Search
  • Follow NativePlanet
Share
» »అల‌ల‌ తీర‌పు నెల‌వంక‌.. సూర్య‌లంక‌! (రెండో భాగం)

అల‌ల‌ తీర‌పు నెల‌వంక‌.. సూర్య‌లంక‌! (రెండో భాగం)

సూర్య‌లంక తీర ప్రాంతంలో మెత్తని ఇసుక తిన్నులపై బీచ్‌ కబాడీ ఆడేందుకు మా మిత్రులంతా సిద్ధమయ్యారు. ఓవైపు పాదాలను తాకుతున్న చల్లని అలల సవ్వడులు, మరోవైపు ఆనందంతో చిందులు వేస్తున్న మిత్రబృందం కేరింతలు భలే ముచ్చటగొలిపాయి. సరదాగా కొన్ని నిముషాలు సముద్రంలో షికారు చేసేందుకు స్పీడ్‌ బోటు ఏర్పాటు చేశారు. దీనికి ఒక్కొక్కరికీ 200 రూపాయలు చెల్లించాలి.

రేటు కాస్త ఎక్కువగా ఉన్నా, ఆ అనుభూతులకు విలువ కట్టలేం అనిపించింది. వారాంతాలలో సందడిగా కనిపించే ఈ తీర ప్రాంతాన్ని ఆనుకొని, స్థానిక మత్స్యకారులు చేపలు అమ్మడం కనిపించింది. ఉప్పుచేపలు తక్కువ ఖరీదుకు దొరకడం ఇక్కడి ప్రత్యేకత.

నోరూరించే చేప‌ల వంట‌కాలు..

నోరూరించే చేప‌ల వంట‌కాలు..

వారాంతాలలో తప్ప మిగిలిన రోజులలో ఇక్కడ ఎలాంటి వ్యాపారం జరగదని వారు చెప్పుకొచ్చారు. అంతేకాదు, స్థానికులు చిన్న చిన్న స్టాల్స్‌ వేసుకుని వివిధరకాల చేపల వంటకాలను తక్కువ రేట్లకే సందర్శకులకు అందిస్తున్నారు. సాయంత్ర సమయం అయ్యేసరికి అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వణుకు పుట్టించేలా చల్లని పిల్లగాలుల అల్లరి మొదలైంది. ఇక ఆలస్యం చేయకుండా మేం తిరుగు ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చేసిందని అర్థమైంది. అప్ప‌టికే బృందాలుగా వ‌చ్చిన తోటి సంద‌ర్శ‌కులు ద‌గ్గ‌ర‌లోని స్టాల్స్ ద‌గ్గ‌ర వేడి వేడి స‌ముద్ర‌పు చేప‌లు తిన‌డం క‌నిపించింది.

చ‌ల్ల‌ని ఆ సాయంత్ర‌పు వేళ‌ వేడి వేడిగా వేయించిన చేప‌లు తింటూ ఉంటే ఆ రుచుల‌ను మాట‌ల్లో చెప్ప‌లేం. వివిధ ర‌కాల స‌ముద్ర‌పు చిప్ప‌లు, ముత్యాలతో చేసిన హారాల అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. ప‌ర్యాట‌కుల‌కు స్థానికులు ఎంతో మ‌ర్యాద‌పూర్వంగా ప‌ల‌కించ‌డం మేం గ‌మ‌నించాం.

విడిది చేయాలంటే..

విడిది చేయాలంటే..

పర్యాటకులు సేదదీరేందుకు ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హరిత బీచ్‌ రిసార్ట్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఫ్యామిలీ రెస్టారెంట్‌ సౌకర్యం కూడా ఉంది. అన్ని రకాల వెజ్‌, నాన్‌వెజ్‌ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. రిసార్ట్స్‌లో కాటేజీలు ఉన్నాయి. ముప్ప‌యి రెండు రూమ్‌ల‌తో ప‌ర్యాట‌క శాఖ ఏర్పాటు చేసిన హ‌రిత రిసార్ట్స్ మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఆకర్షించింది. శని, ఆదివారాల్లో ఏసీ గదులైతే రోజుకు రూ.3,260, మిగిలిన రోజుల్లో రూ.2,248 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. నాన్‌ఏసీ అయితే శని, ఆదివారాలలో రోజుకు రూ.2023, మిగిలిన రోజులలో రూ.1461 ఉంటుంది.

డార్మేటరీకి రోజుకు రూ.2,000 అద్దె చెల్లించాలి. ఆన్‌లైన్‌లో కూడా కాటేజీలు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. వివరాలకు డబ్యుడబ్ల్యు డబ్ల్యు.ఏపీటీడీసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే సరిపోతుంది. పర్యాటకుల సౌకర్యార్థం గ్రామపంచాయితీవారు సులభ కాంప్లెక్స్‌లను నిర్మించారు. తీరంలో ఎలాంటి సంఘటనలూ జరగకుండా మెరైన్‌ పోలీసుస్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందుకే కాబోలు వీకెండ్ వ‌స్తే చాలు సూర్య‌లంక తీరం కోలాహ‌లంగా మారిపోతుంది. శ‌ని, ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుంచి సైతం కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శ‌కులు వ‌స్తుంటార‌ని స్థానికులు

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

నేరుగా సూర్యలంక చేరుకోవటానికి బాపట్ల అనువైనది. ఇక్కడి నుంచి ప్రయివేట్‌ వాహనాలు, ఆర్‌టిసి బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, బాపట్లలో రైల్వేస్టేషన్‌, బస్‌స్టాండ్‌ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, నరసారావుపేటతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. నూతన రాజధాని అమరావతి నుంచి బాపట్ల 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నరసరావుపేట నుంచి 72 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 43 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 71 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు, బీచ్‌కు స‌మీపంలో ప్ర‌యివేట్ రిసార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బాప‌ట్ల‌లోని భావ‌న్నార‌యణ దేవాల‌యం, పొన్నూరులోని ఏక‌శిల శివాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+