Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడులో ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు !!

తమిళనాడులో ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు !!

దక్షిణ భారత దేశంలో కల ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు కల రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. విశిష్టం అయిన తమిళ సంస్కృతి, సంప్రదాయాలు కల ఈ రాష్ట్రంలో దేవాలయాల నుండి బీచ్ ల వరకూ, ఆధునిక నిర్మాణాల నుండి ప్రకృతి సౌందర్యం కల పచ్చటి అటవీ ప్రాంతాల వరకు అనేక జనాకర్షణ ప్రదేశాలు కలవు. చెన్నై నగరం లోని మెరీనా బీచ్ తీరం సుమారు 13 కి. మీ. ల పొడవు కలిగి దేశంలో మొదటి మరియు ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్ తీరంగా ప్రసిద్ధికెక్కింది.

ఇంతేకాక ప్రకృతి దృశ్యాలు చూపే అనేక పర్వత శ్రేణులు, అనేక హిల్ స్టేషన్ లు, సరస్సులు, నదులు, అటవీ ప్రాంతాలు అనేకం ఆకలవు. ఆధ్యాత్మికులకు చర్చ లు, మసీదులు, ఆశ్రమాలు, దేవాలయాలు రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో చూడవచ్చు. ప్రస్తుత ఈ మా వ్యాసం ఏ ఒక్క ప్రదేశానికీ కాక రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాల గురించిన వివరణ ఇస్తోంది.

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

అన్నా జంతు ప్రదర్శన శాల
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కల ఈ జంతు ప్రదర్శన శాలను పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడతారు. నగర కేంద్రం నుండి సుమారు 30 కి. మీ. ల దూరం లో కల ఈ జంతు ప్రదర్శన శాల 1855 లో స్థాపించబడినది. దీని విస్తీర్ణం సుమారు 1500 ఎకరాలు. 2012 సంవత్సర రికార్డుల మేరకు దీనిలో 2553 ప్నానులు కలవు.
చిత్ర కృప :Jbarta

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

అన్నా జంతు ప్రదర్శన శాల
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కల ఈ జంతు ప్రదర్శన శాలను పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడతారు. నగర కేంద్రం నుండి సుమారు 30 కి. మీ. ల దూరం లో కల ఈ జంతు ప్రదర్శన శాల 1855 లో స్థాపించబడినది. దీని విస్తీర్ణం సుమారు 1500 ఎకరాలు. 2012 సంవత్సర రికార్డుల మేరకు దీనిలో 2553 ప్నానులు కలవు.

చిత్ర కృప :Jbarta

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

మెరీనా బీచ్

ఇది చెన్నై నగరంలోని అతి బిజి గా పర్యాటకులతో నిండి వుండే ఒక బీచ్. దీని పొడవు 13 కి. మీ. లు. మనదేశంలో అతి పొడవైన బీచ్ కాగా, ప్రపంచంలో ఇది రెండవ పొడవైన బీచ్

చిత్ర కృప : Aleksandr Zykov

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

అన్నామలై కొండలు

అన్నామలై కొండలు తమిళనాడు మరియు కేరళ రెండు రాష్ట్రాలలోను వ్యాపించి వున్నాయి. ఇవి పడమటి కనుమలలో ఒక భాగంగా కలవు. ఈ పర్వత శ్రేణులలో విభిన్న రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు.

చిత్ర కృప : Siva301in

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

అన్నామలై కొండలు :

అన్నామలై కొండల సరిహద్దులలో కనపడే మరొక ప్రదేశం వాల్పరై. దీనిని తమిళనాడు చిరపుంజి అంటారు. ఇక్కడ వర్షాలు బాగా పడతాయి. వాల్పరై లోని చిన్నవల్లార్ జలపాతాలు చూడవచ్చు.

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

ఆరోవేల్లె : తమిళనాడు లోని విల్లుపురం జిల్లాలో ఆరోవిలే కలదు. ఇది పాండిచేరి కి సమీప పట్టణం. మాత గా పిలువబడి ప్రసిద్ధ మీర్ రా అల్ఫోన్సా కోరిక మేరకు ఈ పట్టణం రోజర్ అనగర్ అనే వాస్తు శిల్పి 1968 లో నిర్మించాడు. ఈ పట్టణం ముఖ్య ఉద్దేశ్యం ఏ జాతి వారు అయినప్పటికీ సర్వ జనులూ సామరస్యంగా జీవనం గడపాలని సూచిస్తుంది. ఇక్కడి మాత మందిరం ప్రముఖ ఆకర్షణ.

చిత్ర కృప : Santoshnc

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

గాంధి మంటప :

తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినా ప్రదేశం కన్యాకుమారి లో కల గాంధి మంటపము ఒక విశిష్టమైన గాంధి దేవాలయం గా వుంది. ప్రజలకు ఒక ఆకర్షణ. గాంధి గారి అస్థికలు ఇక్కడి నీటిలో కలిపినపుడు వాటిని ఈ మంటపంలో ఉంచారు. ఈ మంటపాన్ని సరిగ్గా గాంధి జన్మదినం అయిన అక్టోబర్ 2 నాడు సూర్య మొదటి సూర్య కిరణం పడేలా నిర్మించారు.

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

హోగేనక్కల్ జలపాతాలు

కన్నడంలో హోగె అంటే పొగ అని అర్ధం. ఈ జలపాతాలు ప్రవాహం వద్ద నీరు తుంపరలు పైకి చిమ్ముతూ పొగ వాలే వ్యాపిస్తుంది. ఈ జలపాతాలు, తమిళనాడు - కర్నాటక సరి హద్దులో కావేరి నది నుండి ప్రవహిస్తాయి.

చిత్ర కృప : Mithun Kundu

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

హోగేనక్కల్ జలపాతాలు : ఇక్కడ విశేషం ఏమంటే, ఈ జలపాతాలలోని చేపలను అమ్ముతారు. అది కూడా వీటిని కాల్చుకుని తినేందుకు రెడీ చేసి మరీ అమ్ముతారు.
చిత్ర కృప: Justinvijesh

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

జవాద్ కొండలు వరుస : తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో కనపడే జవాద్ కొండల శ్రేణి తూర్పు కనుమల లోని ఎత్తైన పర్వత శ్రేణులలో ఒకటి. ఈ ప్రదేశం జీవ వైవిధ్యం కలిగి సుమారు 80 కి. మీ. ల వెడల్పు మరియు 50 కి. మీ. ల పొడవు కలిగిన ఈ పర్వత శ్రేణి తూర్పు మరియు పశ్చిమ భాగాలలో చేయ్యార్ మరియు అగరం నదీ ప్రవాహాలతో విలసిల్లుతోంది.
చిత్ర కృప: Saravananrajm

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

కన్యాకుమారి : తమిళనాడులోని కన్యాకుమారి పట్టణం దక్షిణమున చిట్టా చివరి ప్రదేశం. పురాతన మైన ఈ పట్టణం ఒక ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశం. ఇక్కడ కల ప్రధాన దేవాలయం మాత కన్యాకుమారి. ఈమె శ్రీకృష్ణుని సోదరి గా చెపుతారు.

ఫోటో కృప : 5061RR

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

కోడై కెనాల్ సరస్సు : అందమైన ఈ సరస్సు కోడై కెనాల్ హిల్ స్టేషన్ లో కలదు. ఈ సరస్సులో బోటు విహారం ఆహ్లాదకరం. ఇది ఒక ప్రసిద్ధ ఆకర్షణ గా చెప్పబడుతోంది.

ఫోటో కృప : Challiyan

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

మదురై మీనాక్షి దేవాలయం : ఇది ఒక ప్రసిద్ధ దేవాలయం. మదురై నగరం అతి పురాతన నగరాలలో ఒకటిగా చెపుతారు.

చిత్ర కృప: Rengeshb

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

మహాబలిపురం : మామల్లాపురంగా చెప్పబడే మహాబలిపురం కాంచీపురం జిల్లాలో ఒక అద్భుత పట్టణం. చెన్నై నగరం నుండి ఇది 60 కి. మీ. లు. పల్లవ రాజుల కాలంలో ఇది ఒక వాణిజ్య కేంద్రం గా వుంది అనేక దేవాలయాలు, ఇతర స్మారకాలు సైతం కలిగి వుంది.

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

మంజంపత్తి మైదానాలు :ఇది కోయంబత్తూర్ లో కల ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉద్యానవనం తూర్పు భాగ రక్షిత ప్రదేశం. ఇక్కడ విశేష జీవ వైవిధ్యం కలదు.

చిత్ర కృప: Marcus334

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

మేట్టుపల్యం : ఇది ఒక గ్రామీణ జిల్లా ప్రాంతం. కోయంబత్తూర్ నగరం నుండి 38 కి. మీ. ల దూరం లో కలదు. ఇది నీలగిరి మౌంటెన్ రైల్ జంక్షన్ గా ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : AHEMSLTD

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

పద్మనాభపురం పాలస్ : కన్యాకుమారి జిల్లాలోని పద్మనాభపురం లో కల ఈ పాలస్ కేరళ సంస్కృతి మరియు వాస్తు శిల్పాలకు ప్రతీకగా నిలుస్తుడి. ఇది ఒక పర్యాటక ప్రదేశం

ఫోటో కృప : Infocaster

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

పులికాట్ సరస్సు : పులికాట్ ఒక అందమైన అతి పెద్ద సరస్సు. ఇది ఆంద్ర మరియు తమిళనాడు సరిహద్దులో కలదు. ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ

చిత్ర కృప : Santhosh Janardhanan

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

రామేశ్వరం : తమిళనాడులోని రామనాధ పురం జిల్లాలోకల రామేశ్వరం హిందువుల నాలుగు పవిత్ర దామములలో ఒకటి. భారత దేశ ప్రధాన భూభాగానికి వెలుపల కల పంబన్ ద్వీపం లో రామేశ్వరం కలదు.దీనిని రామేశ్వర ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీరాముడు లంకకు వెళ్ళుట కొరకు ఒక వంతెనను నిర్మించాడని చెపుతారు. ఈ పంబన్ బ్రిడ్జి ఈ ద్వీపాన్ని భారత దేశంతో కలుపుతుంది.

ఫోటో కృప : Pramaanik

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

రామనాధ స్వామీ దేవస్థానం : రామేశ్వరంలో కల రామనాధ స్వామీ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీరాముడు ఇక్కడ తన పాప విముక్తి కొరకు శివుడిని ప్రార్ధించాడు.

చిత్ర కృప: Purshi

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

బృహదీశ్వర ఆలయం :

వాస్తు శిల్ప శైలి రీత్యా చూస్తె ఒక ఉత్తమ దేవాలయం తంజావూరు లోని బృహదీశ్వర దేవాలయం. ఇది తంజావూర్ పట్టణంలో కలదు. ఈ దేవాలయాన్ని క్రీ. శ 1010 లో చోళ రాజు రాజ రాజ చోళు డు నిర్మించాడు. ఇది ఇప్పటికి వేయి సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

చిత్ర కృప : Thamizhpparithi Maari

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే

తిరుమలై నాయకర్ మహల్ :

ఈ పాలస్ ను 17 వ శతాబ్దం లో మదురై నాయకర్ రాజ్యంలో కల తిరుమలై నాయకర్ నిర్మించారు. ఈ పాలస్ దాని అద్భుత శిల్ప శైలి కి ప్రసిద్ధి. ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ

చిత్ర కృప: Thamizhpparithi Maari

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

తిరువల్లువార్ విగ్రహం :

తమిళ సాహిత్య పురాతన కవి తిరువల్లువార్ కు సుమారు133 అడ్డుగుల విగ్రహం కన్యాకుమారి లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. దీనిని జనవరి 1 ,2000 సంవత్సరంలో ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రెండు సముద్రాల సంగమ ప్రదేశంలో స్థాపించారు.

చిత్ర కృప : Docku

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

తీర్పారప్పు జలపాతాలు :

ఈ అందమైన జలపాతాలు కన్యాకుమారి లోని తీర్పారపు అనే ప్రదేశంలో కలవు. కోడయర్ నది పై కల ఈ జలపాతాల నీరు సుమారు 50 అడుగుల ఎత్తునుండి పడుతుంది.

చిత్ర కృప : BishkekRocks

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

తిరువన్నామలై :

తిరువన్నామలై లో అరుణాచలేశ్వర దేవాలయం కలదు. ఇది గిరి ప్రదక్షిణకు ప్రసిద్ధి. పంచ భూత స్థలాలో ఒకటిగా ప్రసిద్ధి చెందినా ఈ ప్రదేశం, అగ్నికి ప్రతీకగా చెపుతారు

చిత్ర కృప : Adam Jones

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

ఊటీ :

తమిళనాడు లో మరొక ప్రసిద్ధ పర్వత నగరం ఊటీ లేదా ఉడక మండలం. నీలగిరి కొండలలో కల ఈ హిల్ స్టేషన్ కొత్త జంటల హనీ మూన్ కు ప్రసిద్ధి.

చిత్ర కృప : Ghost Particle

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

ఊటీ :

22 ఎకరాల విస్తీర్ణంలో కల ఊటీ తోటలు పర్యాటక ప్రసిద్ధి. 20 మిలియన్ సంవత్సరాల నాటి ఒక అతి పెద్ద వృక్షం ఇక్కడ వుండటం ఒక పెద్ద విశేషం.

చిత్ర కృప : Marselectronics

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

ఊటీ సరస్సు :

అందమైన ఈ పర్వత నగరంలో అద్భుత వాతావరణంలో వేడి వేడి కాఫీ తాగుతూ బోటు విహారం చేయటం ఒక మధురా అనుభూతి. ఈ అనుభూతి ఎవరి కి ఇష్టం వుండదు ? తప్పక ప్రయత్నించండి.

చిత్ర కృప : Woodthought

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

కంచి :

మాత కామాక్షి పేరుతో ప్రసిద్ధి చెందినా కంచి తమిళనాడు రాష్ట్రంలో చెన్నై రాజధాని నుండి 72 కి. మీ. ల దూరంలో కలదు. ఈ పుణ్య క్షేత్రం, శైవులకు, వైష్ణవులకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ ఇంకనూ అతి పురాతన దేవాలయాలు అనేకం కలవు.

చిత్ర కృప : Pratheepps

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

వివేకానంద రాక్ దేవాలయం :

వివేకానంద మంద స్మారక దేవాలయం కన్యాకుమారి పట్టణంలోని ఒక గ్రామలో సముద్రంలో ఒక పెద్ద గుట్టపై కలదు. అందమైన ఈ దేవాలయం పర్యాటక ప్రసిద్ధి. ప్రపంచ ఖ్యాతి గాంచిన స్వామీ వివేకానందుడు ఇక్కడ నివసించారు. ఆయన గౌరవార్ధం 1970 సంవత్సరంలో దీనిని నిర్మించారు

చిత్ర కృప : Coolgama

 చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

చెన్నై చేరితే...అన్నీ ఆకర్షనలే!

వివేకానంద రాక్ మెమోరియల్ :

రాత్రివేళ విద్యుత్ దీపాలతో వెలిగి పోతున్న వివేకానంద రాక్ మెమోరియల్

చిత్ర కృప: Nomad Tales

కన్యాకుమారి : మరిన్ని ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

చెన్నై నగర వసతులకు క్లిక్ చేయండి

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+