గుడి స్తంభాల మీద ఓ రహస్య జంతువు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎన్ని విశేషాలను చెప్పుకొన్నా తనివితీరదు. అన్వేషించే కొద్దీ ఎదురుపడే వింతలకు ఇక్కడ లోటు లేదు. అలాంటి ఓ చిత్రమే 'యాళి'.
ప్రాచీన దేవాలయాలలో వందల సంవత్సరాలనాటి ప్రాచీన దేవాలయాలలో అడుగుపెట్టినప్పుడు అక్కడి స్తంభాలను ఎప్పుడైనా గమనించారా? అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడే ఆ స్తంభాల మీద తప్పకుండా సింహాన్ని పోలిన జంతువులు కనిపిస్తాయి.
గుడి స్తంభాల మీద వుండే రహస్య జంతువు !
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. యాళి
మధురై, తిరుపతి, హంపి... ఇలా దక్షిణాదిన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ ఈ జీవి దర్శనమిస్తుంది. ఈ ఆకృతి పేరే యాళి.
pc: youtube

2. అస్పష్టం యాళి
మూలాలు అస్పష్టం యాళి అన్న జీవికి ఒక ప్రత్యేకమైన కథ అంటూ ఏమీ లేదు.
pc: youtube

3. జీవుల ప్రస్తావన
కాకపోతే పురాణాలలో అక్కడక్కడా ఇలాంటి జీవుల ప్రస్తావన కనిపిస్తుంది.
pc: youtube

4. మత్స్య పురాణం
ఉదాహరణకు మత్స్య పురాణంలో శివగణాలను వర్ణిస్తూ చిత్రవిచిత్రమైన జీవులను పేర్కొటారు.
pc: youtube

5. ప్రాచీన శిల్పులు
సహజంగానే పురాణాలలో అక్కడక్కడా ప్రస్తావనకు వచ్చే ఈ జీవులకు ఒక రూపునివ్వాలని ప్రాచీన శిల్పులు ఉత్సాహపడటంలో ఆశ్చర్యం ఏముంది!
pc: youtube

6. శిల్పాలు
దీని వలన అటు సంస్కృతిని ప్రతిబింబినట్లూ అవుతుంది, దేవాలయంలోని స్తంభాలను సైతం శిల్పాలుగా మార్చినట్లుంటుంది.
pc: youtube

7. యాళి
రకరకాలు దేవాలయాలను మోస్తున్నట్లుగా, దేవునికి కాపలాగా ఉన్నట్లుగా కనిపించే ఈ యాళి ఒకే తీరున ఉండవు.
pc: youtube

8. సింహపు శరీరం
చాలా సందర్భాలలో వీటికి సింహపు శరీరం ఉన్నప్పటికీ తల మాత్రం వేరే జంతువుది ఉంటుంది.
pc: youtube

9. భువండదేవుడు
భువండదేవుడు అనే శాస్త్రకారుడు తన 'అపరాజితపృచ్ఛ' అనే గ్రంథంలో 16 రకాల యాళిలను పేర్కొన్నాడు.
pc: youtube

10. యాళిలు
వీటిలో సింహము (సింహ యాళి), ఏనుగు (గజ యాళి), గుర్రం (అశ్వ యాళి) తల ఉన్న యాళిలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
pc: youtube

11. యాళిలు
పిల్లి, ఎలుక, నెమలి, కోతి, మనిషి తలలు ఉన్న యాళిలు అరుదుగా ఉంటాయి.
pc: youtube

12. యాళి శిల్పాలు
కొన్ని సందర్భాలలో రెక్కలు జోడించిన యాళి శిల్పాలు కూడా దర్శనమిస్తాయి.
pc: youtube

13.జానపదుల నమ్మకం
జానపదుల నమ్మకం ఇంతకీ యాళి అనే జంతువు కేవలం మన ఊహేనా లేకపోతే ఇలాంటి జంతువులు ఒకప్పుడు ఉండేవా అన్న అనుమానం కలుగక మానదు.
pc: youtube

14. జానపదుల సాహిత్యం
ఎందుకంటే జానపదుల సాహిత్యంలో కూడా యాళి గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి.
pc: youtube

15. జానపదులు
యాళి అన్నింటికంటే బలమైన జంతువనీ... ఇది ఏనుగు, సింహాలను సైతం సంహరించగలదనీ జానపదులు నమ్మేవారు.
pc: youtube

16. యాళి
ప్రాచీన తమిళ సాహిత్యంలో కూడా యాళి అనే అతిపరాక్రమ జీవి అడవులలో తిరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు.
pc: youtube

17. యాళివంటి జీవులు
జీవ పరిణామక్రమంలో యాళివంటి జీవులు ఉండేవా లేవా అన్నది చెప్పడం కష్టం.

18. యాళి
కానీ మన ప్రాచీన శిల్ప సంస్కృతిలో భాగంగా మాత్రం యాళి నిలిచిపోయింది.
pc: youtube

19. యాళి వాహనం
కేవలం స్తంభాల మీద శిల్పంగానే కాకుండా 'యాళి వాహనం' పేరుతో యాళి ఆకృతిలో ఉండే వాహనం మీద దేవుడిని ఊరేగించే సంప్రదాయాన్ని కూడా గమనించవచ్చు.
pc: youtube
- వచ్చే పదేళ్లలో కాకినాడ, భీమవరం, పాలకొల్లు సముద్రంలో మునిగిపోతాయా ?
- గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
- గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !



Click it and Unblock the Notifications











