కొత్తసంవత్సరంలో కొత్త ప్రదేశాలను సందర్శించాలని చాలామంది అనుకుంటుంటారు. అందుకోసం చాలామంది విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తుంటారు. కానీ, భారత్‌లో కూడా సందర్శించేందుకు ఎన్నో ఉత్తమమైన ప్రదేశాలున్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడ ఎన్నో అందమైన ఉద్యానవనాలు, మిస్టరీ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవి పర్యాటకులను మైమరింపజేస్తాయి. భారత్‌లోని ఉత్తమమైన ఆఫ్‌బీట్ గమ్యస్థానాలేంటో చూద్దాం..

నరరా మెరైన్ నేషనల్ పార్క్..
గుజరాత్‌లో సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలున్నాయి. పురాతన కట్టాడాలతో పాటు, చారిత్రక నిర్మాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గుజరాత్‌లో చూడదగ్గ మరోక పర్యాటక ప్రదేశం నరరా మెరైన్ నేషనల్ పార్క్. ఇది భారత్‌లోని తొలి సముద్ర జాతీయ ఉద్యానవనంగా చెబుతారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు కొద్ది దూరంలోనే ఈ పార్క్ ఉంది. ఇది మూడు పార్క్‌లుగా విభజించబడి ఉంటుంది. ఇది 42 చిన్న ద్వీపాల మాదిరి విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఇక్క పగడాలు, ఆక్టోపస్, ఎనిమోన్స్, పఫర్ ఫిష్, సముద్ర గుర్రాలు, పీతలు వంటికి ఈ ప్రాంతం ప్రసిద్ధిచెందింది.

హిమచల్ ప్రదేశ్‌లోని ఆండ్రెట్టా..
హిమచల్ ప్రదేశ్‌లోని ఆండ్రెట్టా పర్యాటకులను ఎంతగానో ఆకట్టకునే ప్రదేశం. ఇది పారాగ్లైడింగ్‌కి ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేగాదు ఈ ఆండ్రెట్టాని కళాకారుల కాలనీ అని కూడా పిలుస్తుంటారు. దీన్ని 1920లలో ఐరిష్ థియేటర్ ఆర్టిస్ట్ నోరా రిచర్డ్స్ లో స్థాపించారు. ఇక్కడ కుమ్మరి దగ్గర నుంచి హస్తకళకారుల వరకు ఎందరో నైపుణ్యవంతులైన కళాకారులు ఉంటారు. వారందరి నైపుణ్యాలను ఇక్కడ వీక్షించోచ్చు. అంతేకాదు వాటిని పర్యాటకులు నేర్చుకునేందుకు వీలుగా కూడా ఉంటుంది. ఇక్కడ శోభా సింగ్ ఆర్ట్‌గ్యాలరీ ఎంతగానో పేరుగాంచింది.

గాన తరంగాల భూమి
తమిళనాడులో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఎన్నో పురాతనమైన ఆలయాలు, జలపాతాలను పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ ప్రసిద్ధిచెందిన మరో పర్యాటక ప్రదేశం తరంగంబాడి. దీని అర్థం గాన తరంగాల భూమి అని. గతంలో ఈ ప్రాంతాన్ని ట్రాన్‌క్విబార్ అని పిలిచేవారట. ఈ ప్రదేశం అనేక బీచ్ టౌన్‌లకు ప్రసిద్ధిచెందింది. ఇది చరిత్రలో నిలిచిన పట్టణం. చరిత్ర గురించి ఆసక్తి గలవారికి ఈ ప్రదేశం ఎంతో ఉత్తమం.
ఈ ప్రాంతం గురించి లోతుగా అధ్యయనం చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్న డానిష్ కోట పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ కోటను 1620లలో నిర్మించారు. ఈ కోటని డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు స్థావరంగా ఉపయోగించుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ పర్యాటకులు సందర్శించేందకు మరెన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి న్యూ జెరూసలేం చర్చీని పర్యాటకులు తప్పక సందర్శించాల్సిందే. దీన్ని భారతీయ యూరోపియన్ నిర్మాణాల కలయికతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఇదే ఇక్కడి విశేషం.

ఎత్తయిన శిఖరాలకు నిలయమైన ప్రాంతం..
పశ్చిమబెంగాల్‌లోని ఆనంద నగరం సందక్‌పూ ఎంతో ప్రత్యేకమైన నగరం. ఇది ఎత్తైన శిఖరాలకు నిలయంగా ఉంటుంది. ఈ ప్రాంతం భారత్ నేపాల్ సరిహద్దులో ఉంది. ఎవరెస్ట్, కాంచనజంగా, లోట్సే మకాలులను కప్పి ఉంచే అద్భుతమైన పర్వత దృశ్యాలను పర్యాటకులు ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఈ దృశ్యం బుద్ధుడి ఆకృతిని తలపించేలా ఉంటుందని ఇక్కడివచ్చే పర్యాటకులు నమ్ముతారు.



Click it and Unblock the Notifications













