Search
  • Follow NativePlanet
Share
» »విలాస‌వంతాల‌కు మారుపేరు వైజాగ్‌లోని ఈ రిసార్ట్‌లు..

విలాస‌వంతాల‌కు మారుపేరు వైజాగ్‌లోని ఈ రిసార్ట్‌లు..

విలాస‌వంతాల‌కు మారుపేరు వైజాగ్‌లోని ఈ రిసార్ట్‌లు..

వేస‌వి సెల‌వులు మొద‌లుయ్యాయి. పిల్ల‌ల అల్ల‌రితో ప్ర‌తి ఇంట్లో సంద‌డి నెల‌కొని ఉంటుంది. ఈ స‌మ‌యంలో స‌ర‌దాగా పిల్ల‌ల‌తో క‌లిసి విహారాయాత్ర‌కు వెళ్లాల‌ని చాలామంది ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంటారు. మ‌రికొందరేమో రెండుమూడు రోజులు అక్క‌డే ఉండేందుకు రిసార్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మ‌రెందుకాల‌స్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో అలాంటి రిసార్టలే ఉన్నాయి. ఈ రిసార్ట్‌లో పిల్ల‌ల‌తో క‌లిసి స‌రాదాగా అక్క‌డ గ‌డ‌పొచ్చు. ఈ బిజిలైఫ్‌లో కొన్నిరోజులు ప్ర‌శాంతంగా మీ కుటుంబంతో గ‌డిపేందుకు ఈ రిసార్ట్‌లు ఉత్త‌మ‌మైన‌వి.

bayleafresort1

బే లీఫ్ రిసార్ట్

విశాఖ‌ప‌ట్నంలోని సాగర్ నగర్‌లోని బే లీఫ్ రిసార్ట్ అత్యంత ప్ర‌సిద్ధి చెందింది. ఈ రిసార్ట్ అత్యంత‌ సౌకర్యవంతమైంది అంతేకాకుండా ఇందులో ఎయిర్ కండీష‌న్డ్ స‌దుపాయాలు కూడా ఉన్నాయి. ఇందులో బీచ్ ఫెసింగ్ కాటేజ్ గ‌దులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రిసార్ట్‌లో ఆయుర్వేద స్పా కూడా క‌లిగి ఉంది. ఈ ఆయుర్వేద స్పాతో మీరుకొంత ప్ర‌శాంత‌త‌ను పొందొచ్చు. ఈ రిసార్ట్ చుట్టూ కొబ్బ‌రి చెట్లు ఉంటాయి. ఇది స‌ముద్రానికి ఎదురుగా ఉండ‌డంతో ఇంకా ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం చ‌ల్ల‌ని స‌ముద్ర‌పు గాలి మిమ్మ‌ల్ని మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళుతుంది.

స్థానం: ఓషన్ డ్రైవ్, సాగర్ నగర్, విశాఖ‌ప‌ట్నం

saipriyabeachresort1

సాయి ప్రియా బీచ్ రిసార్ట్

ద‌క్షిణ భార‌త‌దేశంలోని ప‌రిశుభ్ర‌మైన బీచ్‌ల‌లో ఒక‌టి సాయి ప్రియా బీచ్ రిసార్ట్ . ఈ రిసార్ట్ విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యం నుండి సుమారు 22కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ రిసార్ట్‌లో అనేక ర‌కాల గ‌దులు ఉన్నాయి. ఈ రిసార్ట్ ప‌చ్చిక బ‌య‌ళ్లలో మ‌రియు స‌ముద్రానికి అభిముఖంగా ఉండడ‌మే కాకుండా, మీకు ఎంత‌గానో న‌చ్చే విందును కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఉరుకుల ప‌రుగులు జీవితంలో విశ్రాంతి కోరుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు. ఈ రిసార్ట్‌లో స్విమ్మింగ్ ఫూల్‌, బార్‌, రూమ్ స‌ర్వీస్‌తో పాటు ఇంట‌ర్నెట్ స‌దుపాయం కూడా ఉంది. ఈ రిసార్ట్ కుటుంబం, స్నేహితుల‌తో క‌లిసి గ‌డిపేందుకు మ‌రియు ఆడుకునేందుకు, సంద‌డి చేసేందుకు అనువైన ప్ర‌దేశం అనే చెప్పకోవాలి.

స్థానం: రుషికొండ

radissonbluresort1

రాడిసన్ బ్లూ రిసార్ట్

రాడిసన్ బ్లూ రిసార్ట్ వైజాగ్‌లోని విలాసవంతమైన ఫైవ్ స్టార్ రిసార్ట్‌ల‌లో ఒక‌టిగా ప్ర‌సిద్ధి చెందిది. ఈ రిసార్ట్‌ అందమైన ఇంటీరియర్స్ డిజైన్స్‌తో అలంక‌రించ‌బ‌డి ఉంటుంది. ఇందులో విశాలమైన బెడ్‌రూమ్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉచిత బైక్‌లు, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్, గార్డెన్ మరియు ఫిట్‌నెస్ సెంటర్లు వంటి సౌక‌ర్యాలు కూడా ఉన్నాయి. భార‌త‌దేశంలోని అతిపెద్ద క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ల‌లో ఒక‌టైన 15,500 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ రిసార్ట్ విశాఖ‌ప‌ట్నంలోని బీచ్‌రోడ్‌కు స‌మీపంలో ఉంటుంది. ఈ రిసార్ట్‌కు సుమారు 2.7 కిలోమీట‌ర్ల దూరంలో ఇందిరాగాంధి జులాజిక‌ల్ పార్క్ ఉంది. అక్క‌డి నుంచి 8.6 కిలోమీట‌ర్ల దూరంలో ఆసియాలోని మొట్ట‌మొద‌టి జ‌లాంత‌ర్గామి మ్యూజియం, కుర్సుర మ్యూజియం కూడా ఉన్నాయి.

స్థానం : రుషికొండ దగ్గర

novotelbhimiliresort1

నోవోటెల్ భీమిలి రిసార్ట్

నోవోటెల్ భీమిలి రిసార్ట్ పర్యాటకులకు మరియు వ్యాపార ప్రయాణీకులకు ఇష్టపడే ప్రదేశం. రిసార్ట్‌లో ఇన్ఫినిటీ పూల్, ఆవిరి స్నానాలు, స్పా మరియు మసాజ్, గేమ్‌లు మరియు యాక్టివిటీ సెంటర్ వంటివి మరెన్నో ఉన్నాయి. రోజువారీ అల్పాహారం బఫే, ఎ లా కార్టే లేదా కాంటినెంటల్ కూడా ఉంటాయి. ఈ రిసార్ట్ వ‌ద్ద అమెరికన్, చైనీస్ మరియు భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

స్థానం: భీమిలి

More News

Read more about: bay leaf resort ocean drive
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+