Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పితోర్ గర్

పితోర్ గర్ - హిమాలయాల ప్రవేశ ద్వారం !

17

పితోర్ గర్ ఉత్తరాఖండ్ లోని ఒక జిల్లా. ఈ ప్రాంతం గొప్పవైన హిమాలయ పర్వత శ్రేణుల ప్రవేశానికి ఒక ప్రవేశ ద్వారంగా వుంటుంది. ఈ ప్రదేశం అందమైన సాయర్ వాలీలో కలదు. దీనికి ఉత్తరాన ఆల్మోరా జిల్లా సరిహద్దుగా కలదు. పొరుగున తూర్పులో కల నేపాల్ దేశాన్ని ఈ భూభాగం తో కాళీనది విభజిస్తుంది.

ఈ ప్రాంతాన్ని పాల్ మరియు చాంద్ వంశాలు పాలించినపుడు ఇక్కడ అనేక టెంపుల్స్, కోటలు కట్టించారు. 15 వ శతాబ్దం లో కొద్ది కాలం ఈ ప్రాంతం బ్రహ్మ రాజుల పాలనలో వుండేది. తర్వాత చాంద్ వంశం వశ పరచుకొని బ్రిటిష్ వారు వచ్చే వరకూ పాలించినది. ఇక్కడ ప్రజలు కుమావొన్ భాష మాట్లాడతారు. ఈ ప్రాంతం సున్నపు రాయి, రాగి, మెగ్నీషియం, మరియు స్లాటే వంటి సహజ వనరులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం చుట్టూ పచ్చటి కాని ఫెరస్, సాల్, చిర, ఓక్ చెట్ల అడవులు కలవు. ఈ ప్రాంతం హిమాలయాలలో తిరిగే వివిధ జంతువులుకు ప్రసిద్ధి. అనేక పక్షులు, పాము జాతులు కూడా కలవు.

అనేక చర్చిలు , మిషన్ స్కూల్స్, మరియు భవనాలు బ్రిటిష్ పాలనలో కట్టినవి కలవు. పితోర్ ఘర్ ఔత్సాహిక సందర్శకులు ఇక్కడకల శివుడి మహాదేవ టెంపుల్, తప్పక దర్శించాలి. జానపదుల మేరకు, ప్రసిద్ధి రుషి కపిలుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసాడని చెపుతారు. శివరాత్రి వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో ఈ టెంపుల్ సందర్శిస్తారు.

సందర్శకులు పితోర్ గర్ కు దక్షిణంగా 8 కి.మీ.ల దూరంలో కల మరొక టెంపుల్ కూడా చూడవచ్చు. పితోరగర్ నుండి 20 కి.మీ.ల దూరంలో అందమైన ఆశుర్ చూలా అనే ఒక బర్డ్ సాన్క్చురి కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 5412 అడుగుల ఎత్తున కలదు. మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అంటే అది మున్ష్యారి ప్రదేశం. ఇది జోహార్ ప్రాంతానికి ఒక గేటు వే గా వుంటుంది. ఈ గేటు వే మిల్లం, నామిక్ మరియు రాళం మంచు పర్వతాలకు దోవ తీస్తుంది. పితోర్ గర్ కోటను గూర్ఖాలు 1789లో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత నిర్మించారు. టూరిస్టులు అస్కాట్ మస్క్ డీర్ సంక్చురిని కూడా చూడవచ్చు. ఈ సంక్చురి పర్యాటకులకు వివిధ రకాల జంతువులు అంటే చిరుత, జంగల్ కాట్, సివెట్ కాట్, బార్కింగ్ డీర్, సెరో, గోరల్, బ్రౌన్ బేర్ స్నో లెపర్డ్ లు, కస్తూరి జింక, హిమాలయ బ్లాకు బేర్, మరియు భరల్ వంటి వాటిని చూడవచ్చు.

వన్య జంతువులే కాక ఇక్కడ మీరు అనేక రకాల పక్షులను, మంచు కోడి, మొనల్స్, నెమల్లు, చకోరాలు వంటి వాటిని కూడా చూడవచ్చు. జుల్ జి బి అనేది మరొక టూరిస్ట్ ప్రదేశం ఇది పితోర గర్ టవున్ కు 68 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ప్రదేశంలో రెండు నదులు అంటే గోరి మరియు కాలి నదులు కలుస్తాయి. మకర సంక్రాంతి రోజున ఇక్కడ గొప్ప ఉత్సవం జరుపుతారు. స్థానికుల మేరకు ఈ ఉత్సవం మొదటగా 1914 సంవత్సరం నవంబర్ లో జరిపారు.

పితోర్ గర్ టవున్ నుండి 4 కి.మీ.ల దూరంలో నకులేశ్వర్ టెంపుల్ కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన దైవం శివుడు. ఈ టెంపుల్ ఖజురాహో శిల్పశైలిలో నిర్మించారు. అర్జునేస్వర్ టెంపుల్, చండక్, మోస్తమను టెంపుల్, ద్వాజ్ టెంపుల్, కోట్ గారి దేవి టెంపుల్, దిది హాట్, నారాయణ్ ఆశ్రమం, జూలా ఘాట్ వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షణలు. ఈ ప్రదేశం స్కీయింగ్, హాంగ్ గ్లైడింగ్, పారా గ్లైడింగ్ వంటి సాహస క్రీడలకు కూడా ప్రసిద్ధి. టూరిస్టులు వాయు, రైలు, రోడ్ మార్గాలలో ఇక్కడకు చేరవచ్చు. పితోర్ గర్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్. తానాక్ పూర్ రైలు స్టేషన్ సమీప రైలు స్టేషన్.

పితోర్ గర్ సందర్సన కోరే వారు ఈ ప్రదేశానికి వేసవుల లోనే ప్రణాళిక చేయాలి. ఈ సమయంలో మాత్రమే వారు వాతావరణపరంగా సౌకర్యం భావించ గలరు.

పితోర్ గర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పితోర్ గర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పితోర్ గర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పితోర్ గర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం పర్యాటకులు పితోర్ ఘర్ ప్రదేశాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులలో వివిధ ప్రాంతాల నుండి అంటే కాథ్ గోదాం, ఆల్మోరా, హాల్ద్వానిల నుండి కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పితోర్ గర్ నుండి 150 కి. మీ. ల దూరంలో కల తానాక్ పూర్ రైలు స్టేషన్ నుండి నార్త్ ఇండియా లోని ప్రధాన నగరాలకు చేరవచ్చు. ఈ రైలు స్టేషన్ నుండి టాక్సీలు దొరుకుతాయి. పితోర్ గర్ నుండి 217 కి.మీ.ల దూరంలో కల కాథ్ గోదాం రైలు స్టేషన్ నుండి కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పితోర్ ఘర్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. సుమారు 250 కి. మీ.ల దూరంలో వుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లు లభ్యం గా వుంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue