Search
  • Follow NativePlanet
Share
» »ఇండోర్ సమీపంలో చూడాల్సిన‌ ప్రదేశాలు చాలానే ఉన్నాయ్‌.. 

ఇండోర్ సమీపంలో చూడాల్సిన‌ ప్రదేశాలు చాలానే ఉన్నాయ్‌.. 

ఇండోర్ సమీపంలో చూడాల్సిన‌ ప్రదేశాలు చాలానే ఉన్నాయ్‌..

ఇండోర్ ప్రాంతాన్ని మధ్యప్రదేశ్ గుండెకాయ అని పిలుస్తారు. ఈ నగరం మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధానిగా కూడా పేరుగాంచింది. ఇక్క‌డి కొన్ని ప్ర‌దేశాల అందాలు ఎంతలా ప్రాచుర్యం పొందాయంటే, ప్రతిరోజూ వేలాది మంది దేశ‌విదేశీ పర్యాటకులు సందర్చించేందుకు వ‌స్తూ ఉంటారు. అందుకే, ఈ నగరంలోని ప్రాచుర్యం పొందిన కొన్ని ఉత్త‌మ‌మైన‌ ప్రదేశాల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

పాతాళపానీ జలపాతం

పాతాళపానీ జలపాతం

ఇండోర్‌కు ద‌గ్గ‌ర‌లోని ప్ర‌కృతిసిద్ధ‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశం ఏది అంటే ముందుగా గుర్తొచ్చేది పాతాళ‌పానీ జ‌ల‌పాతం. ఈ జలపాతం 250 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుండి కింద‌కు జాలువారుతుంది. ఇక్క‌డి నీటి స‌వ్వ‌డుల శ‌బ్దాల‌ను చెవులారా వినేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతారు. అబ్బుర‌ప‌ర‌చే జ‌ల‌పాత‌పు దృశ్యాన్ని చూడటం ద్వారా మనస్సు సంతృప్తి చెందుతుందనే చెప్పాలి. ఈ ప్రదేశం చుట్టూ పచ్చదనాన్ని చూసి, ప్రతి ఒక్కరూ కొన్ని క్ష‌ణాల‌పాటు పాటు ఆశ్చర్యపోతారంటే న‌మ్మండి. అందుకే ఇక్క‌డికి ఇండోర్ వాసులు మాత్రమే కాదు, వేలాదిమంది సుదూర ప్రాంతాల‌ నుండి ప‌ర్యాట‌కులు వ‌స్తూ ఉంటారు. ఇండోర్ నుండి పాతాళపానీకి సుమారు 40 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

ఓంకారేశ్వర్

ఓంకారేశ్వర్

నర్మదా మరియు కావేరి నదుల సంగమం వద్ద ఉన్న ఓంకారేశ్వర్ భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా కూడా పేరుగాంచింది. వేలాది మంది దేశీయ మరియు విదేశీ పర్యాటకులు సందర్శించడానికి ప్రతిరోజూ ఈ అద్భుతమైన ప్రదేశానికి వస్తారు. ఇక్కడ మీరు కాజల్ రాణి గుహ, అహల్యా ఘాట్, పెషావర్ ఘాట్, ఓంకారేశ్వర్ ఆనకట్ట మరియు సిద్ధనాథ్ ఆలయం వంటి అనేక ఇతర అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇండోర్ నుండి ఓంకారేశ్వర్ కు సుమారు 80 కిలోమీట‌ర్ల‌ దూరం ఉంటుంది.

రాలమండల్ వన్యప్రాణుల అభయారణ్యం

రాలమండల్ వన్యప్రాణుల అభయారణ్యం

సముద్ర మట్టానికి 782 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న రాలామండల్ వన్యప్రాణి అభయారణ్యం ఇండోర్ ద‌గ్గ‌ర‌లోని సందర్శించడానికి అనువైన ప్రదేశం. అద్భుతమైన ప్రకృతి అందాల‌తో నిండిన ఈ ప్రదేశం ఏ సీజ‌న్‌లోనైనా సందర్శించడానికి వీలుగా ఉంటుంది. ఈ అభయారణ్యంలో మీరు అంత‌రించిపోతోన్న అనేక జాతుల జంతువుల‌ను క‌నులారా వీక్షించ‌వ‌చ్చు. అంతేకాదు, ఈ అభయారణ్యం పక్షులకు నిలయం అని కూడా పిలుస్తారు. అరణ్యం లోపల ప‌ర్యాట‌కులు తిరగడానికి ఒక ఉద్యానవనం కూడా నిర్మించబడింది. కుటుంబ‌స‌మేతంగా జంగిల్ సఫారీని కూడా ఇక్క‌డ ఆస్వాదించవచ్చు. ఇండోర్ నుండి ఈ ప్రాంతం కేవ‌లం 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

టించ జలపాతం

టించ జలపాతం

ఇండోర్ ద‌గ్గ‌ర‌లో టించ జలపాతం పేరుతో మరొక అందమైన, ప్రసిద్ధ జలపాతం ఉంది. ఈ ప్రదేశం స‌హ‌జ‌సిద్ధ‌ ప్రకృతి అందాల‌కు నిల‌యంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని మధ్యప్రదేశ్ యొక్క స్వర్గంగా భావిస్తారు. ఇక్క‌డి పక్షుల కిలకిలారావాల శబ్దంతో సంద‌ర్శ‌కుల‌ను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ జలపాతంలో సుమారు ౩౦౦ అడుగుల ఎత్తు నుండి నీరు పడుతుంది. ఇండోర్ నుండి టించా జలపాతం సుమారు 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

ఈ ప్రదేశాలను కూడా సంద‌ర్శించొచ్చు..

ఈ ప్రదేశాలను కూడా సంద‌ర్శించొచ్చు..

ఈ నాలుగు ప్రదేశాలతో పాటు, ఇక్క‌డ సందర్శించడానికి అనేక ఇతర అందమైన, అద్భుతమైన ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. జహజ్ మహల్ ఇక్క‌డికి సుమారు 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. గులావత్ లోటస్ సరస్సు సుమారు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇవే కాకుండా, సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, దేవాస్ టెక్రీ, కోరల్ రివర్ డ్యామ్ మరియు కాజ్లిఘర్ వంటి అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి.

More News

    Read more about: indore
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+