Search
  • Follow NativePlanet
Share
» »స‌మ్మర్ క్యాంపింగ్‌కు అనువైన ప్ర‌దేశాలు ఇవే..

స‌మ్మర్ క్యాంపింగ్‌కు అనువైన ప్ర‌దేశాలు ఇవే..

స‌మ్మర్ క్యాంపింగ్‌కు అనువైన ప్ర‌దేశాలు ఇవే..

స‌మ్మ‌ర్‌లో వేస‌వి వేడిని త‌ట్టుకోలేక చాలామంది దేశంలోని చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు టూర్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంటారు. విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌తోపాటు ప్ర‌కృతి సౌంద‌ర్యానికి ప్ర‌సిద్ధి చెందింది భార‌త‌దేశం. చుట్టూ ప‌చ్చ‌ద‌నం, ప్ర‌కృతిలో సేద‌తీరాల‌ని ఎవ‌ర‌కి ఉండ‌దు. ఈ గ‌జిబిజి లైఫ్‌లో చాలామంది సెల‌వుల్లో ప్ర‌శాంత‌త‌కు, ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌దేశాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి ప్ర‌దేశాలు మ‌న‌దేశంలోనే ఉన్నాయి. వేస‌వి వేడి నుండి త‌ప్పించుకుని స‌మ్మ‌ర్ క్యాంపింగ్ ఉప‌యోగ‌ప‌డే కొన్ని ప్ర‌దేశాల‌నే మ‌న‌మిప్పుడు చూద్దాం.

sonmarg

సోనామార్గ్

జ‌మ్ముకాశ్మీర్ రాష్ర్టంలోని సోనామార్గ్ ఓ కొండ ప్రాంతం. ఈ ప్రాంతం స‌ముద్ర‌మ‌ట్టానికి 2740 మీట‌ర్ల ఎత్తులో క‌ల‌దు. చుట్టూ మంచు ప‌ర్వ‌తాల‌తో ఈ ప్రాంతం క‌ప్ప‌బ‌డి ఉంటుంది. సోనామార్గ్ అంటే అర్థం బంగారు మైదానం అని పిలుస్తారు. సోనామార్గ్‌లో అంద‌మైన ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌దేశాలు చూడొచ్చు. అలాగే ట్రెక్కింగ్‌,హైకింగ్ వంటి సాహ‌స క్రీడ‌ల‌ను సైతం ఆడ‌వ‌చ్చు.

solangvalley1

సోలాంగ్ వ్యాలీ

సోలాంగ్ వ్యాలీని సోలాంగ్ నుల్లా అనిపిలుస్తారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సాహ‌స కార్య్ర‌కలాపాల‌కు ఇష్ట‌ప‌డే ప్ర‌దేశంగా ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డ పారాచూటింగ్‌, పారాగ్లైడింగ్, స్కేటింగ్, జోర్బింగ్ వంటివి ప్ర‌సిద్ధి చెందాయి. సోలాంగ్ వ్యాలీకి సోలాంగ్ అనే గ్రామం పేరు నుంచి ఆపేరు వ‌చ్చింది. నుల్లా అంటే ప‌ర్వ‌తాల నుండి నీటి ప్ర‌వాహాలు అని అర్థం. ఉత్త‌ర‌భార‌త‌దేశంలోని మ‌నాలి నుండి 16 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇది బియాస్ న‌ది ప‌శ్చిమ ఒడ్డున ఉంది. స‌ముద్ర మ‌ట్టానికి 8500 అడుగుల ఎత్తులో ఉంది.

ఇక్క‌డ కేవ‌లం ఆడ్వంచ‌ర్ యాక్టివిటిస్ మాత్ర‌మే కాదు. చుట్టూ ప‌చ్చ‌ద‌నం, ఆపిల్‌తోట‌లు, మంచుతో క‌ప్ప‌బ‌డిన శిఖ‌రాలు, స‌ర‌స్సులు ఇంకా చాలానే ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు భార‌తీయులే కాకుండా విదేశాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఇక్క‌డి అత్యాధునిక‌మైన రోప్‌వే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది.

chandratal1

చంద్రతాల్ సరస్సు

చంద్రతాల్ సరస్సు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలో క‌ల‌దు. చంద్ర తాల్ అంటే చంద్రుని స‌ర‌స్సు అని అర్థం. ప‌ర్యాట‌కులు, ప‌ర్వ‌తారోహ‌కుల‌కు ఇష్ట‌మైన ప్ర‌దేశం ఇది. హిమాల‌యాల‌లో సుమారు 4300 మీటర్ల ఎత్తులో ఉన్న అత్యంత అంద‌మైన స‌ర‌స్సుల‌లో ఒక‌టిగా నిలిచింది. వేసవి సెలవుల్లో స‌ర‌ద‌గా గ‌డిపేందుకు ఇది ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. ఇక్క‌డి ప‌చ్చ‌ద‌నం, ప్ర‌కృతి, అందం మరియు అద్భుతమైన వాతావరణం కారణంగా, క్యాంపింగ్ కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఇక్క‌డికి ప్రజలు త‌ర‌లి వ‌స్తుంటారు.

mussoorie1

ముస్సోరీ

ముస్సోరి ఉత్త‌రాఖండ్‌లోని డెహ్ర‌డూన్ జిల్లాలో ఢిల్లీ నుండి 290 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అత్యం ప్ర‌సిద్ధ హిల్‌స్టేష‌న్ల‌లో ఒక‌టి. హిమాల‌యాల శివాలిక్ శ్రేణి, డూన్ వ్యాలీ నేప‌థ్యంలో ముస్సోరిని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇది స‌ముద్ర మ‌ట్టానికి 7000 అడుగుల ఎత్తులో ఉంది. ఏడాది పొడవునా చ‌ల్ల‌ని మ‌రియు ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంతో ఈ ప్రాంతం ఉంటుంది.

spiti1 valley

స్పితి వ్యాలీ

హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ ఒక చల్లని ఎడారి. ఇక్కడ మండే వేడిలో కూడా చల్లగా అనిపిస్తుంది. 12500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ లోయ అన్ని వైపుల నుండి హిమాలయాలచే చుట్టబడి ఉంటుంది. ఇక్కడి అందమైన దృశ్యాలు మరియు ప్రకృతి అందాల కారణంగా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి త‌ర‌లి వ‌స్తుంటారు. వేస‌విలో ఇక్క‌డ క్యాంపింగ్ చేసేందుకు అనువైన ప్ర‌దేశం.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+