Search
  • Follow NativePlanet
Share
» »మ‌ధుర‌లోని ఈ హోట‌ల్స్ అత్యంత చౌక ధ‌ర‌ల‌కే..!

మ‌ధుర‌లోని ఈ హోట‌ల్స్ అత్యంత చౌక ధ‌ర‌ల‌కే..!

మ‌ధుర‌లోని ఈ హోట‌ల్స్ అత్యంత చౌక ధ‌ర‌ల‌కే..!

ఉత్తరప్రదేశ్‌లోని మధుర నగరం దేశ ప్రజలలోనే కాకుండా విదేశీయులలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కోసం ప్రజలు నిత్యం ఇక్క‌డికి రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఇక‌, కృష్ణ జన్మాష్టమి రోజున అయితే వేలాది మంది భక్తులు కృష్ణుని ద‌ర్శ‌నం కోసం బారులు తీరుతారు. అటువంటి ర‌ద్దీ స‌మ‌యంలో భ‌క్తులు ఇక్క‌డ బ‌స చేసేందుకు హోటళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా హోటళ్లలో గదుల ధరలు కూడా ఒక్క‌సారే అమాంతం పెరిగేస్తాయి. అయితే, మ‌ధురలో అత్యంత చౌక‌గా దొరికే హోట‌ల్స్ కూడా ఈ మ‌ధ్య‌కాలంలో అందుబాటులోకి వ‌చ్చాయి. అందులో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప‌దండి, మథురలోని చౌక‌గా, సుల‌భంగా అందుబాటులో ఉండే కొన్ని ధర్మశాలల గురించి తెలుసుకుందాం.

1

మధురలోని రాధే శ్యామ్ గెస్ట్ హౌస్‌

మధురలో విడిది చేసేందుకు రాధే శ్యామ్ అతిథి భవన్ అత్యుత్తమ, ఉత్తమమైన ప్రదేశం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌నుంచి సుమారు ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ హోట‌ల్‌ 550 రూపాయ‌లు చెల్లించి రూమ్‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ఈ హోటల్‌లో AC గదుల సౌకర్యం కూడా పొందొచ్చు. ఎసి గదులు అవ‌స‌రం లేద‌నుకుంటే నాన్-AC గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏసీ గది అద్దె కాస్త ఎక్కువే ఉంటుంది. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్ల‌లో కావ‌ల‌సిన రుచిక‌ర‌మైన వంటకాలను ఆస్వాదించవచ్చు.

2

బాలాజీ ఆశ్రమం మధుర

మధురలో బ‌స చేసేందుకు అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే దొరికే హోట‌ల్స్‌ను వెతుకుతున్నారా? అయితే మ‌ధుర‌లోని బాలాజీ ఆశ్ర‌మం అందుకు మంచి ఎంపిక‌. ఈ ఆశ్ర‌మం ఒక‌మినిసైజ్ హోట‌ల్‌లా ఉంటుంది. ఇక్క‌డ కేవ‌లం 200 నుండి 300 రూపాయలతో గది బుకింగ్ చేసుకోవచ్చు. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే అన్నీ సౌక‌ర్యాలను అందించే ఆశ్ర‌మాలు మధుర‌లో చాలానే ఉన్నాయి. ఈ ఆశ్ర‌మం కేవ‌లం బ‌స చేసే వెసులుబాటును మాత్ర‌మే క‌ల్పిస్తుంది. టిఫిన్‌, బోజ‌నం లాంట‌వ‌న్నీ బ‌య‌టికి వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.

3

ముస్కాన్ గెస్ట్ హౌస్

ముస్కాన్ గెస్ట్ హౌస్ మథుర రైల్వేస్టేష‌న్ స‌మీపంలో అత్యంత తక్కువ ధ‌ర‌కే ల‌భించే ఉత్తమమైన ప్రదేశం. ఇందులో సుమారు 400 గదులు ఉంటాయి. మథుర రైల్వే స్టేషన్ నుండి మధుర, బృందావన్ లకు సులభంగా టాక్సీ లేదా క్యాబ్‌లో వెళ్లొచ్చు.

మధుసూదన్ కృపా ధర్మశాల

మధురలోని ప్రసిద్ధ ద్వారకాధీష్ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మధుసూదన్ కృపా ధర్మశాల బస చేయడానికి ఉత్తమమైన ప్రదేశం. ఈ ప్రసిద్ధ ధర్మశాలలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌లిపి సుమారు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురిక‌యితే నాన్ AC కోసం సుమారు 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. AC గదికి 1200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫుడ్‌ను కూడా డోర్ డెలివ‌రీ చేసే వెసులుబాటును ఈ ధ‌ర్మ‌శాల క‌ల్పిస్తుంది.

మిస్టర్ తిలకద్వార్ అగర్వాల్ ధర్మశాల

శ్రీ తిలకద్వార్ అగర్వాల్ ధర్మశాల హోలీ గేట్ బస్టాండ్ నుండి కేవలం 0.6 కిలోమీట‌ర్ల దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 3.5 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల కోసం నాన్ AC, AC గదుల పూర్తి ఏర్పాటు కూడా ఉంది. అంతేకాదు, ఇక్క‌డ రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను కూడా ఆస్వాదించొచ్చు. ఈ ధర్మశాల ఇందిరా గాంధీ విమానాశ్రయానికి 173 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+