Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని అత్యంత ఖరీదైన రైళ్లు ఇవే..!

భారతదేశంలోని అత్యంత ఖరీదైన రైళ్లు ఇవే..!

భారతదేశంలోని అత్యంత ఖరీదైన రైళ్లు ఇవే..!

భారతదేశంలో ఎన్నో పట్టణాలను, మూలలను కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఎన్నో సౌకర్యాలతో కూడిన రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రైళ్లలో ప్రయాణిస్తున్నపుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. రైలు ప్రయాణంలో ఒక లైఫ్ ఉంటుంది. ఎన్నో కథలు, మరెన్నో గాథలు, ఇంకెన్నో మధురానుభూతులు ఉంటాయి. రైళ్లో వెళ్లేటపుడు వచ్చే శబ్దం, కిటికీ నుంచి కనిపించే అందమైన దృశ్యాలు, తోటి ప్రయాణికులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినపుడు రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగానే కాక, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. తక్కువ ధ‌ర కూడా ఉంటుంది. కానీ, భార‌త‌దేశంలో కూడా అత్యంత ఖ‌రీదైన రైళ్లు ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, ప‌దండి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాజా ఎక్స్‌ప్రెస్

IRCTC నిర్వహించే మహారాజా ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన రైళ్లలో ఒకటి. ఇది సుమారు ప‌న్నెండు ప్రదేశాలను చుట్టేస్తుంది. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు చుట్టేసే ప్ర‌దేశాలు ఎక్కువ‌గా రాజస్థాన్‌కు చెందినవే ఉన్నాయి. నాలుగు పగలు, మూడు రాత్రులకు రైలులో ఒక వ్యక్తికి డీలక్స్ క్యాబిన్ ధర సుమారు రూ. 2.80 లక్షలు. ప్రెసిడెన్షియల్ సూట్‌ను బుక్ చేస్తే, ఈ ధర 12,900 రూపాయ‌లు ఉంటుంది. ఈ రైలు సెప్టెంబరు, ఏప్రిల్ నెలల్లో అయితే ఐదు ప్రయాణాల జాబితాతో ప్ర‌యాణికుల ముందుకు వస్తుంది. రాజ‌స్థాన్ అందాల‌తో పాటు ఖ‌జురహో ఆలయాన్ని సంద‌ర్శించొచ్చు.

1

ప్యాలెస్ ఆన్ వీల్స్

ప్యాలెస్ ఆన్ వీల్స్ రాజస్థాన్ ప్రైడ్‌లో అద్భుతమైన ఇంటీరియర్స్‌తో ఫైవ్ స్టార్ హోటల్‌గా ప్ర‌సిద్ధి చెందింది. ఈ రైలు 1982లో బ్రిటీష్ కాలం నాటి రాయల్ కోచ్‌లతో ప్రవేశపెట్టబడింది. దీనికి అప్పటి రాచరిక రాష్ట్రాల పాలకుల ప్రైవేట్ కోచ్‌లుగా కూడా ఉండేవారు. ఈ రైలు న్యూఢిల్లీ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి జైపూర్ సవాయి మాధోపూర్, చిత్తోర్‌గఢ్, ఉదయపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, భరత్‌పూర్, ఆగ్రా వంటి నగరాల గుండా ప్ర‌యాణిస్తుంది. ఈ రాచరిక ప్రయాణాన్ని అనుభవించాలనుకునేవారి ద‌గ్గ‌ర త‌ప్ప‌కుండా రూ. 3,63,300 ఉండాల్సిందే. ఎందుకంటే దీని ధ‌ర అంతేమ‌రి.

2

రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్

ప్యాలెస్ ఆన్ వీల్స్ తర్వాత, భారతీయ రైల్వేలు దీనిని 2009 సంవత్సరంలో ప్రారంభించాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్ మాదిరిగానే ఈ లగ్జరీ రైలు కూడా రాజస్థాన్ నగరాలకు ప్రయాణిస్తుంది. ఈ రైలులో పర్యాటకులు ఏడు పగళ్లు, ఎనిమిది రాత్రులు రాజస్థాన్ చుట్టూ తిరిగేయొచ్చు. ఇత‌ర‌ లగ్జరీ రైళ్లతో పోలిస్తే ఛార్జీలు కాస్త తక్కువే అని చెప్పుకోవాలి. డబుల్ షేరింగ్ డీలక్స్ క్యాబిన్‌లో ప్రతి వ్యక్తికి రూ. 48.828 ధ‌ర ఉంటుంది.

3

గోల్డెన్ ఛారిటి..

ఈ రైలు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి వంటి రాష్ట్రాల గుండా పోతుంది. ఇందులో, ఏడు రాత్రులకు క‌లిపి రూ. 1,82,000 ఉంటుంది. ఈ రైలు పచ్చని అడవులు, ఉత్కంఠభరితమైన జలపాతాల గుండా త‌న ప్ర‌యాణాన్ని సాగిస్తుంది. ఈ ప్ర‌యాణంలో ఇతర సౌకర్యాలతో పాటు స్పా ట్రీట్‌మెంట్‌లు, రెస్టారెంట్లు, బార్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

4

దక్కన్ ఒడిస్సీ

ప్యాలెస్ ఆన్ వీల్స్ త‌ర‌హాలో నిర్మించిన ఈ రైలు మహారాష్ట్ర పర్యాటకాన్నిపెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఇది ముంబై నుండి ప్రారంభమవుతుంది. రత్నగిరి, సింధుదుర్గ్, గోవా, ఔరంగాబాద్, అజంతా-ఎల్లోరా నాసిక్‌లతో పాటు ప‌ది ప్రసిద్ధ గమ్యస్థానాలను చుట్టేస్తుంది. ఇక‌, దీని ఛార్జీల గురించి చెప్పాలంటే, ఒక వ్యక్తి డీలక్స్ క్యాబిన్‌కు రూ. 4,76,869, ప్రెసిడెన్షియల్ సూట్‌కి రూ. 10,32,450 చెల్లించాల్సి ఉంటుంది.

More News

    Read more about: maharaja express rajasthan
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+