Search
  • Follow NativePlanet
Share
» »వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఈ దేవాలయానికి వెళ్ళండి

వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఈ దేవాలయానికి వెళ్ళండి

ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషముంటుంది. వాటి నుంచి ఆ దేవాలయం మరియు దేవతామూర్తి ప్రసిద్ధిపొండుతారు. అదేవిధంగా వివాహం కూడా జీవితంలో అతిముఖ్యమైనది.

By Venkatakarunasri

ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషముంటుంది. వాటి నుంచి ఆ దేవాలయం మరియు దేవతామూర్తి ప్రసిద్ధిపొండుతారు. అదేవిధంగా వివాహం కూడా జీవితంలో అతిముఖ్యమైనది. సరైన వయస్సులో వివాహం కాకపోతే తల్లి,తండ్రి బాధపడటం జరుగుతుంది. త్వరగా వివాహం కావాలని అనేక పూజలు, పునస్కారాలు చేస్తున్నారా. అయినాకూడా కంకణ భాగ్యం కలిసిరావటం లేదా.

వివాహం ఆలస్యాన్ని అనుభవిస్తున్న వారు త్వరగా వివాహం జరగాలంటే ఈ శ్వేతరాయేశ్వర దేవాలయానికి ఒక్క సారి వెళ్లి రండి. ఈ దేవాలయం ఎక్కడుంది? ఈ దేవాలయం విశేషం ఏమిటి? మొదలైన అనేక ప్రశ్నలకు వ్యాసం మూలంగా సమాచారాన్ని తెలుసుకోండి.

శ్వేతరాయేశ్వర దేవాలయం

శ్వేతరాయేశ్వర దేవాలయం

ఈ దేవాలయంలో ముఖ్యంగా మహాశివుడు వెలసియున్నాడు. అంతే కాదు నవగ్రహాలలో ఒకటైన బుధుడు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా వెలసినాడు. ఈ దేవాలయం అత్యంత పెద్దదైనాకూడా, దేశంలోని మూలమూలల నుంచి ఇక్కడకు వస్తూంటారు.

అఘోరా అవతారం

అఘోరా అవతారం

ఈ శ్వేతరాయేశ్వర దేవాలయం ముఖ్యంగా "అఘోరా మూర్తి" అని కొలువబడే శివుని విశిష్టమైన అవతారానికి పేరుప్రఖ్యాత గాంచినది. ఈ గ్రామంలో ముఖ్యమైన దేవుడు కూడా శివుడే. ఇక్కడ అత్యంత అందమైన చెరువును కూడా చూడవచ్చును. ఈ దేవాలయం 3 చెరువులను మరియు 3 దేవతా మూర్తులను కలిగి ప్రసిద్ధిచెందింది.

వివాహం

వివాహం

వివాహం ఆలస్యమయ్యే వారు మరియు రోగాలవల్ల బాధపడేవారు ఇంకా అనేక సమస్యలనుండి బయటపడలేనివారు అనేకమంది ఇక్కడకు వచ్చి సందర్శిస్తారు. అందువలన మీ యొక్క అన్ని కష్టాలుదూరమై త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఇక్కడ ముఖ్యమైన దేవుడు శివుడు

ఇక్కడ ముఖ్యమైన దేవుడు శివుడు

కాశీతో సమానమైన కావేరీనది ఒడ్డునగల 6 దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి. శ్వేతరాయేశ్వర దేవాలయంలో ముఖ్యంగా శివుని ఆరాధిస్తారు. ఇక్కడి శివుడు ఉగ్రస్వరూపంతో వుండటం వలన, నిష్ఠ - భక్తితో పూజించవలెను.

పురాణ కథ ప్రకారం

పురాణ కథ ప్రకారం

పురాణ కథ ప్రకారం పూర్వం ఇక్కడ మారుతువాసురన్ అనే రాక్షసుడు వుండేవాడు. అతను త్రిమూర్తులలో ఒక్కరైన బ్రహ్మగురించి ఘోరతపస్సు చేసెను. దీనిని మెచ్చిన బ్రహ్మదేవుడు రాక్షసుడు ముందు ప్రత్యక్షమై వరాన్ని ఇచ్చెను.

హింస

హింస

వరాన్ని పొందిన రాక్షసుడు ఋషులు మరియు అమాయకప్రజలను హింసించుట ప్రారంభించెను. దీని వలన సాధ్యమైనంత త్వరగా ఆ రాక్షసుని హింసకు ముగింపు పలకవలెనని పరమేశ్వరునికి విన్నవించుకున్నారు. వెంటనే శివుడు తన ఉగ్రరూపంతో ఆ రాక్షసుణ్ణి ఒక చెట్టుదగ్గర తీసుకుని వెళ్లి, అనంతరం తన ఘోరమైన రూపంతో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు.

ఉత్సవాలు

ఉత్సవాలు

ఈ మహిమకల దేవాలయంలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి విశేషం ఏమంటే ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం రథోత్సవంఆచరిస్తారు. ఈ రథోత్సవాన్ని 10రోజుల పాటు ఆచరిస్తారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి ఈ ఉత్సవానికి అనేకమంది భక్తులు పాల్గొంటారు.

దేవతామూర్తి

దేవతామూర్తి

ఇక్కడ ఇంద్రుడు, ఐరావతం, బుధుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైన దేవతావిగ్రహాలను ఇక్కడ పూజించటం జరుగుతుంది.ఈ దేవాలయంలో అంతుచిక్కని శాసనాలు, పూర్వపు చోళరాజైన ఆదిత్యచోళుడు మరియు రాజరాజ చోళుడు ఈ దేవాలయానికి మరింత కృషిచేసారు.

దుర్గా మరియు కాళీ దేవాలయం

దుర్గా మరియు కాళీ దేవాలయం

దుర్గా మరియు కాళికాదేవాలయానికి సంబంధించిన అనేక దేవాలయాలను ఇక్కడ చూడవచ్చును. ఇక్కడి నటరాజ చిత్రం అద్భుతసౌందర్యాన్ని కలిగివుంది. అఘోరరూపంకలిగిన శివునికి ఆదివారం రాత్రి ఇక్కడ విశేషంగా పూజలు జరుపుతారు. విష్ణు మూర్తి ఆలయం కూడా నటరాజ ఆలయానికి సమీపంలో ఉంది.

ఈ దేవాలయం ఎక్కడ వుంది?

ఈ దేవాలయం ఎక్కడ వుంది?

ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో వుంది. తిరువెంకాడు అనే పట్టణంలో సర్కాజియ సమీపంలో ఈ శ్వేతరాయేశ్వర దేవాలయం వుంది.

సమీప విమానాశ్రయం

సమీప విమానాశ్రయం

ఈ దేవాలయానికి సమీప విమానాశ్రయం ఏదంటే అది చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడినుంచి దేవాలయానికి సుమారు 246 కి.మీ దూరంవుంది.

సమీప రైల్వేస్టేషన్

సమీప రైల్వేస్టేషన్

ఈ దేవాలయానికి తమిళనాడులోని కుంభకోణం సమీప రైల్వేస్టేషన్. ఇక్కడినుంచి దేవాలయానికి సుమారు 60కి.మీ ల దూరం వుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+