Search
  • Follow NativePlanet
Share
» »జూన్ నెల శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌

జూన్ నెల శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌

తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గుడ్ న్యూస్ చెప్పింది. భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం జూన్ నెల‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా వివ‌రాలను బుధ‌వారం(మార్చి 13)న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఉన్న తేధీల ఆదారంగా భ‌క్తులు త‌మ ప్ర‌యాణాల‌కు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించింది. ఈ త‌ర‌హాలో శ్రీవారి ద‌ర్శ‌న‌, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటాల‌ను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల స్వామివారి ద‌ర్శ‌నంతోపాటు సేవలో భ‌క్తులు త‌రించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగే, టికెట్ల విష‌యంలో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లకూ అవ‌కాశం లేద‌ని భ‌క్తులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

- మార్చి 18వ తేదీ ఉద‌యం 10 నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ ల‌క్కీడిప్ కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

srivaridarshan

- మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

- జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

- మార్చి 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను విడుద‌ల చేస్తారు.

- మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

- మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

- మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు. ఈ త‌ర‌హా ద‌ర్శ‌న టికెట్లు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల వీరికి ఎంతో సౌక‌ర్యంగా ఉంటుంది.

- మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు 300 రూపాయ‌ల‌ ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

srivaridarshan date and timings

- మార్చి 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

- మార్చి 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరుతున్నారు. భ‌క్తులు ఈ అవ‌కాశాల‌ను వినియోగించుకోవాల‌ని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఈ త‌ర‌హాలో శ్రీవారి ద‌ర్శ‌న‌, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటాల‌ను టీటీడీ విడుద‌ల చేయ‌డం వ‌ల్ల స్వామివారి ద‌ర్శ‌నంతోపాటు సేవలో భ‌క్తులు త‌రించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగే, టికెట్ల విష‌యంలో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లకూ అవ‌కాశం లేద‌ని భ‌క్తులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+