Search
  • Follow NativePlanet
Share
» »వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్‌లు ఇవే..

వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్‌లు ఇవే..

పెరుగుతున్న వేడి నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది ప్రజలు తరచుగా హిల్ స్టేషన్‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. దేశంలో ఈ సీజ‌న్‌లో సంద‌ర్శించేందుకు అనేక హిల్ స్టేషన్‌లు ఉన్నాయి. కాబ‌ట్టి, దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్‌స్టేష‌న్లేంటో చూద్దాం. ఇక్క‌డ ఈ వేసవిలో ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో అందమైన దృశ్యాల‌ను తిల‌కిస్తూ కొన్ని క్షణాలను విశ్రాంతిగా గడపియేచ్చు. ఇక్క‌డి ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో మీ విహ‌రయాత్ర‌ను ఎంజాయ్ చేయొచ్చు. మ‌రీ దేశంలోనీ ఈ ఆఫ్‌బీట్ హిల్‌స్టేష‌న్‌ల గురించి తెలుసుకుందామా..?!

lachung1

లాచుంగ్

లాచుంగ్ సిక్కింలో ఉంది. ఇది వేసవి విహారయాత్ర‌లో విహ‌రించేందుకు బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్‌స్టేష‌న్‌. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కి వెళ్లి అక్కడి నుంచి లాచుంగ్‌కు బయలుదేరాల్సి ఉంటుంది. నేరుగా లాచుంగ్‌కి వెళ్లడం కాస్త అలసటగానే ఉంటుంది. ఇక్కడి అందమైన లోయలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ప‌ర్యాట‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంటాయి. ఇక్క‌డికి వ‌స్తే అస్స‌లు టైమే తెలియ‌దు. ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఈ ప్రాంతం స్వ‌ర్గ‌ధామ‌మని చెప్పాలి. లాచుంగ్ నది యొక్క అందమైన దృశ్యాల‌ను కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడ స్థానిక జీవితాన్ని ఆస్వాదించేందుకు హోమ్ స్టే ను కూడా ఎంచుకోవచ్చు, ఇది మీ విహారయాత్రను మరింత సరదాగా చేస్తుంది.

naukuchiatal1

నౌకుచియాటల్

నౌకుచియాట‌ల్ ఉత్త‌రాఖండ్‌లోని ఓ హిల్‌స్టేష‌న్‌. ఇది భీమ్‌తాల్ మరియు నైనిటాల్ మధ్య వెల‌సింది. ఈ ప్ర‌దేశాన్ని చాలా తక్కువ మంది మాత్రమే సందర్శిస్తారు. ఎందుకంటే ఇక్క‌డ అనేక హిల్‌స్టేష‌న్లు ఉన్నాయి. నైనిటాల్ వంటి బెస్ట్‌ ఆఫ్‌బీట్ హిల్‌స్టేష‌న్స్ కూడా ఇక్క‌డే వున్నాయి. కాబ‌ట్టి చాలాతక్కువ మందికి నౌకు చియాట‌ల్ హిల్‌స్టేష‌న్ తెలుసు. దీని కారణంగా, ఈ ప్ర‌దేశంలో అసలు ర‌ద్దీ అనేదీ మీకు క‌నిపించ‌దు. కాబ‌ట్టి ఈ వేస‌వి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లేవారికి ఈ ఆఫ్‌బీట్ హిల్‌స్టేష‌న్ ఎంతో ఉత్త‌మం. ఇక్కడ ప‌ర్యాట‌కులు అందమైన పర్వత దృశ్యాలను నేరుగా చూడొచ్చు. అలాగే బోటింగ్ మరియు పారాగ్లైడింగ్ వంటి సాహ‌స కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు.

చక్రతా

ఉత్తరాఖండ్‌ పేరు చెప్పగానే ముస్సోరీ, నైనిటాల్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలే ప‌ర్యాట‌కులకు గుర్తుకు వస్తాయి. అయితే, ఈ సీజ‌న్‌లో ఇక్క‌డ విపరీత‌మైన రద్దీ ఉంటుంది. జనం సాంద్రం లేని ప్ర‌దేశాలు కూడా ఇక్క‌డ ఉన్నాయి. అదే చ‌క్ర‌తా. ఈ ప్ర‌దేశం వేస‌విలో విహార‌యాత్ర‌కు ఎంతో అనువైన‌ది. ఇది ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ హిల్‌స్టేషన్ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ న‌చ్చుతుంది. చుట్టూ అందమైన హిమాలయాలతో నిండి ఉన్న ఈ ప్రదేశం గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ స్కీయింగ్, రాపెల్లింగ్ వంటి కార్యకలాపాలు చేయవచ్చు. ఇక్క‌డ టైగర్ ఫాల్ కూడా చూడొచ్చు. ఇదో అందమైన హిల్‌స్టేషన్. అంతేకాదు, ఇక్క‌డ ట్రెక్కింగ్ అనుభూతిని కూడా పొండొచ్చు.

ఖజ్జియార్

హిమాచల్ ప్రదేశ్ లోని డల్హౌసీ నుండి సుమారు 24 కిలోమీట‌ర్లు, 1500 మీటర్ల దూరంలో ఉన్న ఖజ్జియార్ అందాన్ని మాటల్లో వర్ణించ‌లేం. ఇదో అంద‌మైన హిల్‌స్టేష‌న్‌. ఈ ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఉత్కంఠభరితమైన దృశ్యాలు కాకుండా, గుర్రపు స్వారీ, పారాగ్లైడింగ్ మరియు ట్రెక్కింగ్ వంటివి కూడా చేయవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఖజ్జియార్ ఉత్తమ గమ్యస్థానమ‌ని చెప్పుకోవాలి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+