Search
  • Follow NativePlanet
Share
» »నవంబ‌ర్ నెల‌లో తిరుమ‌ల దేవ‌స్థానంలో జ‌రిగే విశేష కార్య‌క్ర‌మాలివే..!

నవంబ‌ర్ నెల‌లో తిరుమ‌ల దేవ‌స్థానంలో జ‌రిగే విశేష కార్య‌క్ర‌మాలివే..!

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమ‌ల దేవ‌స్థానం. ఈ ఆల‌యంలోని స్వామివారి ద‌ర్శ‌నం కోసం నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివెళ్తుంటారు. సాధార‌ణ రోజుల్లోనే ఇక్క‌డ భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉంటుంది. ఇక‌, పండుగ‌లు, ఉత్స‌వాల స‌మ‌యంలో ఇక్క‌డ ర‌ద్దీగురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ఎంతో ప్రాధాన్యత సంత‌రించుకున్న తిరుమల ఆల‌యంలో నవంబర్ మాసంలో ఎన్నో విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఈ విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ప‌దండి.

న‌వంబ‌ర్‌లో వ‌చ్చే పండుగ‌లివే..

నవంబర్ 04, 2024 శ్రీ తిరుమల నంబి ఉత్సవం ఉంటుంది. నవంబర్ 5వ తేదీన నాగుల చవితి సందర్భంగా తిరుమ‌ల స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులను ఆశీర్వ‌దించ‌నున్నారు. ఆ రోజున‌ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనం పై మాడవీధులలో విహరిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల అనంత‌రం స్వామివారు పెద్దశేష వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చేది ఒక్క నాగుల చవితి నాడే.

నవంబర్ 06, 2024 శ్రీ మనవాళ మహాముని ఉత్సవం ఉంటుంది. ఆ తరువాత నవంబ‌ర్ 8వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ చేస్తారు. న‌వంబ‌ర్‌ 9వ తేదీన వార్షిక పుష్పయాగం ఉంటుంది. ఆ రోజున స్వామివారికి 10 టన్నుల పుష్పాలతో 7 సార్లు పుష్పార్చన చేస్తారు. న‌వంబ‌ర్‌10వ తేదిన పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉంటుంది. నవంబర్ 11, 2024 దీపావళి ఆస్థానం, శ్రీ యాజ్ఞవల్క్య జయంతి సంద‌ర్భంగా విశేష పూజ‌లు ఉంటాయి. అలాగే, నవంబర్ 12, 2024 కేదార గౌరీ వ్రతం ఉంటుంది.

specialprogramheldintirumaladevasthanam

కార్తీక పౌర్ణమి వేళ గరుడ సేవ‌..

నవంబర్ 13న కైసిక ద్వాదశి నాడు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆస్థాన కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో వేకువజామున ఉగ్రశ్రీనివాసమూర్తి భక్తులు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక‌, నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి పౌర్ణమి గరుడ వాహన సేవ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు మలయప్పస్వామి గరుడు వాహనం పై మాడవీధులలో ఉరేగుతారు.

నవంబర్ 16, 2024 శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర ఉంటుంది. నవంబర్18, 2024న‌ వెంకన్న స్వామికి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం వంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. అలాగే, న‌వంబ‌ర్ 23,2024 న చక్రతీర్థ ముక్కోటి, శ్రీ ఆత్రి మహర్షి జయంతి సంద‌ర్భంగా విశేష పూజ‌లు ఉంటాయి. నవంబర్ 25, 2024 న శ్రీ ఆల్వార్ తీర్థ ముక్కోటి, కార్తీక పౌర్ణమి సంద‌ర్భంగా పూజ‌లు నిర్వ‌హింస్తారు. నవంబర్ 26, 2024 శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం ఉంటుంది.

డైరీలు, క్యాలెండ‌ర్లు..

ఇదిలా ఉండ‌గా, 2025 నూతన సంవత్సరానికి సంబంధించి గాను తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త డైరీలు, కొత్త క్యాలెండర్లను విడుదల చేయనుంది. భ‌క్తులు టిటిడి పుస్తక విక్రయ కేంద్రాల్లో కొత్త డైరీలు, క్యాలెండర్లను కొనుగోలు చేసే అవ‌కాశాన్ని క‌ల్పించారు. అలాగే టిటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాల‌నుకునేవారు టీటీడీ దేవ‌స్థానం వారి అధికారిక వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.in సంప్ర‌దించాల్సి ఉంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+