Search
  • Follow NativePlanet
Share
» »అంద‌మైన స‌ర‌స్సుల‌కు నిల‌యాలు... ఉత్త‌రాఖండ్‌లోని ఈ ప్ర‌దేశాలు..

అంద‌మైన స‌ర‌స్సుల‌కు నిల‌యాలు... ఉత్త‌రాఖండ్‌లోని ఈ ప్ర‌దేశాలు..

ఉత్తరాఖండ్ సంస్కృతి సంప్రదాయాల‌కు, ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్క‌డ అంద‌మైన లోయ‌లు సంద‌ర్శించేందుకు ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు, అందమైన జలపాతాలు, గాలికి అనుగుణంగా ఉండే నదులు, ప్రకృతి మధ్య సరస్సులు మానవ మనస్సును ఇట్టే ఆకర్షిస్తాయి. ఉత్తరాఖండ్‌ను అందంగా మార్చే పర్వతాలు మాత్రమే కాకుండా ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆకర్షించే కొన్ని సరస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సరస్సులను ఇక్కడ తాల్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక్క స‌రస్సు మాత్ర‌మే కాదు. 10 కంటే ఎక్కువ స‌ర‌స్సులే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని కుమావోన్, గర్వాల్ ప్రాంతంలో చాలా స‌ర‌స్సులున్నాయి. అందుద‌లోని కొన్ని ప్ర‌త్యేక స‌ర‌స్సుల గురించి తెలుసుకుందాం.

nainilaketour

నైని సరస్సు

అన్ని వైపులా సరస్సులతో చుట్టుముట్టబడి ఉండ‌డ‌వ‌ల్ల దీనిని భారతదేశంలోని లేక్ డిస్ట్రిక్ట్ అని పిలుస్తుంటారు. 'నైని' అనే పదానికి కళ్ళు, 'తాల్' అంటే సరస్సు అని అర్థం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సరస్సుల నగరం నైనిటాల్ చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అందమైన సరస్సులో బోటింగ్‌ను ఆస్వాదించడానికి లక్షలాది మంది దేశ విదేశాల నుంచి త‌ర‌లి వస్తుంటారు. ఇక్క‌డి సరస్సులో స‌మీపంలోని పర్వతాల అందమైన దృశ్యాల‌ను చూడొచ్చు. ఇక్క‌డ‌ రాత్రిపూట, చుట్టూ లైట్లు ఉండ‌డం వ‌ల్ల ఈ ప్రాంతంపు అందం మ‌రింత రెట్టింప‌వుతుంది.

bhimtallake1

భీమ్‌తాల్ సరస్సు

భీమ్‌తాల్ సరస్సు ఒక ఉపనది స‌ర‌స్సు. ఇది ఉత్తరాంచల్‌లోని కత్‌గోడంకు ఉత్తరాన 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. దీని పొడవు 1674 మీటర్లు, వెడల్పు 447 మీటర్లు, లోతు 15 నుండి 50 మీటర్ల వరకు ఉంటుంది. ఇది నైనిటాల్ కంటే పెద్ద సరస్సు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భీమ్‌తాల్ సరస్సు ఉంటుంది. భీమాకర్‌గా ఉన్నందున ఈ చెరువును భీమ్‌తాల్ అని పిలుస్తుంటారు. కానీ కొంతమంది ఈ స‌ర‌స్సును పాండు కొడుకు భీమునికి సంబంధించినది అని అంటుంటారు.

sattaltravel1

సత్తాల్

నైనిటాల్ నుండి సుమారు 23 కిలోమీట‌ర్ల దూరంలో సత్తాల్ ప్రాంతం ఉంది. ఇది భీమ్టాల్ నుండి 3 కిలోమీట‌ర్ల నడక దూరంలో, సముద్ర మట్టానికి 1370 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సత్తాల్ ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదేశమ‌ని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో ఏడు సరస్సుల సమూహం ఉంటుంది. వాటిలో కొన్ని ఇప్పుడు అంతరించిపోయాయి. ఈ సరస్సు సహజ సౌందర్యానికి ఎంతో పేరుగాంచింది. ఇది మానవ కళకు కూడా ప్రసిద్ధి చెందింది. కుమావూన్ ప్రాంతంలోని అన్ని చెరువులలో ఈ చెరువు అత్యుత్తమమైనది కావడానికి ఇదే కారణం.

ఖుర్పతాల్

ఖుర్పతాల్ నైనిటాల్ నుండి సుమారు 12 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ర‌స్సు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఖుర్పాటల్ ఆకారం గుర్రం డెక్కను పోలి ఉంటుంది. కాబట్టి ఖుర్పాటల్ అని పేరును ఈ స‌ర‌స్సుకు పెట్ట‌డం జ‌రిగింది. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ నేటికీ ఈ సరస్సు నిర్మాణం అలాగే ఉంది. ఆల్గే గింజలు ఏర్పడిన వెంటనే, సరస్సు దాని రంగును మార్చడం ప్రారంభిస్తుంది. ఇదే ఈ సరస్సు ప్రత్యేత‌.

మస్సార్ చెరువు

గర్హ్వాల్ ప్రాంతంలోని విభిన్న‌మైన సరస్సులలో మ‌స్సార్ చెరువు ఒకటి. ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతం ఆల్పైన్ పచ్చని పచ్చిక బయళ్లను కలిగి ఉంటుంది. దీనిని స్థానిక భాషలో 'బుగ్యాల్' అని కూడా అంటారు. ఈ గడ్డి భూములు వివిధ రకాల వృక్షాలతో కప్పబడి ఉంటాయి. వాటిపై చెప్పులు లేకుండా నడవడం వ‌ల్ల మేఘాలు ప్రవహిస్తున్నాయోమో అనే భావ‌న ప‌ర్యాట‌కుల‌లో క‌లుగుతుంది.

నౌకుచియాటల్

నౌకుచియాటల్ ఒక చిన్న సరస్సుక‌లిగిన గ్రామం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉంటుంది. ఈ సుందరమైన పర్యాటక ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1219 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సు అందం, ఇక్కడ జరిగే సాహస కార్యకలాపాలు నౌకుచియాటల్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేలా తోడ్ప‌డ్డాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+