Search
  • Follow NativePlanet
Share
» »రాయ‌ల‌సీమలోని ఫేమ‌స్ ఫుడ్స్ ఇవే..!

రాయ‌ల‌సీమలోని ఫేమ‌స్ ఫుడ్స్ ఇవే..!

రాయ‌ల‌సీమలోని ఫేమ‌స్ ఫుడ్స్ ఇవే..!

రాయలసీమ అంటే చాలు చాలామందికి స్పైసీ ఫుడ్ గుర్తుకొస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ఆహారం చాలా కారంగా ఉంటుంది. రాయలసీమ ఆంధ్ర ప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడపలతో కూడిన ఒక ప్రాంతం. కేవలం ఈ ప్రాంతం ఫ్యాక్షనిజం, రాజకీయాలకు ప్రసిద్ధి చెంద‌డ‌మే కాకుండా ఇక్క‌డ అనేక సుంద‌ర‌మైన, చారిత్ర‌క‌మైన‌ ప్ర‌దేశాల‌కు కొదవే లేదు. అంతేకాకుండా ఇక్క‌డి వంట‌కాలు కూడా ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందాయి. రాయలసీమ ప్రజలు అసలైన రుచినిచ్చే ఆహారాన్ని తయారు చేయడం, తినడం, వడ్డించడం పట్ల చాలా మక్కువ చూపుతారు. అక్క‌డి వంటకాలు కారంగా ఉన్నప్పటికీ, వాటి ప్ర‌త్యేక రుచుల‌తో ప‌ర్యాట‌కుల‌కు నోరూరిస్తున్నాయి.

1

గుంట పునుగులు

రాయలసీమలో ఒక సాంప్రదాయ చిరుతిండి గుంట పునుగులు. వీటినే పొంగ‌నాలు అని కూడా అంటారు. వీటిని పులియబెట్టిన మిన‌ప‌ప్పు (నలుపు), బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. అంతేకాకుండా వీటిని రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా అల్పాహారం కోసం వినియోగిస్తుంటారు. దోసె లేదా ఇడ్లీ పిండితో కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట అల్పాహారంగాను, సాయంత్రం స్నాక్స్‌గాను వీట‌ని ఎక్కువ‌గా తీసుకుంటుంటారు. తెలుగులో గుంత అనే పదం కొలత యూనిట్, భూమిలో ఖాళీ స్థలం అని కూడా అర్థం. పునుగులు అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీధుల్లో విక్రయించబడే సాధారణ అల్పాహారం. సాధారణంగా కొబ్బరి చట్నీ లేదా ఇంట్లో తయారుచేసిన ఊరగాయతో దీని రుచిని ఆస్వాదించొచ్చు.

2

మిర్చి బజ్జీతో ఉగ్గాని

రాయలసీమ మెనూలో ఖచ్చితంగా ఉండే మ‌రో వంట‌కం ఉగ్గాని బ‌జ్జీ. ఇది సాధారణ రాయలసీమ అల్పాహారం. దీనిని బొరుగుల ఉప్మా అని కూడా పిలుస్తారు. ఈ రాయలసీమ వంటకం ఉప్మా మాదిరిగానే ఉంటుంది. రాయ‌ల‌సీమ‌లోని క‌ర్నూలు, అనంత‌పురం, క‌డ‌ప న‌గ‌రాల్లో ఉదయం పూట చాలా రకాల టిఫిన్లు చేసినా, ఉగ్గానీ బజ్జి చాలా ప్రత్యేకమైనది. నగరవాసులు ఉదయం పూట అల్పాహరంగా ఈ ఉగ్గాని బజ్జీని తింటూ ఉంటారు. దీనిని ఎలా త‌యారు చేయాలో చూద్దాం. బొరుగులు సరిపడనంత తీసుకోవాలి. వాటిని నీళ్ళలో నానబెట్టి, నీళ్లను ఒడిసిపెట్టి, బొరుగులను మాత్రేమే తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ‌లు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉద్దీపప్పు, శెనగపప్పును.. నూనెలో వేసితాలింపు పెట్టాలి. ఈ తాలింపును నీటిలో తడిపిన బొరుగులకు కలిపి వాటికి తగినంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి. వేడి వేడి ఉగ్గానీ బ‌జ్జీ రెడీ అవుతోంది.

3

కారం దోశె...

నగరంలో ఉదయం తినే అల్పాహారాలలో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. కానీ మనకు అందరికీ తెలిసిన అల్పాహారం దోశ. మామూలుగా మనం ఇంట్లో సాదా దోశను వేసుకొని తింటూ ఉంటాం. కానీ ఈ మధ్య చాలా రకాల దోశలు అందుబాటులోకి వచ్చాయి. దోశెలు వివిధ రకాల రుచులతో తయారు చేస్తున్నారు. క‌ర్నూలు నగరంలో మనకు చాలా రకాల దోశలు సంద‌ర్శ‌కుల‌కు నోరూరిస్తున్నాయి. అందులో ముఖ్య‌మైన‌ది కారం దోశ, ఎగ్ దోశ, ఆకుకూర దోశ, సాదా దోశ, నెయ్యి దోస, ఆనియన్ దోశ, ఎగ్ ఆనియన్ దోశ ,డబల్ ఎగ్ దోస, ఇలా మనకు ఇక్క‌డ దొరుకుతాయి.

More News

    Read more about: rayalaseema andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+