ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లక్షద్వీప్. ఇది ఒక అందమైన ద్వీపం. ఈ ప్రదేశాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. అప్పటినుంచి ఈ ప్రదేశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సందర్శించేందకు ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. అడ్వంచర్ ట్రిప్ కోసం ట్రై చేస్తున్న వారు తప్పకుండా ఇక్కడకు రావొచ్చు. ఇక్కడ అనేక సాహసోపేత కార్యకలాపాలు కూడా ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత అందమైన కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ ఒకటి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి పర్యటనలో స్నార్కెలింగ్‌ను ఆస్వాదిస్తూ ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఫోటోలు దిగారు. లక్షద్వీప్‌లోని అడ్వంచర్ ట్రిప్ కోసం వీటిని తప్పకుండా ట్రై చేయాల్సిందే.
ఈ ద్వీపానికి సహజసిద్ధమైన అందాలతో పాటు సాహసం కూడా తోడైతే ఈ ప్రయాణం మరింత ఆసక్తిగా మారుతుంది. ప్రధాని మోడీ ఇక్కడి అందమైన బీచ్‌లను సందర్శించినప్పడు తన సోషల్ మీడియాలో సాహస ప్రియులకు ఒక సలహా కూడా ఇచ్చారు. అందులో సాహసాన్ని ఇష్టపడే వారికి, లక్షద్వీప్ ఖచ్చితంగా వారి జాబితాలో ఉండాలి అని అందులో పేర్కొన్నారు. ఆ సాహసోపేతమైన కార్యకలాపాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

స్నార్కెలింగ్ ఆనందించండి...
సముద్రం అందాలను చూడాలనే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా లక్ష్యద్వీప్‌ను సందర్శించాల్సిందే. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా విహరిస్తూ సముద్రపు అందాలను వీక్షించిచ్చు. ఇక్కడి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ స్నార్కెలింగ్ వంటి సాహస కార్యకలాపాలను ఆస్వాదించేందుకు సిద్ధంకండి.
స్కూబా డైవింగ్
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి లక్షద్వీప్‌ను సందర్శించొచ్చు. స్నేహితులతో కలసి సరదాగా ఇక్కడ స్కూబా డైవింగ్ చేయొచ్చు. భారతదేశంలో ఎక్కువగా స్కూబా డైవింగ్ అండమాన్, గోవా, కేరళ, పాండిచ్చేరి మరియు లక్షద్వీప్‌లు ప్రాంతాల్లో చేస్తారు. స్కూబా డైవర్లు ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం కలయికను ఉపయోగిస్తారు. ఎంత లోతుగా వెళ్తే, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడికి మీరు ఈ వాయువుల సరైన మిశ్రమాన్ని ఉపయోగించాలి, తద్వారా మీ ఊపిరితిత్తులు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు.

కయాకింగ్..
లక్షద్వీప్‌లో కయాకింగ్ కూడా ట్రై చేయొచ్చు. కయాకింగ్ అనేది నీటిపైకి వెళ్లడానికి కయాక్‌ను ఉపయోగించడం .ఇది తెడ్డుపై కూర్చునే స్థానం. తెడ్డుపై ఉన్న బ్లేడ్‌ల సంఖ్య ద్వారా పడవ నుండి వేరు చేయబడుతుంది. ఇది నీటి సాహసం. ఇందులో ప్రారంభకులు సైతం పాల్గొనవచ్చు. ఇక్కడ స్వచ్ఛమైన నీటిలో కయాకింగ్ అనుభవం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఫిషింగ్..
చాలా మందికి ఫిషింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అలాంటివారు కూడా ఇక్కడికి రావొచ్చు. ఇక్కడి సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఫిషింగ్ చేయొచ్చు. ఈ ప్రదేశం ఎంతో సాహోసోపేతంగానూ, ఎంతో ఆహ్లదకరంగానూ ఉంటుంది.

పారాసైలింగ్
దేశంలోని అనేక ప్రదేశాలలో పారాసైలింగ్ జరిగినప్పటికీ, లక్షద్వీప్‌లోని స్వచ్ఛమైన నీటిలో ఈ కార్యక్రమం పర్యాటకులకు మరింత వినోదాన్ని అందిస్తుంది. జెట్ బోట్ ఆవిరి ద్వారా సముద్ర స్కీయింగ్‌తో ఈ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. స్వచ్ఛమైన నీటి కారణంగా, ఈ చర్య ఇక్కడ చాలా ప్రదేశాలలో జరుగుతుంది. ఇక్కడి బీచ్ అందాలను చూస్తు పర్యాటకులను వారే వారు మర్చిపోతారంటే నమ్మండి.



Click it and Unblock the Notifications












