Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు ఇవే..!

దేశంలోని అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు ఇవే..!

దేశంలోని అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు ఇవే..!

శివుడి ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదని పరమేశ్వరుడి భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ముక్కంటి అనుగ్రహం కోసం నిత్యపూజలు చేస్తుంటారు. బోళా శంకరుడి కృపకు పాత్రులు అయ్యేందుకు అనునిత్యం తపిస్తుంటారు. సాధారణంగా శివాలయాల్లో ఆ ఆదిదేవుని విగ్రహాల ఎత్తు మామూలుగానే ఉంటుంది. కానీ.. తలెత్తి చూసేంత భారీ ఎత్తైన శివుడి విగ్రహాలను చూసిన‌ప్పుడు భక్తుల్లో సంతోషం ఎంత ఉప్పొంగుతుందో కదా! ఇప్పటివరకు చూసిన శివుని విగ్రహలలో ఏది ఎత్తైనదో తెలుసా! ఇప్పుడు దేశంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహాల గురించి తెలుసుకుందాం ప‌దండి.

మురుడేశ్వరి శివ విగ్రహం (కర్ణాటక)

కర్ణాటకలోని మురుడేశ్వరి శివుని విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం. ఇక్కడ శివుడు ఆధ్యాత్మిక సాధన చేస్తూ కనిపిస్తాడు. 123 అడుగుల (37 మీట‌ర్ల‌) పొడవైన విగ్రహాన్ని శివమొగ్గకు చెందిన కాశీనాథుడు మరియు అనేక ఇతర శిల్పులు చెక్కారు. అరేబియా సముద్ర ఒడ్డున ఈ విగ్రహం ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం. 237 అడుగుల ఎత్తైన ఆలయ గోపుర భారతదేశంలో 2వ ఎత్తైనది.

1

ఆదియోగి శివ విగ్రహం (తమిళనాడు)

తమిళనాడులో ఉన్న ఆదియోగి శివుడి విగ్రహం దేశంలోనే అతిపెద్దది. కోయంబత్తూరులో ఉన్న ఈ విగ్రహం పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చేరింది. 112 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం బరువు దాదాపు 500 టన్నులు. ఇక్కడ కళ్ళు మూసుకున్న శివుని సగం విగ్రహం ఉంది. ఈ విగ్ర‌హాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఇది ప్రపంచంలోని "అతిపెద్ద ప్రతిమా శిల్పం" తల, భుజాలు, ఛాతి మాత్రమే కలిగిన శిల్పంగా ప్ర‌సిద్ధి చెందింది.

2

నామ్చి శివ విగ్రహం (సిక్కిం)

సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లోని నామ్చి శివ విగ్రహం భారతదేశంలోని అతిపెద్ద శివ విగ్రహాలలో ఒకటి. గాంగ్టక్ నుండి 92 కిలోమీట‌ర్ల దూరంలో ఈ విగ్ర‌హం ఉంది. ఈ విగ్రహం నామ్చి పట్టణంలోని కొండపై ఉన్న ఆలయంలో తయారు చేయబడింది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా వర్ణించబడ్డాయి. ఈ 108 అడుగుల ఎత్తైన శివ విగ్రహాన్ని సిద్ధేశ్వర్ ధామ్, కిరాతేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు.

3

హర్ కి పౌరి, హరిద్వార్ (ఉత్తరాఖండ్)

హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున హర్ కీ పౌరి సమీపంలో శివుని మరొక భారీ విగ్రహం ఉంది. గంగానది ఒడ్డున నిర్మించిన ఈ నిలువెత్తు విగ్రహం చాలా దూరం నుండి ప‌ర్యాట‌కుల‌ను, భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తుంది. ఈ భారీ విగ్రహం స్వామి వివేకానంద పార్కులో ఉంది. ఇది100 అడుగుల ఎత్తు ఉంటుంది.

4

మంగళ్ మహాదేవ్ విగ్రహం, హర్యానా

హర్యానాలో మంగళ్ మహాదేవ్ అనే భారీ దేవుని విగ్రహం ఉంది. దీని ఎత్తు దాదాపు 101 అడుగులు. మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ బిర్లాచే స్థాపించబడిన శ్రీ శివ ఉద్యానవనం. ఈ విగ్ర‌హం పార్వతి దేవి, కార్తికేయ, నంది ఎద్దు, రాముడు మరియు సీత, రాధా - కృష్ణ, గణేష్ వంటి ఇతర దేవతలకు ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహాలన్నీ విశాలమైనవి, కాంస్యంతో తయారు చేయబడ్డాయి. దీని కారణంగా ఆలయం చాలా అందంగా మరియు అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయంలోని భారీ శివుని విగ్రహం NH-8 నుండి ప‌ర్యాట‌కులు వీక్షించే విధంగా ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+