Search
  • Follow NativePlanet
Share
» »సిర్హింద్ ప‌ర్య‌ట‌న‌తో చూడాల్సిన‌వి చాలానే ఉన్నాయ్‌!

సిర్హింద్ ప‌ర్య‌ట‌న‌తో చూడాల్సిన‌వి చాలానే ఉన్నాయ్‌!

సిర్హింద్ ప‌ర్య‌ట‌న‌తో చూడాల్సిన‌వి చాలానే ఉన్నాయ్‌!

సిర్హింద్ పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్‌ జిల్లాలోని ఓ నగరం. ఇది గొప్ప చరిత్రకు మరియు సిక్కు సమాజానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. దీనిని గురుమారి అని కూడా పిలుస్తారు. ఈ నగరం నేటికీ ఎత్త‌యిన చారిత్రాత్మక నిర్మాణాలతో ఠీవిగా సంద‌ర్శ‌కుల‌ను ఆహ్వానిస్తోంది.

లూథియానా మరియు అంబాలా మధ్య మధ్యలో ఉన్న సిర్హింద్ ప్రపంచంలోని సిక్కులకు అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటి. ఇది గొప్ప చరిత్రతోపాటు వైవిధ్యభ‌రిత‌మై సాంస్కృతిక సంప్రదాయాన్ని కూడా కలిగి ఉంది. మొఘల్ ఆక్రమణదారులు దీనిని హిందుస్థాన్‌కు ప్రవేశ ద్వారంగా భావించినందున, సిర్హింద్ అనే పేరు 'సర్-ఐ హింద్' నుండి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. ఈ ప్రాంతం యొక్క పాలకులు ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు.

నగరంలోని అనేక కోటలు, బురుజులు ఈ నగరం యొక్క సైనికుల‌ వ్యూహాత్మక ప్రాముఖ్యతకు స‌జీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. అందుకే సిర్హింద్ ప‌రిస‌ర ప్రాంతాలు పంజాబ్‌లోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల జాబితాలో నిలిచాయి. ఇక్క‌డి కోటలు, మ్యూజియంలు, గురుద్వారాలు మరియు ఉద్యానవనాలు ప్రతి ఒక్కటి మనోహరమైన చరిత్రను ప‌రిచ‌యం చేస్తాయి.

ఫ్లోటింగ్ రెస్టారెంట్, సిర్హింద్

ఫ్లోటింగ్ రెస్టారెంట్, సిర్హింద్

భారతదేశపు మొట్టమొదటి తేలియాడే రెస్టారెంట్‌గా ప్రసిద్ధి చెందింది సిర్హింద్‌లోని ఫ్లోటింగ్ రెస్టారెంట్‌. డెబ్బైల ప్రారంభంలో ప‌రియ‌మైన ఈ రెస్టారెంట్ నేటికీ త‌న సేవ‌ల‌ను నిర్విరామంగా అందిస్తునే ఉంది. అందుకే, సిర్హింద్‌లోని ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. సిర్హింద్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ పరిగణించబడుతోంది.

గతంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ పంజాబ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప‌రిధిలో ఉండేది. అయితే, తర్వాత దీనిని పంజాబ్ హెరిటేజ్ టూరిజం ప్రమోషన్ బోర్డుకు అప్పగించారు. ఈ రెస్టారెంట్ గోవింద్‌గఢ్ మరియు సిర్హింద్ మధ్య నడిచే భాక్రా మెయిన్‌లైన్ కెనాల్ నీటిపై నిర్మించబడింది. ఇది ఒక అద్భుతమైన రహదారి. నిత్యం పర్యాటకులు మరియు ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి తరచుగా ఇక్క‌డికి వ‌స్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్‌లోని ఆహార నాణ్యత మరియు రుచిని పర్యాటకులు తరచుగా ప్రశంసించారు. ధరలు కూడా చాలా సహేతుకమైనవి. విశాలమైన, సౌకర్యవంతమైన గదులలో రాత్రిపూట బస చేయడానికి కూడా నిబంధనలు ఉన్నాయి.

ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఆర్కిటెక్చర్

ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఆర్కిటెక్చర్

ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిర్మించిన కాలువ ఆరు మీటర్ల లోతు మరియు 45 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. రెస్టారెంట్ తేలికైన ఉక్కు నిర్మాణంతో కప్పబడిన పైకప్పుతో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ నిర్మాణం చెక్క డెక్‌పై ఉంటుంది. మొత్తంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఐదు సిలిండర్‌లపై తేలుతుంది. డెక్ ఇండోర్ సీటింగ్ ప్రాంతం అందంగా అలంక‌రించ‌బ‌డి ఉంటుంది.

అలాగే, కాలువ రెండు ఒడ్డులకు అనుసంధానించబడిన వంతెన ప్ర‌శాంత‌త‌ను చేరువ చేసే అనుభూతిని చేరువ‌చేస్తుంది. రెస్టారెంట్ లోపల ఉన్న చెక్క డెక్‌లో కొంత భాగాన్ని పారదర్శక గాజు పలకలతో అందంగా తీర్చిదిద్దారు. సందర్శకులు వాటి క్రింద ఉన్న నీలిరంగు నీటిని వీక్షించగలుగుతారు. ఈ ఆహ్లాదకరమైన నిర్మాణం యొక్క డిజైన్ పంజాబ్‌లోని ఆర్కిటెక్చర్ విభాగానికి చెందిన అమర్ రాజిందర్ సింగ్, జీత్ మల్హోత్రాలు రూపొందించారు.

ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కి ఎలా చేరుకోవాలి

ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కి ఎలా చేరుకోవాలి

ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఢిల్లీ అమృత్‌సర్ హైవే వద్ద, సిర్హింద్ సమీపంలో ఉంది. ఇది నగర కేంద్రం నుండి 7-8 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంటుంది. ఢిల్లీ - అమృత్‌సర్ మరియు ఢిల్లీ - లాహోర్ మార్గంలో ప్రయాణించే బస్సులు, టాక్సీలు, ఇత‌ర వాహ‌నదారులు ఇక్క‌డి రుచుల‌ను ఆస్వాదిస్తారు. అలాగే, సిర్హింద్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన‌వారు త‌ప్ప‌నిస‌రిగా ఫ్లోటింగ్ రెస్టారెంట్‌లో అడుగుపెడ‌తారు.

More News

    Read more about: sirhind punjab
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+