Search
  • Follow NativePlanet
Share
» »భార‌త్‌లో డిసెంబ‌ర్‌లో జ‌రిగే ప్ర‌సిద్ధిచెందిన పండుగ‌లు ఇవే...

భార‌త్‌లో డిసెంబ‌ర్‌లో జ‌రిగే ప్ర‌సిద్ధిచెందిన పండుగ‌లు ఇవే...

డిసెంబర్ మాసం చాలా ర‌కాలుగా విశిష్ట‌మైన‌ది, ప్రత్యేకమైనది. ఒకవైపు కొత్త సంవత్సరం రాక కోసం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తుంటే మరోవైపు గడిచిపోతున్న సంవత్సరం గురించి కొంద‌రిలో పశ్చాత్తాపం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స‌మ‌యంలో ఇంట్లో కూర్చొని ఈ తీపి, చేదు జ్ఞాపకాల్లో కూరుకుపోయే బదులు ఏదైనా ప్రాంతాల‌కు వెళ్లేలా ప్రణాళిక వేసుకోండి. డిసెంబరులో భారత‌దేశంలో అనేక పండుగలను నిర్వ‌హిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్ర‌త్యేక‌మైన పండ‌గలు కూడా నిర్వ‌హిస్తారు. ఈ పండుగలను చూసేందుకు దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. కాబ‌ట్టి మీరు కూడా ఈ పండుగ‌ల‌లో ఆ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించి, అక్క‌డి ప‌ద్ధ‌తుల‌ను, సంప్ర‌దాయాల‌ను, ఆచార‌వ్య‌వ‌హాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు. మ‌రెందుకాల‌స్యం ఆ ప్ర‌దేశాలేంటో చూసేద్దాం ప‌దండి...

కుంభాల్‌గర్ పండుగ

కుంభాల్‌గ‌ర్ పండుగ‌ను ప్ర‌త్యేకంగా డిసెంబ‌ర్‌లో జ‌రుపుకుంటారు. ఇది రాజస్థాన్‌లో నిర్వహించబడే చాలా పెద్ద సాంస్కృతిక ఉత్సవం. కుంభాల్‌గర్ ఉత్సవం ఉదయపూర్‌లో ఉన్న కుంభాల్‌గర్ కోటలో జరుగుతుంది. ఇది మూడు రోజుల పాటు జ‌రిగే ఉత్స‌వం. ప్రతి రోజు ఈ పండుగ‌ను ఎంతో ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవ‌డం ఇక్క‌డి ఆన‌వాయితీ. ఈ ఉత్సవంలో పాల్గొనడం వ‌ల్ల జానపద నృత్యం, గానం, తోలుబొమ్మ నృత్యం, ప్రదర్శన మొదలైన అనేక విషయాలను తెలుసుకోవ‌చ్చు. ఈ పండుగ డిసెంబ‌ర 1 న ప్రారంభ‌మ‌య్యి డిసెంబ‌ర్ 3 న ముగుస్తుంది.

rannofkutch ,festival

రాన్ ఆఫ్ కచ్

గుజరాత్‌లో చాలా పెద్ద స్థాయిలో జరుపుకునే మరొక పండుగ రాన్ ఆఫ్‌క‌చ్ ఉత్స‌వం. కచ్ సందర్శ‌నకు ఉత్త‌మ సమయం వింట‌ర్‌. ఈసీజ‌న్‌లో ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ఉత్స‌వం కూడా చేస్తారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. కచ్ భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారులలో ఒకటిగా ప్ర‌సిద్ధిచెందింది. ఈ ఉత్స‌వం న‌వంబ‌ర్ 10, 2023 ప్రారంభ‌మ‌య్యి, ఫిబ్ర‌వ‌రి 25, 2024 వ‌ర‌కు కొన‌సాగుతుంది.

hornbillfestival1

హార్న్‌బిల్ పండుగ

హార్న్‌బిల్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నాగాలాండ్‌లో జరుపుకుంటారు. ఈ పండుగ‌ను నాగాలాండ్ వ్యవస్థాపక దినోత్సవం (1 డిసెంబర్ 1963) నాడు నిర్వహించబడుతుంది. ఈ పండుగను ప‌ది రోజుల‌పాటు నిర్వ‌హిస్తారు. ఈ పండుగలో నాగ తెగల సంప్రదాయ ఆటలు, నృత్యం, సంగీతం, వారి యుద్ధ కళలను చూడొచ్చు. ఈ పండుగకు హార్న్‌బిల్ పక్షి పేరు పెట్టారు. నాగ తెగలో ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ఈ పండుగ‌ను కూడా ఎంతో వైభ‌వంగా జ‌రుపుకుంటారు. డిసెంబ‌ర్ 1న ప్రారంభ‌మ‌య్యి డిసెంబ‌ర్ 10న ఈ పండుగ ముగుస్తుంది.

hotairballoonfestival

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

సాహ‌స ప్రియులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ఫెస్టివ‌ల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివ‌ల్‌. ఈ పండుగ‌ను ప్ర‌తిఏటా డిసెంబ‌ర్‌లో జ‌రుపుకుంటారు. ఈసారి కూడా ఈ పండుగ‌ను క‌ర్నాట‌క‌లో ఎంతో ఘ‌నంగా చేసుకుంటున్నారు. క‌ర్నాట‌క‌లో ప్ర‌తి సంవ‌త్స‌రం హాట్ ఎయిర్ బెలూనింగ్ నిర్వహించబడుతుంది. డిసెంబర్ నెల అంతా ఈ పండుగను ఆస్వాదించవ‌చ్చు. ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్‌లను చూడటం ఒక విభిన్నమైన సాహసమ‌నే చెప్పుకోవాలి. ఇక్క‌డి అద్భుత‌మైన దృశ్యాల‌ను మీ కెమెరాల్లో బంధించొచ్చు.

chennaimusicfestival1

చెన్నై మ్యూజిక్ ఫెస్టివల్

చెన్నై మ్యూజిక్ ఫెస్టివల్ కోసం చాలామంది ఎంతోకాలంగా ఎదురుచూస్తుంటారు. ఈ ప్ర‌దేశంలో వాయిద్య సంగీతం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, అనేక రకాల ఆసక్తికరమైన నాటకాలను ఇక్క‌డ చూడొచ్చు. వయోలిన్, మృదండం, వేణువు, వీణ శ్రావ్యమైన ధ్వనులను వినే అవకాశం ప‌ర్యాట‌కుల‌కు ల‌భిస్తుంది. ఇక్క‌డ కేవ‌లం సంగీతమే కాకుండా మోహినీ అట్టం, భరతనాట్యం వంటి నృత్యాలు కూడా ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+