Search
  • Follow NativePlanet
Share
» »ఎత్త‌యిన కొండ‌ల‌కు నిల‌యాలు.. ఈ ప్రాంతాలు..

ఎత్త‌యిన కొండ‌ల‌కు నిల‌యాలు.. ఈ ప్రాంతాలు..

ఎత్త‌యిన కొండ‌ల‌కు నిల‌యాలు.. ఈ ప్రాంతాలు..

హిల్‌స్టేష‌న్‌ల‌ను సంద‌ర్శించాల‌ని చాలామంది అనుకుంటుంటారు. కానీ, ఏ ప్రాంత హిల్‌స్టేష్ల‌న్ల‌ను సందర్శించాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతుంటారు. రెండు మూడు రోజుల వీకెండ్ ట్రిప్‌లో స‌ర‌దాగా గడపాల‌ని అనుకుంటే మాత్రం త్ప‌కుండా ల‌క్నోలోని ఈ ఈ హిల్‌స్టేష‌న్ల‌ను సంద‌ర్శంచాల్సిందే. ఎక్కువ దూరం, ఎక్కువ సమయం ప్రయాణం చేయకూడదనుకుంటే మాత్రం ల‌క్నోకు స‌మీపంలోని ఈ హిల్ స్టేషన్‌లు ఎంచుకోవ‌డం ఉత్త‌మం.

కుటుంబ స్నేహితులు, భాగస్వాములు, బంధువుల‌తో స‌రదాగా గ‌డిపేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవ‌చ్చు. లక్నోలో నివసిస్తుంటే చుట్టుపక్కల ప్రాంతాల‌ను సందర్శించాల‌ని అనుకున్న‌ట్ల‌యితే మాత్రం ఈ హిల్‌స్టేష‌న్‌ల‌ను మ‌ర‌వొద్దు. వేసవిలో లక్నోలో ఇటువంటి చల్లని ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు త‌గ్గ‌లేదు. అటువంటి వారు చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌కోసం వెతుకుతున్న‌ట్ల‌యితే ల‌క్నోలోని ఈ హిల్‌స్టేషన్లు ఉత్త‌మం. మ‌రెందుకాల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి

1

పిథోరఘ‌ర్

పితోర్‌ఘర్‌ను లిటిల్ కాశ్మీర్ అని కూడా అంటారు. ఇది లక్నో నుండి దాదాపు 446 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఎత్త‌యిన కొండ‌లు, ఇక్క‌డి పర్వతాల అందమైన దృశ్యాల‌ను కెమెరాల్లో బంధించ‌వ‌చ్చు. కైలాష్ ఆశ్రమం, చందక్ రిజర్వ్ ఫారెస్ట్, మోస్ట్మను ఆలయం, కామాఖ్య ఆలయం, మహారాజ్కే ఆలయం, కపిలేశ్వర్ మహాదేవ్ ఆలయం, థాల్కేదార్ ఆలయం, అస్కోట్ వన్యప్రాణుల అభయారణ్యం, పిథోరఘర్ కోట, లండన్ కోట వంటి అనేక ప్ర‌దేశాలు ఇక్క‌డ తార‌స‌ప‌డ‌తాయి.

2

పాంగోట్

లక్నో నుండి పాంగోట్‌ను చేరుకోవాలంటే సుమారు నాలుగువంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే కాకుండా, వెకేషన్‌ను సరదాగా, గుర్తుండిపోయేలా చేస్తాయి. దట్టమైన అడవులు, ప‌క్షులు కిలకిలారావాలు, నెమ‌ళ్ల నాట్యాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్‌లకు ఈ ప్రదేశం ఎంతో ఉత్తమమైనది. పాంగోట్‌లో వాతావరణం చాలా వరకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి రావడం ద్వారా మీరు ట్రెక్కింగ్‌పై కూడా అభిరుచిని పెంచుకోవ‌చ్చు.

3

చిత్రకూట్

లక్నో నుండి సుమారు 231 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చిత్రకూట్ రెండు మూడు రోజుల వీకెండ్ ట్రిప్‌కు ఎంతో ఉత్త‌మం. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం గడిపింది ఈ చిత్రకూట్‌లోనే అని ఇక్క‌డి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. ఇక్కడ నుండి వింధ్య పర్వతాల అందమైన దృశ్యాన్ని చూడొచ్చు. అంతే, కాకుండా, రామ్‌ఘాట్, హనుమాన్ ధార, కామద్‌గిరి ఆలయం, స్ఫటిక్ శిలా, గుప్త గోదావరి గుహలను చూసే అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి.

4

చంపావత్

చంపావత్ ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో ఉన్న చాలా పురాతనమైన మరియు అందమైన నగరం. ఇది లక్నో నుండి కేవలం 286 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఏడాది పొడువునా సంద్శ‌రించేందుకు అనువుగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం వేసవిలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చంపవత్ విష్ణువు యొక్క 'తాబేలు అవతారం' అని నమ్ముతారు. చంపావత్‌లో చాలా దేవాలయాలు ఉన్నాయి. క్రాంతీశ్వర్, ఘాట్కు, బాలేశ్వర్, నాగనాథ్ ఆలయంతో పాటు, అద్వైత ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ అనేక సందర్శనా స్థలాలను ఆస్వాదించవచ్చు. ట్రెక్కింగ్, ప్రకృతి, బైక్ ప్రియులు ఇలా అన్ని రకాల ప్రేమికులకు ఇది స్వ‌ర్గ‌ధామ‌మ‌నే చెప్పాలి.

More News

    Read more about: pithoragarh pangot
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+