Search
  • Follow NativePlanet
Share
» »దిగుడు బావుల ముచ్చట్లు- మరచిన ఇక్కట్లు !

దిగుడు బావుల ముచ్చట్లు- మరచిన ఇక్కట్లు !

దిగుడు లేదా మెట్ల బావులు సాధారణంగా కరవు తరచుగా వచ్చే గుజరాత్ మరియు రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో చూస్తాము. ఈ విధంగా ఇండియా లోని కొన్ని భాగాలలో కల పొడి లేదా అతి ఉష్ణ వాతావరణం కారణంగా నీరు ఎండిపోకుండా లోతైన మెట్ల బావులు నిర్మించే వారు. ఈ నీటిని కరువు వచ్చినపుడు వినియోగించేవారు. ఆ కాలాలలో నిర్మించిన అతి పెద్ద కోటలు, దేవాలయాలు, ఇతర స్మారక చిహ్నాల వలెనె, ఈ దిగుడు బావులు లేదా స్టెప్ వెల్స్ కూడా వాటి నిర్మాణ శైలి కి పేరు గాంచాయి. అనేక శతాబ్దాల వెనుక నిర్మించబడిన స్టెప్ వెల్స్ లో చాలా వరకు నేడు శిధిలాలలో వున్నాయి. అయినప్పటికీ, ఇప్పటికి కొన్ని బావులు నేటికీ చూడదగినవే.

చాంద్ బవోరి

చాంద్ బవోరి

చాంద్ బవోరి అనబడే ఈ స్టెప్ వెల్ రాజస్తాన్ లోని అభనేరి గ్రామంలో కలదు. అందమైన దిగుడుబావులలో ఇది ఒకటి. వంద అడుగుల లోతు కల ఈ దిగుడు బావి 13 అంతస్తులు కలిగి 3500 సన్నని మెట్లు కలిగి వుంది.
Photo Courtesy: Chetan

అడలాజ్ స్టెప్ వెల్

అడలాజ్ స్టెప్ వెల్

అడలాజ్ స్టెప్ వెల్ గుజరాత్ లోని గాంధి నగర్ లో కలదు. ఈ స్టెప్ వెల్ నిర్మాణంలో చూపిన అందమైన చెక్కడాలు, నగిషీలు ఈ బావిని దేశంలోని ఉత్తమ స్టెప్ వెల్స్ లో ఒకటిగా చేశాయి. ఈ బావి గోడలకు దేవతా మూర్తుల బొమ్మలు, ఇతిహాసాల కధలు, సుందర ప్రకృతి దృశ్యాలు కూడా చెక్కారు.
Photo Courtesy: Raveesh Vyas

రాజన్ కి బావోలి

రాజన్ కి బావోలి

రాజన్ కి బావోలి ని రాజావో కి బావోలి అని కూడా అంటారు. ఈ మెట్ల బావి సౌత్ ఢిల్లీ లోని మహారౌళి అర్కియోలాజికల్ పార్క్ లో కలదు. మూడు అంతస్తులు కల ఈ స్టెప్ వెల్ ను 1516 లో నిర్మించారు.

Photo Courtesy: Varun Shiv Kapur

రాణి కి వావ్

రాణి కి వావ్

ఈ దిగుడు బావి యొక్క చారిత్రక కద వేరు గా వుంటుంది. ఈ బావిని ఒక రాణి తన ప్రియాతి ప్రియమైన భర్త కొరకు నిర్మించింది. ఈ దిగుడు బావి గోడలు శ్రీ మహా విష్ణువు, అవతారాలతో చాలా అందంగా వుంటుంది.
Photo Courtesy: Rashmi.parab

అగ్రసేన్ కి బవోలి

అగ్రసేన్ కి బవోలి


అగ్రసేన్ కి బవోలి ఢిల్లీ లో కలదు. కాని దీనిని గురించి చాలా మందికి తెలియదు. ఈ దిగుడు బావి కి 103 మెట్లు కలవు. మూడు స్థాయిలలో వీటిని నిర్మించారు. ఈ దిగుడు బావి కొన్నాట్ ప్లేస్ కు సమీపంలో కల హాయ్ లీ రోడ్ లో కలదు. ఢిల్లీ సందర్శనలో అందమైన ఈ బావి తప్పక చూడదగినది.
Photo Courtesy: Supreet Sethi

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+