాత్రి రోజున వంద మంది అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. అప్పుడు దేవాలయాన్ని మూడు లక్షలకుపైగా భక్తులు సేవించుకుంటారు. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్థరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.

ప్రధాన దేవాలయమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి

ప్రధాన దేవాలయమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి

ప్రధాన దేవాలయమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారామ చంద్రస్వామి, అనంత పద్మనాభస్వామి, కేదార, బాలారాజేశ్వరస్వామి, దక్షిణామూర్తి, త్రిపురసుందరి దేవాలయాలున్నాయి.

Photo Courtesy: anwar.babu

అలాగే గండదీపం,

అలాగే గండదీపం,

అలాగే గండదీపం, ఉత్సవ మూర్తుల అద్దాల మహాల్, నాగిరెడ్డి మండపం, ఆలయ భోజనశాల, ఆలయ పరిపాలనా భవనం ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్నాయి.

ఈ ఆలయంలో మూలవిరాట్టుకి కుడిపక్కన శ్రీ రాజరాజేశ్వరీ దేవి, ఎడమవైపు శ్రీలక్ష్మీ సహిత సిద్ది వినాయకుని విగ్రహాలున్నాయి.

 భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు.

భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు.

ఈ ఆలయంలో మరో విశిష్టత , భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు. భక్తులు కోడెగిత్తలను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల ఆపార నమ్మకం.

Photo Courtesy: anwar.babu

గండ దీపాన్ని వెలిగించడం కూడా

గండ దీపాన్ని వెలిగించడం కూడా

పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని ఇక్కడి భక్తులు భావిస్తారు. దర్శ గుండం కోనేరు రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నది. ఈ కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఈ కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి.

Photo Courtesy: anwar.babu

 ఇస్లాం మతానికి చెందిన

ఇస్లాం మతానికి చెందిన

ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఎక్కువగా ఆరాధిస్తుండే వాడు, ఇదే గుళ్ళో ఉంటూ స్వామివారిని సేవిస్తూ అక్కడ మరణించడంతో అతని స్మృత్యర్ధం గుడిలోపల ఒక మసీదును నిర్మించారట. ఇది దాదాపు 400ఏళ్ళ నాటి మసీదు అని చెప్పవచ్చు.

Photo Courtesy: Anoop Rao

ఇంకా ఈ ఆలయం గోడలపై

ఇంకా ఈ ఆలయం గోడలపై

ఇంకా ఈ ఆలయం గోడలపై ఉన్న కొన్ని శిల్పాలు, జైన, బౌద్ద సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. అందుకే శైవులు , వైష్ణవులు, జైనులు, బౌద్దులు తదితరుల వారు కూడా ఈ ఆలయాన్ని సదర్శిస్తుంటారు.

Photo Courtesy: anwar.babu

వేములవాడకు ఎలా వెళ్లాలి?

వేములవాడకు ఎలా వెళ్లాలి?

వేములవాడ లో ఎటువంటి విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ లేదు. కేవలం హైదరాబాద్ నుండి ప్రతిరోజు పరిమిత సమయంలో మాత్రమే బస్సులు ఉన్నాయి. ప్రయాణ సమయం ప్రభుత్వ బస్సులో అయితే 4 గంటల 3 నిమిషాలు, అదే త్వరగా చేరుకోవాలంటే క్యాబ్ ద్వారా 2 గంటల 52 నిమిషాల సమయం పడుతుంది.

విమాన మార్గం
వేములవాడ లో ఎటువంటి విమానాశ్రయం లేదు. దీనికి సమీపంలో ( 205కి. మీ) గల విమానాశ్రయం హైదరాబాద్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి క్యాబ్ లేదా ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా వేములవాడ చేరుకోవచ్చు లేకుంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు వేములవాడ కి నడిచే బస్సులో ప్రయాణించవచ్చు.

రైలు మార్గం
వేములవాడ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ, 67 కి. మీ. దూరంలో ఉన్న కామారెడ్డి రైల్వే స్టేషన్ దీనికి సమీపంలో గల రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ప్రధాన కూడలి గా ఉన్నది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, పూణే, భోపాల్ వంటి నగరాలకు ప్రయాణించవచ్చు. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గల ఒక ప్రధాన రైలు కూడలి.

రోడ్డు మార్గం
హైదరాబాద్ నగరానికి సుమారు 150 కి. మీ .దూరంలో ఉన్న వేములవాడకి ప్రతిరోజు ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. అదే విధంగా 32 కి. మీ. దూరంలో ఉన్న జిల్లా ముఖ్య పట్టణం కరీంనగర్ నుండి కూడా ప్రతిరోజు అరగంటకోసారి ప్రభుత్వ బస్సులు నడుపుతుంటారు ఆర్టీసీ అధికారులు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+