Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ‌ప‌ట్నంలో ముఖ్య‌మైన షూటింగ్ స్పాట్స్ ఇవే..!

విశాఖ‌ప‌ట్నంలో ముఖ్య‌మైన షూటింగ్ స్పాట్స్ ఇవే..!

ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌కు, బీచ్‌ల‌కు ప్ర‌సిద్ధిచెందింది ఏపీలోని విశాఖ న‌గ‌రం. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత ఖ‌చ్చితంగా చూడాల్సిన ప్రాంతాల‌లో విశాఖ‌ప‌ట్నం ముందువ‌రుస‌లో ఉంటుంది. వైజాగ్ అన‌గానే చాలామందికి బీచ్‌లే గుర్తుకొస్తాయి. సముద్రపు అలల తాకిడిని అనుభవించేందుకే ఎక్కువ‌శాతం ఈ ప్రాంతాన్ని సంద‌ర్శిస్తుంటారు. ఇక్క‌డ కేవ‌లం స‌ముద్ర‌పు అల‌లు మాత్ర‌మే కాదు.. అంత‌కుమించిన ప్ర‌కృతి అందాలు దాగి ఉన్నాయి. హైద‌రాబాద్ త‌ర్వాత ఎక్కువ టాలీవుడ్ షూటింగ్ లోకేష‌న్స్ ఉన్న ప్రాంతం మ‌న విశాఖ‌నే.. ఇక్క‌డ ఎన్నో షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. రండి.. ఆ షూటింగ్ స్పాట్స్ గురించి తెలుసుకుందాం.

ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌లో చిత్రీక‌ర‌ణ చేయాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా విశాఖ‌లోని అర‌కు, పాడేరుకు రావాల్సిందే. ఇక్క‌డ ఎన్నో సినిమా షూటింగ్‌లు జ‌రిగాయి. ఒక్క టాలీవుడ్ చిత్రాలే కాదండోయ్‌.. కోలీవుడ్‌లోని ప‌లు సినిమాలు కూడా ఈ అట‌వీ ప్రాంతంలో షూటింగ్‌లు చేశారు. ఆ లోకేష‌న్స్ మ‌నం కూడా ఓసారి వీక్షించేద్దామా..?

araku1 shooting spot

అర‌కు

రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో అరకు ఒకటి. ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాలంటే ఏ సీజ‌లోనైనా వెళితే.. అయితే ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి మాసాల మధ్య అరకు అందాలు పర్యాటకులను ఎంత‌గానో ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి. ఈ ప్రాంతం సినిమా షూటింగ్ లకు కూడా పేరుగాంచింది. ఇక్కడి సహజసిద్ధ ప్రకృతి అందాలు షూటింగ్ స్పాట్స్‌కు బాగా సరిపోతాయి. ఇక్క‌డ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన‌ చిత్రం 'ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ జ‌రిగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని సాధించిందో అందర‌కీ తెలిసిందే క‌దా.. సినిమా కథాంశం బట్టి అరకులో ఈ సినిమాలోని ప‌లు స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

bhimili spot

భీమిలి

విశాఖ‌లోని బెస్ట్ షూటింగ్ లోకెష‌న్స్‌లో భీమీలి ఒక‌టి. ఇక్క‌డ సముద్రం చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పటినుంచో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇక్క‌డ షూటింగ్ చేసిన సినిమాల్లో ఎక్కువ చెప్పుకోవాల్సింది మరోచరిత్ర సినిమా గురించి.. ఆ సినిమా అప్ప‌ట్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించింది. ఈ సినిమాలో కమల్ హాసన్, సరిత జంటగా న‌టించారు. ఈ సినిమా అంతా భీమిలి బీచ్ లోనే షూటింగ్ చేశారు. భీమిలి దగ్గర ఉన్న గాలి మేడలో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జ‌రిగింది. ఇక‌, ఈ ప్రాంతంలో ఉన్న ఎర్ర మట్టి దెబ్బలు చాలా సినిమాల్లో మ‌నం చూడొచ్చు. అంతేకాదు, తెలుగులో మంచి హిట్‌ను అందుకున్న స్వర్ణకమలం, శ్రీవారికి ప్రేమలేఖ వంటి సినిమాలు కూడా ఇక్క‌డే షూటింగ్ చేశారు.

rkbeach Vishakapatnam

ఆర్కే బీచ్

వైజాగ్ అన‌గానే చాలామందికి ఆర్కే బీచ్ గుర్తుకొస్తుంది. నిత్యం ఇక్క‌డ చాలామంది కనిపిస్తూనే ఉంటారు. ఈ ప్రాంతం ఎన్నో సినిమా షూటింగ్‌ల‌కు ప్ర‌సిద్ధ‌చెందింది. బీచ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఆర్కే బీచ్‌లోనే షూట‌ణ్ చేస్తున్నారు. ఇక్క‌డ న‌టుడు రామ్ న‌టించిన‌ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలు షూట్ చేశారు. అలాగే, న‌టుడు సిద్ధార్థ్ న‌టించి ఓయ్ సినిమా షూటింగ్ కూడా ఇక్క‌డే జ‌రిగింది. వీటితోపాటు ప‌లు సినిమాలు కూడా ఈ లొకేష‌న్స్‌లోనే షూట్ చేశారు. అంతేకాదు, తాజాగా గ్లోబల్‌స్టార్‌ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది.

More News

    Read more about: shooting spots araku bhimili
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+