Search
  • Follow NativePlanet
Share
» » నవంబర్‌లో దేశంలోని ఈ ప్రదేశాల వాతావరణం ఎంతో ఆహ్లాదభ‌రితం..

నవంబర్‌లో దేశంలోని ఈ ప్రదేశాల వాతావరణం ఎంతో ఆహ్లాదభ‌రితం..

నవంబర్‌లో దేశంలోని ఈ ప్రదేశాల వాతావరణం ఎంతో ఆహ్లాదభ‌రితం..

నవంబర్‌లో కూడా చాలా పండుగ‌లు ఉన్నాయి. దీపావళి తర్వాత, ఛత్, గురునానక్ జయంతి ప్రత్యేక పండుగలు. నవంబర్‌లో దీపావళి పండుగ సందర్భంగా కొందరు ఉత్సాహంగా ఉంటే, మరికొందరు ఈ సెలవుల్లో కొత్త ప్రదేశాలను సందర్శించాలని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంటారు. వాస్తవానికి, భారతదేశంలోని అనేక ప్రదేశాలను సందర్శించడానికి నవంబర్ నెల ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. దేశంలో నవంబర్‌లో సందర్శించడానికి చాలా చల్లని ప్రదేశాలు ఉన్నాయి. వాటితో పాటు ఎంతో ఆహ్ల‌ద‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం కూడిన ప్ర‌దేశాలు కూడా ఇక్క‌డ చాలానే ఉన్నాయి. కావున పర్యటనను పూర్తిగా ఆస్వాదించడానికి ఇది ఉత్త‌మ‌మైన స‌మ‌యం.. మ‌రెందుకాల‌స్యం ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

ooty

ఊటీ, తమిళనాడు..

తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఊటీ చాలా అందమైన హిల్ స్టేషన్‌గా ప్ర‌సిద్ధి చెందింది. ఈ ప్ర‌దేశం నవంబర్‌లో సందర్శించడానికి ఎంతో ఉత్తమమైనది. ఇది కొండలతో చుట్టుముట్టబడినందున, దీనిని "కొండల రాణి" అని కూడా అంటారు. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం హనీమూన్ డెస్టినేషన్‌గా కూడా పేరుగాంచింది. ఈ ప్రాంతానికి కుటుంబ స‌భ్యుల‌తో పాటు స్నేహితులతో కూడా క‌లిసి వెళ్లొచ్చు.

rannofkutch

రాన్‌ ఆఫ్ కచ్, గుజరాత్

నవంబర్‌లో సందర్శించేందుకు భారతదేశంలోని ఉత్తమ ప్రదేశాలలో గుజరాత్‌లోని రాన్ ఆఫ్ క‌చ్ కూడా ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారిగా ప్ర‌సిద్ధిచెందింది. రాన్ ఆఫ్ కచ్ భారతదేశంలోని హాటెస్ట్ ప్రదేశాలలో ఒకటి అని చెప్పుకోవ‌చ్చు. అయితే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్క‌డి వాతావరణం ఎంతో ఆహ్ల‌ద‌భ‌రితంగా ఉంటుంది. ప‌ర్యాట‌కులు ఇక్క‌డి పరిసర ప్రాంతాలను ఆనందిస్తూ మ‌రో ప్ర‌పంచంలోకి వెళ్లొచ్చు. రాన్‌ ఆఫ్ కచ్ పండుగ కూడా నవంబర్ నుండి ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనడం వ‌ల్ల ప‌ర్యాట‌కులు అనేక రకాల సాంస్కృతిక, సాహస కార్యక్రమాలను ఆస్వాదించే అవ‌కాశం ల‌భిస్తుంది.

udaipur

ఉదయపూర్, రాజస్థాన్

రాజస్థాన్‌లోని ప్ర‌సిద్ధ‌మైన గమ్యస్థానాలలో ఒకటి ఉదయపూర్. దీనిని "వెనిస్ ఆఫ్ ది ఈస్ట్" మరియు "సిటీ ఆఫ్ లేక్స్" అని కూడా అంటారు. ఉదయపూర్ అన్ని వైపులా ఆరావళి కొండలతో చుట్టుముట్టబడిన ఓ అంద‌మైన, అద్భుతమైన ప్రదేశం. నవంబర్ మాసంలో ఇక్కడి వాతావరణం సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరంలో మిగిలిన నెలల్లో ఈ ప్రదేశం కాస్తా వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శస్తే మాత్రం ఇక్క‌డి స‌ర‌స్సుల‌ను, ప్యాలెస్‌ల‌ను వీక్షించ‌డం మ‌ర‌వ్వ‌కండి.. వాటితో పాటు ఇక్క‌డి ఆహార‌ప‌దార్థాల రుచి ఎంతో అమోఘం. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఇక్క‌డి వంట‌కాల‌ను ఓ ప‌ట్టు ప‌ట్టాల్సిందే...

కాలిపాంగ్, పశ్చిమ బెంగాల్

కాలిపాంగ్ పశ్చిమ బెంగాల్‌లోని ఓ హిల్ స్టేషన్ ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. ప‌ర్యాట‌కులు ఇక్క‌డ‌ శీతాకాలంలో సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశం అద్భుతమైన లోయలు, బౌద్ధ విహారాలకు పేరుగాంచింది. కాలిపాంగ్ డార్జిలింగ్‌కు తూర్పున ఉంది. దీనికి చేరుకోవాలంటే కేవలం 50 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఈ ప్ర‌దేశం స్వర్గధామమ‌నే చెప్పాలి. సాహ‌స ప్రియుల‌కు కూడా ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. ప్ర‌శాంత‌మైన, ఆహ్ల‌ద‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణంలో విశ్రాంతి తీసుకోవాల‌నుకునేవారి కోసం ఈ దేశంలోని ఈ ప్రాంతాలు ఎంతో ఉత్త‌మం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+