Search
  • Follow NativePlanet
Share
» »సెల‌బ్రిటీల వివాహాల‌కు ప్ర‌సిద్ధిచెందింది తాజ్‌లేక్ ప్యాలెస్‌..

సెల‌బ్రిటీల వివాహాల‌కు ప్ర‌సిద్ధిచెందింది తాజ్‌లేక్ ప్యాలెస్‌..

ఉద‌య్‌పూర్‌లోని తాజ్‌లేక్ ప్యాలెస్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ప్యాలెస్‌లో బాలీవుడ్ సితారలెంద‌రో వివాహాలు చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా తన కాబోయే భర్త నుపూర్‌ను పెళ్లిచేసుకుంది ఇక్క‌డే. ఈ ప్యాలెస్ పూర్తిగా పిచోలా సరస్సుతో చుట్టబ‌డి ఉంటుంది. ఇక్క‌డ చుట్టూ ఉన్న అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో మాయ‌చేస్తాయి.

ఈ రోజుల్లో, రాజస్థాన్‌లో డెస్టినేష‌న్ పెళ్లిళ్ల ట్రెండ్ న‌డుస్తోంది. అది ప్రియాంక చోప్రా లేదా ఆమె సోదరి పరిణీతి లేదా కియారా-సిద్ధార్థ్ వంటి బాలీవుడ్ స్టార్స్ కావొచ్చు. ప్రతి ఒక్క సెల‌బ్రిటీలు తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌నే ఎక్కువ‌గా ఎంచుకుంటున్నారు. కానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉదయపూర్ నగరం నిలిచింది. ఇక్కడ అనేక హై-ఫై ప్యాలెస్‌లు ఉన్నాయి. ఇవి రాజులు, మహారాజుల ప్యాలెస్‌ల మాదిరిగానే నిర్మించబడ్డాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూతురు ఐరాఖాన్ వివాహం ఈ ప్యాలెస్‌లోనే జ‌ర‌గ‌డం విశేషం. భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటల్‌లలో ఒకటిగా ఉద‌య‌పూర్‌లోని తాజ్‌లేక్ ప్యాలెస్‌కు పేరుంది.

tajlakepalace

తాజ్ లేక్ ప్యాలెస్ ఉదయపూర్ గురించి

తాజ్ లేక్ ప్యాలెస్ ఉదయపూర్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హోటల్. ఈ హోటల్ ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఇది ఇక్క‌డికొచ్చే ప‌ర్యాట‌కుల‌ను ఇట్టే ఆక‌ర్షిస్తుంది. ఈ హోట‌ల్‌లోని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ దాని రాజపుతానా రూపమే, ఇది ఈ ప్రదేశం యొక్క గొప్పతనాన్నిమరింత ప్రతిబింబిస్తుంది. తాజ్ లేక్ ప్యాలెస్ ప్రతి గోడపై అద్భుత‌మైన శిల్పాలు చెక్క‌బ‌డి ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో ఒక అంద‌మైన స‌ర‌స్సు మ‌ధ్య‌లో ఉంటుంది ఇదే దాని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌.

సౌకర్యాలు

ఇందులో 65 గదులు మరియు 18 విలాసవంతమైన సూట్‌లు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. ఈ ప్యాలెస్‌లో ఇద్దరు వ్యక్తుల కోసం ఒక రాత్రి బస ధర సుమారు రూ. 1,43,500. అది కూడా హిస్టారికల్ 1 బెడ్‌రూమ్ సూట్ లేక్ వ్యూ కోసం, గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ అద్దె రూ. 10,50,000 గా ఉంటుంది. అంతే కాదు, ప్యాలెస్‌లో విలాసవంతమైన గదులు ఎంతో ఎత్తులో నిర్మించబడ్డాయి. ఈ హోటల్ 160-166 మంది వ్యక్తులకు ఆతిథ్యం ఇవ్వగలదు. అదే సమయంలో ఇక్క‌డ నిర్వ‌హించే డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కయ్యే అలంకరణలకు రూ.30 నుంచి 35 లక్షలు ఖర్చవుతాయి.

ఇత‌ర ఖర్చులు..

తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఆహారం థాలీ విధానంలో ఉంటుంది. ఇక్కడ కూడా ప్లేట్ ధర సామాన్యుడి బడ్జెట్‌కు మించి ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ప్లేట్ ధర రూ.4 వేలు, ఇందులో అనేక రకాల ఆహార వంటకాలు ఉంచబడ్డాయి. ఉదయ్‌పూర్‌లో ఒక వివాహ ఖర్చు మొత్తం రూ. 1 కోటి ఉంటుంది. ఇందులో భోజనం, వసతి, అలంకరణలు అన్నీ ఉంటాయి. నేటి తాజ్ సరస్సును గతంలో ఉదయపూర్ జల్ మహల్ అని పిలిచేవారు. దీనిని 1746వ సంవత్సరంలో మహారాజా జగత్ సింగ్ II నిర్మించారు. తరువాత ఈ రాజపుతానా ప్యాలెస్‌ని హోటల్‌గా మార్చ‌డం జ‌రిగింది. అప్పటి నుండి నేటి వరకు ఈ ప్యాలెస్ అంటే హోటల్ జగ్ నివాస్ డీప్‌లోని పిచోలా సరస్సు మధ్యలో ఉంది. ఈ ప్యాలెస్ నిర్మాణ శైలి ఎంతో అందంగా ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+