Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్ష‌కాలంలో వీకెండ్ ట్రిప్‌కు ఈ ప్రాంతాలు ఉత్తమం..

వ‌ర్ష‌కాలంలో వీకెండ్ ట్రిప్‌కు ఈ ప్రాంతాలు ఉత్తమం..

వ‌ర్ష‌కాలంలో వీకెండ్ ట్రిప్‌కు ఈ ప్రాంతాలు ఉత్తమం..

వర్షాకాలం రానే వ‌చ్చింది. మండే ఎండ‌ల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో చాలామంది ప్రజలు విహారాయాత్ర‌ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంటారు. ఇక ఉద్యోగ‌స్థ‌లయితే రెండురోజులు సెలువు దొరికితే కాస్త ప్ర‌శాంతంగా గ‌డిపేందుకు ఈ బిజి లైఫ్ నుంచి కొంత విరామం పొందేందుకు ఎక్క‌డికైనా వెళ్లాల‌నుకుంటారు. అలాంటి వారికోసం ఢిల్లీలోని ఈ ప్రాంతాలు ఉత్త‌మం. మీ రెండుమూడు రోజులు వీకెండ్ ట్రిప్‌ను మ‌రింత ఆహ్ల‌ద‌భ‌రితంగా మార్చేలా చేస్తాయి ఇక్క‌డి ప్ర‌దేశాలు. ఈ వ‌ర్షాకాలంలో వీకెండ్ ట్రిప్ అంటే చాలామంది ఇష్ట‌ప‌డ‌తారు. ఎందుకంటే చిరుజ‌ల్లులో త‌డుస్తూ ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో సేద‌తీరాల‌ని ఎవ‌రికుండదు చెప్పండి. మ‌రెందుకాల‌స్యం ఢిల్లీలోని ఈ ప్రాంతాల‌కు కుటుంబ‌స‌భ్యుల‌తో, స్నేహితుల‌తో క‌లిసి వీకెండ్ ట్రిప్‌కు బ‌య‌లుదేరండి మ‌రి.

1

తిజారా కోట

వ‌ర్ష‌కాలంలో వీకెండ్ ట్రిప్‌ను ఆస్వాదించాల‌నుకునేవారి కోసం ఢిల్లీలోని తిజారా కోట ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. ఎత్తైన కొండపై ఉన్న ఈ కోట నుండి చూస్తే అద్భుతమైన, అందమైన దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తాయి. 8వ శతాబ్దం చివరలో నిర్మించబడిన ఈ కోట రాజ్‌పుత్, ఆఫ్ఘన్ వాస్తుశిల్పాల మిశ్రమం. ప్రస్తుతం ఈ ప్రదేశం హెరిటేజ్ హోటల్‌గా మార్చబడింది. ఈ కోట ఢిల్లీ నుండి దాదాపు 114 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఈ కోటను అల్వార్ రాజు మహారాజా భక్తవర్ సింగ్ రూపొందించారు. అతని మరణం అనంత‌రం అతని కుమారుడు మహారాజా బల్వంత్ సింగ్ 1835లో ఈ కోట-ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే మహారాజా బల్వంత్ సింగ్ అకాల మరణం, వారసుడు లేకపోవడంతో ఈ నిర్మాణం పూర్తి కాలేదు. తిజారా ఫోర్ట్ ప్యాలెస్‌లో పని ఆకస్మికంగా నిలిపివేయడం వల్ల ఆ మైదానం అంతా రాళ్ల‌తో నిండిపోయి ఉంటుంది.

2

దామ్‌దామా సరస్సు

ఈ వర్షాకాలంలో వీకెండ్ ట్రిప్‌లో ఎంజాయ్ చేయాల‌నుకునేవారు న‌దీ ప్రాంతంలో కానీ సరస్సులోని కానీ సమయం గ‌డ‌పాల‌నుకుంటారు. ఈ వర్షాకాలంలో అలాంటి అందమైన దృశ్యాలను ఆస్వాదించాలనుకుంటే మాత్రం ఢిల్లీ సమీపంలోని దామ్‌దామా సరస్సుకి ప్రయాణాన్ని మ‌రల్చండి. ఆరావళి కొండలలో ఉన్న ఈ సరస్సు దాని అందంతో ప‌ర్యాట‌కుల హృదయాన్ని గెలుచుకుంటుంది. ఈ సరస్సు ఢిల్లీ నుండి దాదాపు 58 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

సోహ్నా

ఢిల్లీ చుట్టూ ఉన్న హిల్ స్టేషన్‌ల‌ను ఈ వ‌ర్ష‌కాలంలో సంద‌ర్శించాల‌నుకుంటే మాత్రం సోహ్నా ఎంతో అంద‌మైన ప్ర‌దేశ‌మ‌ని చెప్పొచ్చు.చిన్న, పెద్ద పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం ప‌ర్యాట‌కులను వాటి అందాల‌తో క‌ట్టిప‌డేస్తుంది. ఢిల్లీ నుండి సోహ్నా వరకు దాదాపు 61 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతంలో అందమైన దృశ్యాలను ఆస్వాదించడంతో పాటు, సాహస కార్యకలాపాలను కూడా ప్రయ‌త్నించొచ్చు.

నుహ్

నుహ్ గురుగ్రామ్ నుండి కొద్ది దూరంలో ఉన్న ఓ అంద‌మైన గ్రామం. రోజువారీ రద్దీకి దూరంగా, బిజిలైఫ్‌కు దూరంగా ఉండే ఈ ప్రాంతం ప‌ర్యాట‌కులకు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణాన్ని చేకురూస్తుంది. ఈ వీకెండ్ ట్రిప్‌ను కుటుంబంతో క‌లిసి స‌రాదాగా గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం ఢిల్లీలోని ఈప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే..

నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్

రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్ వీకెండ్ ట్రిప్‌కు వెళ్లేందుకు మంచి ప్రదేశం. ఢిల్లీ నుండి దాదాపు 2 గంటల ప్రయాణంలో ఉన్న ఈ ప్యాలెస్‌లోజిప్-లైనింగ్ వంటి సాహ‌స కార్యకలాపాలు చేయొచ్చు. అక్క‌డి అందమైన దృశ్యాలను ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం కూడా ల‌భిస్తుంది. మ‌రెందుకాల‌స్యం ఇక వీకెండ్ ట్రిప్‌కు మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

More News

Read more about: tijara fort damdama lake
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+