ఆంధ్రాలోని అత్యంత పురాతన దేవాలయాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవు. ఈ రాష్ర్టం తన చారిత్రక భవనాలు, విస్తృతమైన సాంస్కృతిక చరిత్రతో ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయమైన తిరుపతి ఈ రాష్ర్టంలోనే ఉంది. ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, ఎక్కడెక్కిడి వారో ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలు చాలావరకు విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో కట్టినవే. ఈ దేవాలయాల నిర్మాణంలో శిల్పశైలి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఈ రాష్ర్టంలో భక్తులు సందర్శించేందుకు చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వీరభద్ర దేవాలయం
ఈ ఆలయం దాని విస్తృతమైన కళాకృతికి, అందమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటైన నంది విగ్రహం అనంతపురంలోని ఈ ఆలయంలో ఉంది. ఈ ఆలయం శివుని ఉగ్ర అవతారమైన వీరభద్రునికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. విజయనగర శైలి శిల్పకళతో ఈ ఆలయాన్నిఅలంకరించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా కూడా పరిగణించబడింది.

శ్రీకాళహస్తి ఆలయం
కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు.

కనక దుర్గ గుడి
కనకదుర్గ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం విజయవాడలో వెలసింది. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రీ పర్వతం మీద ఈ ఆలయం ఉంది. విజయవాడ అనగానే మనకు కనకదుర్గమ్మ ఆలయం గుర్తుకొస్తుంది. అంతగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉన్న అమ్మవారి విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది.
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం
ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం కొండపై ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. ఈ ఆలయం చాళుక్య, చోళ, ఒడిషా నిర్మాణ శైలిని మిళితం చేస్తుంది. ఇది వరాహ నరసింహునిగా పూజించబడుతున్న విష్ణువుకు అంకితం చేయబడింది. గంగాధర, స్వామి పుష్కరిణి అనే రెండు ఆలయ ట్యాంకులను ఇక్కడ చూడొచ్చు. ఈ వరాహ నరసింహ ఆలయం పౌరాణిక, ధార్మిక, చారిత్రాత్మక నిర్మాణ ప్రాముఖ్యత పరంగా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం
ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీశైలం సమీపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం వెలసింది. విజయనగర రాజు హరిహర రాయ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇది అద్భుతమైన వాస్తుశిల్పం, అందంతో యాత్రికులను ఆకర్షిస్తుంది. శివుడిని పూజించినందుకు పార్వతి దేవి శిక్షించిన బృంగి మహర్షి విగ్రహం ఈ ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో నటరాజ, నంది సహస్రలింగ విగ్రహాలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications













