Search
  • Follow NativePlanet
Share
» »స‌మ్మ‌ర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే బెజ‌వాడ‌లోని ఈ స్పాట్స్ మీకోసం..!

స‌మ్మ‌ర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే బెజ‌వాడ‌లోని ఈ స్పాట్స్ మీకోసం..!

స‌మ్మ‌ర్ వ‌చ్చేసింది. ఇక పిల్ల‌ల‌కు, ఉద్యోగుల‌కు వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి త‌రుణంలో చాలామంది స‌మీపంలోని ప్ర‌దేశాల‌కు విహారయాత్ర‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. స‌మ్మ‌ర్ వెకేష‌న్‌కు ఇత‌ర రాష్ట్రాల‌కు, ఇత‌ర దేశాల‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎపీలోనే ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల‌తో పాటు పిక్నిక్‌స్పాట్స్ కూడా క‌ల‌వు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడవ అతిపెద్ద నగరంగా పేరుగాంచిన బెజ‌వాడ ప‌ర్యాట‌కుల‌కు ఓ చక్కని ప్రదేశమ‌ని చెప్పుకోవ‌చ్చు. విజ‌య‌వాడ నగరంలోనే కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాగ్రి కొండపై కొలువై ఉన్నారు. కృష్ణా జిల్లాలోని కృష్ణా నదికి ఒడ్డున కొలువైన విజయవాడ నగరంలో చూడ చక్కని ప్రదేశాలకు కొద‌వే లేదు. ఇక‌, ఈ వేస‌విలో ట్రిప్ ప్లాన్ చేసేవారికి ఇక్క‌డ సంద‌ర్శించేందుకు చాలా ప్ర‌దేశాలే ఉన్నాయి.

విజయవాడలోని ప‌ర్యాట‌క ప్రదేశాలు..

బెజ‌వాడ నగరంతో సహా దానికి చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాల్లో సైతం అనేక పర్యాటక ప్రదేశాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కొన్నింటిని పేర్కొనవచ్చు. అమరావతి, కనకదుర్గమ్మ ఆలయం, విక్టోరియా మ్యూజియం, ప్రకాశం బ్యారేజీ, గాంధీ కొండ, ఉండవల్లి గుహలు, మంగళగిరి నరసింహస్వామి ఆలయం, గుణదల మేరీమాత చర్చి, భవానీ ద్వీపం, తదితర ప్రదేశాలు పర్యాటకులకు ఓ చక్కని అనుభూతిని క‌లిగిస్తాయి.

amaravati1

భవానీ ద్వీపం

కృష్ణానదిలో ఉన్న అనేక ద్వీపాల్లో ఒకటిగా ఈ భవానీ ద్వీపం పేరుగాంచింది. ఇది విజయవాడ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంది. ఇక‌, ఈ ద్వీపంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ వారు నిర్మించిన ఓ రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ఒడిలో ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌నుకునేవారికి ఇది ఓ చక్కని విడిది ప్రదేశంగా చెప్ప‌వ‌చ్చు. ఈ భవానీ ద్వీపం పచ్చదనంతో నిండి ఉంటుంది. ఇక్క‌డ వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయి. ఈ స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో సంద‌ర్శించేందుకు ఇది ఒక చ‌క్క‌ని ప్ర‌దేశమ‌ని చెప్పొచ్చు. పిల్ల‌లు, కుటుంబంతోపాటు ఈ ప్ర‌దేశాన్ని వీక్షించొచ్చు.

అమరావతి

విజ‌య‌వాడ‌లోని అమరావతి స్థూపం చ‌రిత్ర ప్రియుల‌కు ఓ గొప్ప గ‌మ్య‌స్థానమ‌ని చెప్పుకోవాలి. విజయవాడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఓ చిన్న పట్టణమే అమరావతి. బౌద్ధ మ‌తానికి సంబంధించిన అనేక విశేషాలను అమరావతిలో మనం చూడొచ్చు. ఇక్కడ ఓ పురావస్తు మ్యూజియం కూడా ఉంది. ఇందులో బౌద్ధానికి సంబంధించి పురాతన వస్తువులను ఎన్నో దాగి ఉన్నాయి. వాటి గురించి కూడా ప‌ర్యాట‌కులు క్షుణ్నంగా తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది.

undavallicaves1

ఉండవల్లి గుహలు

విజయవాడ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఈ గుహాలయాలు క్రీస్తుశ‌కం 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవిగా గుర్తించారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించడం జ‌రిగింది. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏక శిలా 'అనంత పద్మనాభ స్వామి' విగ్రహం ఉంది. ఇది ఇక్క‌డికి వ‌చ్చిన చూపరులను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. దేవతా మూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి.

kondapallifort1

కొండపల్లి కోట

ఓ చిన్న డ్రైవ్‌కు వెళ్లాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా విజయవాడ నుండి కొండ‌ప‌ల్లి కోట‌కు వెళ్లొచ్చు. కొండపల్లి కోట దాని పురాతన వాస్తుశిల్పం మరియు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల విశాల దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం. స‌మ్మ‌ర్‌లో ట్రిప్‌కు ఈ ప్ర‌దేశం ఎంతో అనువైన‌ది. మ‌రెందుకాల్యం మీరు కూడా ఇక మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రీ.

More News

    Read more about: vijayawada andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+